
హాలీవుడ్ హారర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్‌లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్‌లో నటించారు.
జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment