Reboot
-
Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే..
బట్టతల వచ్చినందుకు చాలా మంది మగవారు బాధపడుతూ ఉంటారు. తలపై వెంట్రుకలు లేని తమను ఎవరు చూస్తారని చింతిస్తూ ఉంటారు. కానీ బట్టతల ఉన్నవారికీ ఫ్యాన్స్ ఉన్నారు. గూగుల్‌లో బట్టతల అందగాళ్ల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, శారీరక లక్షణాల ఆధారంగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ప్రిన్స్ విలియం (Prince William) "2023లో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్"గా ఎంపికయ్యాడు. అమెరికన్ యాక్టర్ విన్ డీజిల్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్లను అధిగమించి టాప్‌లో నిలిచాడు. బట్టతల సెలబ్రిటీలను షర్టు లేకుండా చూడటానికి ఇంటర్నెట్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారన్న దానిపై రీబూట్ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు రూపొందించింది. బట్టతల సెలబ్రిటీల ఎత్తు, నెట్‌వర్త్, ముఖ నిష్పత్తి, బట్టతల మెరుపు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఈ "సెక్సీ" స్కోర్‌లో 10కి 9.88 స్కోర్‌తో ప్రిన్స్ విలియం అగ్రస్థానంలో నిలిచాడు. మిర్రర్ కథనం ప్రకారం.. సెలబ్రిటీల వాయిస్ ఫ్రీక్వెన్సీని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. అధ్యయనం మేరకు ప్రిన్స్ విలియం నెట్‌వర్త్ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.832 కోట్లు), ఎత్తు 1.91 మీటర్లు. ఇక వాయిస్ వియషంలో 10కి 9.91 స్కోర్, బట్టతల మెరుపులో 8.90 స్కోర్ సాధించాడు. మరోవైపు అమెరిన్ యాక్టర్ విన్ డీజిల్ 8.81 టోటల్ స్కోరుతో రెండవ స్థానంలో, జాసన్ స్టాథమ్ 8.51 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 7.12 స్కోర్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. -
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్‌గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్‌లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్‌కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్‌ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్‌పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్‌ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్‌ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్‌తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
ఈజిప్టు మమ్మీలతో డిష్యుం.. డిష్యుం!
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ చిత్రాల్లో ‘ద మమ్మీ’ ఒకటి. ఈజిప్టు మమ్మీల చరిత్ర నేపథ్యంలో దాదాపు 16 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి ఆ తర్వాత మరో మూడు భాగాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడీ చిత్రాన్ని రీబూట్ చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ యూనివర్శల్ సన్నాహాలు చేస్తోంది. విశేషం ఏమిటంటే ఇందులో హీరోగా హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ నటించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులు టామ్‌తో చర్చలు జరిపారట. అన్నీ కుదిరితే మాత్రం మమ్మీలతో టామ్ క్రూజ్ డిష్యుం...డిష్యుం చేయడం చూడొచ్చు.