చేజారిన హాలీవుడ్ ఆఫర్! | Deepika Padukone auditioned for Tom Cruise's Mummy, failed to make it? | Sakshi
Sakshi News home page

చేజారిన హాలీవుడ్ ఆఫర్!

Published Thu, May 5 2016 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

చేజారిన హాలీవుడ్ ఆఫర్!

చేజారిన హాలీవుడ్ ఆఫర్!

‘ఏజెంట్ త్రిబులెక్స్’ సీక్వెల్‌లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు కథానాయిక దీపికా పదుకొనే.  అయితే ఆమెకు మరో హాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చినట్టే  చేజారిందని సమాచారం. దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ హిట్ సిరీస్ ‘ద మమ్మీ’ని టామ్‌క్రూజ్ హీరోగా రీమేక్ చే యనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర దర్శక, నిర్మాతలు. అయితే ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆడిషన్స్‌లో దీపిక పాల్గొన్నారట. కానీ ఆమె ఎంపిక కాలేదని భోగట్టా. ఇదే సినిమా ఆడిషన్స్ కోసం మరో బాలీవుడ్ తార హ్యూమా ఖురేషీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, ఈ ఇద్దరికీ పిలుపు మాత్రం రాలేదు. అయితే,  చిత్ర బృందం మాత్రం వేరే  హీరోయిన్లను అన్వేషించే పనిలో ఉన్నారు. మరి ఈ అదృష్టం ఎవరికి దక్కుతుందో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement