ఈజిప్టు మమ్మీలతో డిష్యుం.. డిష్యుం!
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ చిత్రాల్లో ‘ద మమ్మీ’ ఒకటి. ఈజిప్టు మమ్మీల చరిత్ర నేపథ్యంలో దాదాపు 16 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి ఆ తర్వాత మరో మూడు భాగాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడీ చిత్రాన్ని రీబూట్ చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ యూనివర్శల్ సన్నాహాలు చేస్తోంది. విశేషం ఏమిటంటే ఇందులో హీరోగా హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ నటించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులు టామ్‌తో చర్చలు జరిపారట. అన్నీ కుదిరితే మాత్రం మమ్మీలతో టామ్ క్రూజ్ డిష్యుం...డిష్యుం చేయడం చూడొచ్చు.