WW84 Anniversary: Gal Gadot Comments On Her Role In Wonder Woman - Sakshi
Sakshi News home page

మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్‌ హీరోయిన్‌.. అదేంటంటే ?

Dec 26 2021 4:24 PM | Updated on Dec 27 2021 5:32 PM

Gal Gadot Express Her Feelings About Wonder Woman - Sakshi

Gal Gadot Express Her Feelings About Wonder Woman: హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం ఫాస్ట్‌ అండ్ ఫ్యూరియస్‌ సిరీస్‌లో సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా నటించిన హాలీవుడ్ బ్యూటీ గాల్‌ గాడోట్‌ సూపర్‌ హీరో 'వండర్‌ వుమెన్‌' సినిమాతో మోస్ట్ పాపులర్‌ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ భామ 2017లో వచ్చిన 'వండర్‌ వుమెన్‌'తో రాత్రికి రాత్రి స్టార్‌గా మారింది. అపారమైన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'వండర్‌ వుమెన్‌ 1984' చిత్రం విడుదలై ఆడియెన్స్‌తో నిజంగా 'వండర్‌' వుమెన్‌ అని అనిపించుకుంది. ఈ సినిమా రిలీజై శుక్రవారం (డిసెంబర్‌ 25)తో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ గాల్ గాడోట్‌ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. 

వండర్ వుమెన్‌ 1984 సినిమాలోని కొన్ని బిహైండ్‌ సీన్స్‌ను షేర్ చేసింది గాల్‌. అందులో సన్నివేశాల మధ్య కాఫీ తాగడం, విలన్‌ మాక్స్‌వెల్‌ లార్డ్‌ (పెడ్రో పాస్కల్‌)తో పరిహాసం చేయడం వంటివి ఉన్నాయి. అలాగే 'వండర్‌ వుమెన్‌ 1984 చిత్రం విడుదలై సంవత్సరం అవుతుంది. ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని  ఒక సంవత్సరం పూర్తి అయిందంటే నమ్మలేకపోతున్నాను. అలాంటి పాత్ర పోషించినందుకు నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. శక్తివంతమైన ఆ పాత్ర పోషించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.' అని గాల్‌ గాడోట్‌ తెలిపింది. అలాగే 'మళ్లీ వండర్‌ వుమెన్‌గా తిరిగి రావడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. అస్సలు వెయిట్‌ చేయలేకపోతున్నాను' అని వండర్‌ వుమెన్‌ 3 సినిమా గురించి హింట్‌ ఇచ్చింది.  

వండర్‌ వుమెన్‌ సిరీస్‌లోని మూడో సినిమాను గతేడాది డిసెంబర్‌లో ప్రకటించారు. ప్రిన్సెస్ డయనా స్టోరీని మరింత ముందుకు తీసుకుపోనున్నారు డైరెక్టర్‌ పాటీ జెంకిన్స్‌. 'వండర్‌ వుమెన్‌ 3' సినిమా డయనా గత జీవితం కాకుండా ఆధునిక కాలం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సంవత్సరం విడుదలైన 'రెడ్‌ నోటీస్‌' చిత్రంతో డ్వేన్‌ జాన్సన్‌, ర్యాన్‌ రెనాల్డ్స్‌తో హిట్‌ కొట్టింది గాల్‌ గాడోట్‌.


ఇదీ చదవండి: ఇండియన్‌ ఫుడ్‌ అంటే ఇష్టమంటున్న 'వండర్‌ వుమెన్‌'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement