ఫుడ్‌ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్న రాకుమారి | The Duke And Duchess Of Cambridge Shares Princess Charlotte Pics On Birthday | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్న రాకుమారి

Published Sat, May 2 2020 3:12 PM | Last Updated on Sat, May 2 2020 3:21 PM

The Duke And Duchess Of Cambridge Shares Princess Charlotte Pics On Birthday - Sakshi

లండన్‌: డ్యూక్‌ అండ్‌ డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ దంపతుల కుమార్తె ప్రిన్సెస్‌ చార్లెట్‌ నేడు ఐదో వసంతంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాజకుమారికి సంబంధించిన కొన్ని ఫొటోలను రాజసౌధ వర్గాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాయి. ‘‘పిన్సెస్‌ చార్లెస్‌ ఫొటోలను మీతో పంచుకోవడానికి ది డ్యూక్‌ అండ్‌ డచెస్‌ ఆఫ్‌ క్రేంబ్రిడ్జి సంతోషపడుతున్నారు. ది డచెస్‌ ఈ ఫొటోలు తీశారు. ఐసోలేషన్‌లో ఉన్న పెన్షనర్లకు ఆహారం అందించేందుకు రాజ కుటుంబం ఆహారపు పొట్లాలు చుట్టి పంపిణీ చేయనుంది’’అని పేర్కొన్నాయి.(కరోనా: అద్భుతమైన వార్త.. మిరాకిల్‌ బేబీ)

ఈ క్రమంలో చార్లెట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా.. ఫుడ్‌ ప్యాకెట్లను కాటన్లలో సర్దుతున్న రాకుమార్తె సేవా గుణాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ జంటకు ఇద్దరు కుమారులు ప్రిన్స్‌ లూయీస్‌, ప్రిన్స్‌ జార్జ్‌.. ఒక కుమార్తె ప్రిన్సెస్‌ చార్లెట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాజమాత క్వీన్‌ ఎలిజబెత్‌ ఏప్రిల్‌ 21న 94వ ఏట అడుగుపెట్టిన విషయం విదితమే. అయితే దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఆమె తన జన్మదిన వేడుకలను నామమాత్రంగా జరుపుకొన్నారు. ఇక శనివారం చార్లెట్‌ బర్త్‌డే సందర్భంగా ఫొటోలు షేర్‌ చేసి ముని మనుమరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement