Kate Middleton
-
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ
మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి. -
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
లండన్: క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్‌లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్‌ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్ తర్వాత కేట్ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్ శుక్రవారమే ప్రకటించారు. -
కేట్ మిడిల్టన్కు క్యాన్సర్
లండన్: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ (42) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. పొత్తికడుపు ఆపరేషన్ తర్వాత జనవరి నుంచి మీడియా ముందుకు రాని మిడిల్డన్ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికార్లు చేస్తుండటం తెలిసిందే. క్యాన్సర్‌కు కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కేట్ శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె ఏప్రిల్ దాకా విధులకు దూరంగా ఉండనున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడటం తెలిసిందే. -
Kate Middleton: నేను కేన్సర్‌తో పోరాడుతున్నా..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్‌తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్‌తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales) ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్‌తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అప్పటి నుంచి.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది. కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. -
బాల్‌గర్ల్‌గా బ్రిటన్ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టెన్నిస్‌లో ఎదురులేని ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సొగసరి ఆటగాడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో వింబుల్డన్ (గ్రాస్ కోర్టు)లోనే ఫెదరర్ అత్యధికంగా 8 టైటిల్స్ గెలిచాడు. స్వతహాగా ఫెదరర్‌కు వింబుల్డన్ అంటే చాలా ఇష్టం. రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌తో పోటీపడి మరీ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. అయితే.. వయసు మీద పడడం, గాయాలు వేధిస్తుండంతో ఫెదరర్ గతేడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి అంతర్జాతీయ టెన్నిస్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌కు ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు. తాజాగా జూలైలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ను పురస్కరించుకొని ప్రమోషనల్ భాగంగా మంగళవారం బాల్‌బాయ్స్, బాల్గర్ల్స్తో సరదాగా గడిపాడు. ఇదే సమయంలో బ్రిటన్ యువరాణి.. 'ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్'.. కేట్ మిడిల్టన్(Kate Middleton) వింబుల్డన్ కోర్టులోకి వచ్చింది. ఆమెను తనతో టెన్నిస్ ఆడేందుకు తొలుత ఫెదరర్ ఆహ్వానించాడు. దీంతో ఇద్దరు కలిసి కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలోనే యువరాణి ఓ పాయింట్ కూడా సంపాదించారు. బాల్ సరిగ్గా గీత మీద పడటంతో ఈ పాయింట్ రాగా.. ‘అమేజింగ్’ అంటూ ఫెదరర్ ప్రశంసించారు. కేట్ కొద్దిసేపు బాల్ గర్ల్‌గానూ వ్యవహరించారు. అయితే కేట్ మిడిల్టన్ నిబంధనలు మరవడంతో బాల్‌గర్ల్ ఆమెకు సలహా ఇచ్చింది. బంతి బౌన్స్ అయిన తర్వాతే మనం అందుకోవాలి అంటూ పేర్కొంది. ఈ క్రమంలోనే యువరాణి విజ్ఞప్తి మేరకు టెన్నిస్‌లో మెళకువలు నేర్పించాడు. ‘ఇది సరైన ప్రాక్టీస్. నేను ఇంప్రెస్ అయ్యాను’ అంటూ ఫెదరర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ రాయల్ పోషకురాలిగా ఉన్న కేట్.. వింబుల్డన్‌లోని రాయల్ బాక్స్‌లో తరచూ కనిపిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! -
నా అన్న కాలర్ పట్టి కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
శాక్రమెంటో: బ్రిటన్ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, ప్రిన్స్ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్ మార్కెల్ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు. ది గార్డియన్ కథనం ప్రకారం.. స్పేర్ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్ మార్కెల్ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. ఇంకా ఈ బుక్.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్ కథనం పేర్కొంది. జనవరి 10వ తేదీన స్పేర్ మార్కెట్లోకి రీలీజ్ కానుంది. గత సెప్టెంబర్‌లో తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!. 2020లో రాజరికాన్ని, బ్రిటన్ వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా. -
‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా కేట్ మిడిల్టన్
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 తన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్స్‌ను ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’గా, ఆయన భార్య కేట్ మిడిల్టన్ను ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా ప్రకటించారు. అంతేకాకుండా డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్‌గానూ విలియమ్స్ కొనసాగుతారు. ప్రిన్సెస్ డయానా తర్వాత ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ హోదా పొందిన తొలివ్యక్తి కేట్ మిడిల్టన్ కావడం గమనార్హం. డయానా మరణం తర్వాత ఈ హోదా ఇన్నాళ్లూ ఖాళీగానే ఉంది. యునైటెడ్ కింగ్డమ్(యూకే)తోపాటు కామన్వెల్త్ దేశాలకు విధేయుడిగా ఉంటానని, అంకితభావంతో సేవలందిస్తానని కింగ్ చార్లెస్ అన్నారు. బ్రిటన్ రాజు హోదాలో ఆయన శుక్రవారం సాయంత్రం తొలిసారిగా టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రియమైన తల్లి ఎలిజబెత్–2 తనపై అమితమైన ప్రేమ చూపించారని, ఆప్యాయత అందించారని, మార్గదర్శిగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. జీవితాంతంప్రజా సేవలో గడిపారని అన్నారు. ఆమె జీవితం తనకొక ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఆమె లోటును తనతోపాటు ఎంతోమంది అనుభవిస్తున్నారన్నారు. రెండో కుమారుడు హ్యారీ, అతడి భార్య మేఘన్‌కు కింగ్ చార్లెస్–3 శుభాకాంక్షలు తెలిపారు. జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్న వారిద్దరి పట్ల తన ప్రేమను వ్యక్తీకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హ్యారీ రాచరిక హోదా వదులుకుని భార్యతో పాటు అమెరికాలో ఉంటున్నారు. -
ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్న రాకుమారి
లండన్: డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతుల కుమార్తె ప్రిన్సెస్ చార్లెట్ నేడు ఐదో వసంతంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాజకుమారికి సంబంధించిన కొన్ని ఫొటోలను రాజసౌధ వర్గాలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ‘‘పిన్సెస్ చార్లెస్ ఫొటోలను మీతో పంచుకోవడానికి ది డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ క్రేంబ్రిడ్జి సంతోషపడుతున్నారు. ది డచెస్ ఈ ఫొటోలు తీశారు. ఐసోలేషన్‌లో ఉన్న పెన్షనర్లకు ఆహారం అందించేందుకు రాజ కుటుంబం ఆహారపు పొట్లాలు చుట్టి పంపిణీ చేయనుంది’’అని పేర్కొన్నాయి.(కరోనా: అద్భుతమైన వార్త.. మిరాకిల్ బేబీ) ఈ క్రమంలో చార్లెట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా.. ఫుడ్ ప్యాకెట్లను కాటన్లలో సర్దుతున్న రాకుమార్తె సేవా గుణాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా విలియం, కేట్ మిడిల్టన్ జంటకు ఇద్దరు కుమారులు ప్రిన్స్ లూయీస్, ప్రిన్స్ జార్జ్.. ఒక కుమార్తె ప్రిన్సెస్ చార్లెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాజమాత క్వీన్ ఎలిజబెత్ ఏప్రిల్ 21న 94వ ఏట అడుగుపెట్టిన విషయం విదితమే. అయితే దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఆమె తన జన్మదిన వేడుకలను నామమాత్రంగా జరుపుకొన్నారు. ఇక శనివారం చార్లెట్ బర్త్‌డే సందర్భంగా ఫొటోలు షేర్ చేసి ముని మనుమరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram The Duke and Duchess of Cambridge are very pleased to share four new photographs of Princess Charlotte ahead of her fifth birthday tomorrow. The images were taken by The Duchess as the family helped to pack up and deliver food packages for isolated pensioners in the local area. A post shared by Kensington Palace (@kensingtonroyal) on May 1, 2020 at 2:30pm PDT -
‘పాక్ మాకు అత్యంత ముఖ్యమైన దేశం’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని బ్రిటన్ రాజవంశీకుడు ప్రిన్స్ విలియం అన్నారు. పాక్‌లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్ అగ్ర స్థానంలో ఉందని పేర్కొన్నారు. పాక్, యూకేలు చాలా విషయాల్లో సారూప్యాన్ని కలిగి ఉన్నాయని.. పాకిస్తాన్ మూలాలు ఉన్న సుమారు ఒకటిన్నర మిలియన్ల మంది ప్రజలు తమ దేశంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. బాలికా విద్య, సమానత్వం, వాతావరణ మార్పు తదితర సామాజిక అంశాలపై ప్రిన్స్ విలియం దంపతులు వివిధ దేశాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రిన్స్ విలియం, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి కేట్ మిడిల్టన్ ఐదు రోజుల పాటు పాక్ పర్యటనకు బయల్దేరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధ్యక్షుడు అల్విలను రాజ దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక అంశాల అవగాహనకై విలియం దంపతులు చేస్తున్న కృషిని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. యువ పాకిస్తానీలతో రాజ కుటుంబీకులు భేటీ కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలో ప్రిన్స్ డయానాకు పాకిస్తాన్ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అదే విధంగా పొరుగుదేశాలైన భారత్, అఫ్గనిస్తాన్‌లతో తమ దేశానికి ఉన్న సంబంధాల గురించి వారికి వివరించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విలియంకు తెలిపారు. అలాగే అఫ్గనిస్తాన్‌తో మైత్రి సాధించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా పాక్ పర్యటన(ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పంక్తువా)లో భాగంగా విలియం, కేట్ ఇస్లామాబాద్‌లో ఉన్న మహిళా మోడల్ కాలేజీని సందర్శించారు. యూకే విద్యా విధానాన్ని అనుసరిస్తున్న సదరు కాలేజీ విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మార్గల్లా హిల్స్‌లో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లో బ్రిటీష్ హై కమిషనర్ ధామస్ డ్ర్యూ, డ్యూక్ వ్యక్తిగత ప్రధాన కార్యదర్శి సిమన్ కేస్, డ్యూక్ అండ్ డచెస్ కమ్యూనికేషన్ సెక్రటరీ క్రిస్టియన్ జోన్స్ విలియం దంపతుల వెంటే ఉన్నారు. కాగా 2006 తర్వాత బ్రిటన్ రాజ వంశీకులు పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. ప్రిన్స్ చార్లెస్, కామిల్లా తర్వాత విలియం, కేట్ పాక్‌లో పర్యటించడాన్ని రిస్క్‌తో కూడిన పర్యటనగా కింగ్స్టన్ ప్యాలెస్ పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ పర్యటన అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు తెలిపింది. -
స్త్రీలోక సంచారం
బ్రిటన్: రాజకుటుంబపు తోడికోడళ్లు కేట్ మిడిల్టన్, మేఘన్ మార్కెల్ మధ్య కొన్నాళ్లుగా విభేదాలు తలెత్తాయని, పైకి ఎలా ఉన్నా లోలోపల వారికి ఒకరంటే ఒకరికి పడటం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రిస్మస్ రోజున ఇద్దరూ కలివిడిగా నవ్వుకుంటూ సెయింట్ మేరీ మగ్దలీనా చర్చికి వెళ్లి వస్తూ కనిపించడం ఆ దేశంలో పెద్ద విశేషం అయింది. బెంగళూరు: ఇంటి పనిమనిషితో చేతులు కలిపిన ముఠా ఒకటి తన ఫొటోలతో మార్ఫింగ్ వీడియోను తయారుచేయించి, తనను బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటి వరకు 60 లక్షల రూపాయలను తన నుంచి బలవంతంగా వసూలు చేయడమే కాక, తన కూతుర్నీ డబ్బు కోసం వేధిస్తోందని బిజినెస్‌మన్ భార్య ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదురై: రక్తహీనత ఉన్న ఒక గర్భిణికి ఎక్కించిన రక్తంలో హెచ్.ఐ.వి. ఉన్నట్లు నిర్ధారణ అవడంతో బాధితురాలు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆమెకు ఎక్కించిన రక్తం ఒక రక్తదాన శిబిరంలో 17 ఏళ్ల యువకుడు ఇచ్చినదిగా గుర్తించిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. విమర్శ: మమతాబెనర్జీ, తనకు ముందుండి పోయిన సీపీఎం ప్రభుత్వం మాదిరిగానే ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ విమర్శించారు. తగ్గుదల: భారతదేశంలో ఉద్యోగాలకు, ఉపాధి పనులకు వెళ్లే మహిళల సంఖ్య పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే బాగా తగ్గిపోయినట్లు ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’ 2017 నివేదిక వెల్లడించింది. -
ఇట్టే కలిసిపోయారు!!
బుధవారం ఎవరి పనిమీద వాళ్లు బైటికొచ్చారు మేఘన్ మార్కెల్, కేట్ మిడిల్టన్. మేఘన్.. ప్రిన్స్ హ్యారీ భార్య. కేట్.. ప్రిన్స్ విలియమ్స్ భార్య. ఇద్దరూ తోడికోడళ్లు. అయితే ఒకరికొకరు తోడుగా ఏమీ వాళ్లు బయటికి రాలేదు. ఎవరికి వారుగా వెళ్లిపోయారు. మేఘన్ వెళ్లింది ఒక వంటల ప్రోగ్రామ్‌కి చీఫ్ గెస్ట్‌గా. కేట్ Ðð ళ్లింది.. లండన్ యూనివర్సిటీ కాలేజ్‌లోని న్యూరోసైన్స్ యూనిట్‌కి. లండన్‌లో ‘హబ్’ అనే ముస్లిం కమ్యూనిటీ ఉంది. వాళ్లు చేసే వంటలకు పబ్లిసిటీ ఇచ్చేందుకు వెళ్లారు మేఘన్. న్యూరోసైన్స్ యూనిట్లో.. పిల్లల బ్రెయిన్ వికసించే పరిణామక్రమంలో లెక్చర్ వినేందుకు వెళ్లారు కేట్. ఇక్కడి వరకు విశేషం ఏమీ లేదు. అనుకోకుండా ఇద్దరూ ఒకే డ్రెస్‌లో లండన్ వీధుల్లోకి వచ్చారు. అదీ విశేషం. మేఘన్ మెరూన్ డ్రెస్‌తో వచ్చారు. సేమ్ అలాంటిదే వేస్కుని, బ్లాక్ కాంబినేషన్‌తో కేట్ ప్రత్యక్షం అయ్యారు. డ్రెస్ మాత్రమే ‘సేమ్ పించ్’ కాదు. ‘లో పోనీ టైల్’ కూడా సేమ్. ప్లాన్ చేసుకునే వచ్చారా ఏంటి? పెద్ద నవ్వు. ఇద్దరిదీ! దానర్థం ‘నో ప్లానింగ్’ అని. కేట్ డ్రెస్ ‘పాల్కా’ బ్రాండ్. ప్యారిస్ నుంచి ఇంపోర్ట్ అయింది. 2012 నుంచి సేమ్ డ్రెస్‌ను రిపీట్ చేస్తున్నారు కేట్. మేఘన్ వేసుకున్న బ్రాండ్ ‘క్లబ్ మొనాకో’. యు.ఎస్. కంపెనీ. కొంచెం ఖరీదైంది. చిరునవ్వు ఇద్దరు అపరిచితులను కలుపుతుంది. సేమ్ పించ్ రెండు చిరునవ్వులను వెలిగిస్తుంది. ఒకే విధమైన డ్రెస్ వేసుకొచ్చిన ఇద్దరు నార్మల్ పర్సన్స్ ఆ పూటకి సెలబ్రిటీలు! ఒకే డ్రెస్‌లో కనిపించిన ఇద్దరు సెలబ్రిటీలు.. ఆ పూటకు సామాన్యులు. ఆ సామాన్యతే ఈ ఇద్దరు కోడళ్లకు ఎప్పటికప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఇస్తోంది. సేమ్ పించ్ -
స్త్రీలోక సంచారం
ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ‘పిత్ హెల్మెట్’ (బ్రిటిష్ టోపీ) పెట్టుకోవడంపై తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వలస పాలనకు సంకేతమైన బ్రిటిష్ టోపీని.. అమెరికన్ ప్రథమ మహిళగా ఆమె ఎలా ధరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెలానియా గత శుక్రవారం కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్‌ను «ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. మెలానియా ఇలా పొరపాటుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్‌లో టెక్సాస్‌లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే అక్షరాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. ఇప్పుడిక ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మెలానియాపై (నేటితో పర్యటన ముగుస్తుంది).. ఆఫ్రికన్లంతా ‘ఫ్లోటస్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బింగో’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోలింగ్ జరిగిపుతున్నారు. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. బింగో అంటే ఆట. ఆఫ్రికన్ల మనోభావాలతో మెలానియా ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నవారు నెట్లో ఈ హ్యాష్‌ట్యాగ్ సృష్టించి ఆమెను తలా ఓ మాట అంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య కీచులాటల్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. టీవీ సీరియళ్లు కూడా కీచులాటలు పెట్టడానికి సాధారణంగా అత్తాకోడళ్లనే ఎంచుకుంటాయి. నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఓ అత్త తన కోడలికి కిడ్నీ ఇచ్చి ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా గాంధీనగర్‌లో ఉంటున్న గనీ దేవి (60) కోడలు సోనికా (32) ఏడాదిక్రితం వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయాయని, కనీసం ఒక కిడ్నీనైనా మార్చందే ఆమెను కాపాడుకోవడం అసాధ్యం అని వైద్యులు సోనికా కుటుంబ సభ్యులకు తెలిపారు. సోనికా తల్లి కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యులు చెప్పారు కానీ, సోనికా తల్లి భన్వారీదేవి.. భయంతో అందుకు అంగీకరించలేదు. తమ్ముడి కిడ్నీ గానీ, తండ్రి కిడ్నీ గానీ పనికొస్తుందని తెలిసినప్పుడు వాళ్లిద్దరు కూడా కిడ్నీ ఇవ్వడానికి విముఖత చూపారు. చివరికి అత్తగారు ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానన్నారు. ఆమె కిడ్నీ పనికొస్తుందని వైద్యులు చెప్పిన వెంటనే ఆమె తన కోడలికి కిడ్నీ ఇచ్చేందుకు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముందుకు వచ్చారు. గత నెల 13న ఢిల్లీలో సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. సోనికా ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఉన్నారు. ‘మా అత్తగారికి నేను జీవితాంతం, జీవితానంతరం కూడా రుణపడి ఉంటాను’ అని ఆమెకు చేతులు జోడించి మరీ చెబుతోంది సోనికా. కిడ్నీ ఇచ్చిన విషయం అత్తగారు చెప్పుకోలేదు కానీ.. ఆసుపత్రిలోని వారెవరో మీడియాతో చెప్పడంతో ఈ అత్తగారి త్యాగ గుణం గురించి బయటికి తెలిసింది. ప్రసవమంత అందమైన అనుభవం లేదని కొత్త తల్లులను మభ్యపెట్టే విధంగా బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్డన్ (36) తనకు కాన్పు జరిగిన ప్రతిసారీ హాస్పిటల్ నుంచి అందంగా తయారై, బిడ్డను చేత్తో పట్టుకుని నడుస్తూ టీవీలో కనిపించడం బాధ్యతారహిత్యమని హాలీవుడ్ స్టార్ కైరా నైట్లీ (33) కొత్తగా తను రాసిన ‘ది వీకర్ సెక్స్’ అనే వ్యాసంలో విమర్శించారు. ‘‘చూస్తున్నాను కదా. తన మూడు ప్రసవాలలోనూ కేట్ ఇలాగే చేశారు. జన్మనిచ్చాక కూడా తల్లులు ఇలాగే తాజాగా ఉంటారని అనుకునేలా ప్రసవం అయిన కొన్ని గంటలకే ముస్తాబై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. ఇదంతా నేను టీవీలో చూశాను. ఎందుకింత అబద్ధం. స్త్రీకి కాన్పు ఎలాంటిదో నాకు తెలుసు. ఆ షిట్టు, ఆ రక్తం, ఆ వాంతులు, ఆ కుట్లు.. అసలు జన్మనివ్వడం అనేది సాఫీగా, సవ్యంగా జరిగే విషయం కాదు. ఇవన్నీ ఎందుకు దాస్తున్నావ్ కేట్. అమాయకపు ఆడపిల్లలు నమ్మేందుకా? ఉన్న సంగతి చెప్పేందుకు బలం కావాలి. ఇప్పుడు చెప్పు.. ఒక బాధాకరమైన స్థితి గురించి అందమైన అబద్ధం చెబుతున్న నువ్వు వీకర్ సెక్సా? ఉన్నది ఉన్నట్లుగా బయట పెడుతున్న నేను వీకర్ సెక్సా?’ అని తన వ్యాసంలో కేట్కు ప్రశ్నలు సంధించారు కైరా. 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన కైరా.. తన దారుణమైన ప్రసవ వేదనను ‘ఫెమినిస్ట్స్ డోన్ట్ వేర్ పింక్’ (అండ్ అదర్ లైస్) అనే పుస్తకంలో వర్ణించారు. ఇప్పుడీ వ్యాసంలో ఆనాటి చేదు అనుభవాన్ని పునర్లిఖించారు. -
స్త్రీలోక సంచారం
ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ‘పిత్ హెల్మెట్’ (బ్రిటిష్ టోపీ) పెట్టుకోవడంపై తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వలస పాలనకు సంకేతమైన బ్రిటిష్ టోపీని.. అమెరికన్ ప్రథమ మహిళగా ఆమె ఎలా ధరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెలానియా గత శుక్రవారం కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్‌ను «ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. మెలానియా ఇలా పొరపాటుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్‌లో టెక్సాస్‌లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే అక్షరాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. ఇప్పుడిక ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మెలానియాపై (నేటితో పర్యటన ముగుస్తుంది).. ఆఫ్రికన్లంతా ‘ఫ్లోటస్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బింగో’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోలింగ్ జరిగిపుతున్నారు. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. బింగో అంటే ఆట. ఆఫ్రికన్ల మనోభావాలతో మెలానియా ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నవారు నెట్లో ఈ హ్యాష్‌ట్యాగ్ సృష్టించి ఆమెను తలా ఓ మాట అంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య కీచులాటల్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. టీవీ సీరియళ్లు కూడా కీచులాటలు పెట్టడానికి సాధారణంగా అత్తాకోడళ్లనే ఎంచుకుంటాయి. నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఓ అత్త తన కోడలికి కిడ్నీ ఇచ్చి ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా గాంధీనగర్‌లో ఉంటున్న గనీ దేవి (60) కోడలు సోనికా (32) ఏడాదిక్రితం వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయాయని, కనీసం ఒక కిడ్నీనైనా మార్చందే ఆమెను కాపాడుకోవడం అసాధ్యం అని వైద్యులు సోనికా కుటుంబ సభ్యులకు తెలిపారు. సోనికా తల్లి కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యులు చెప్పారు కానీ, సోనికా తల్లి భన్వారీదేవి.. భయంతో అందుకు అంగీకరించలేదు. తమ్ముడి కిడ్నీ గానీ, తండ్రి కిడ్నీ గానీ పనికొస్తుందని తెలిసినప్పుడు వాళ్లిద్దరు కూడా కిడ్నీ ఇవ్వడానికి విముఖత చూపారు. చివరికి అత్తగారు ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానన్నారు. ఆమె కిడ్నీ పనికొస్తుందని వైద్యులు చెప్పిన వెంటనే ఆమె తన కోడలికి కిడ్నీ ఇచ్చేందుకు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముందుకు వచ్చారు. గత నెల 13న ఢిల్లీలో సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. సోనికా ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఉన్నారు. ‘మా అత్తగారికి నేను జీవితాంతం, జీవితానంతరం కూడా రుణపడి ఉంటాను’ అని ఆమెకు చేతులు జోడించి మరీ చెబుతోంది సోనికా. కిడ్నీ ఇచ్చిన విషయం అత్తగారు చెప్పుకోలేదు కానీ.. ఆసుపత్రిలోని వారెవరో మీడియాతో చెప్పడంతో ఈ అత్తగారి త్యాగ గుణం గురించి బయటికి తెలిసింది. ప్రసవమంత అందమైన అనుభవం లేదని కొత్త తల్లులను మభ్యపెట్టే విధంగా బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్డన్ (36) తనకు కాన్పు జరిగిన ప్రతిసారీ హాస్పిటల్ నుంచి అందంగా తయారై, బిడ్డను చేత్తో పట్టుకుని నడుస్తూ టీవీలో కనిపించడం బాధ్యతారహిత్యమని హాలీవుడ్ స్టార్ కైరా నైట్లీ (33) కొత్తగా తను రాసిన ‘ది వీకర్ సెక్స్’ అనే వ్యాసంలో విమర్శించారు. ‘‘చూస్తున్నాను కదా. తన మూడు ప్రసవాలలోనూ కేట్ ఇలాగే చేశారు. జన్మనిచ్చాక కూడా తల్లులు ఇలాగే తాజాగా ఉంటారని అనుకునేలా ప్రసవం అయిన కొన్ని గంటలకే ముస్తాబై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. ఇదంతా నేను టీవీలో చూశాను. ఎందుకింత అబద్ధం. స్త్రీకి కాన్పు ఎలాంటిదో నాకు తెలుసు. ఆ షిట్టు, ఆ రక్తం, ఆ వాంతులు, ఆ కుట్లు.. అసలు జన్మనివ్వడం అనేది సాఫీగా, సవ్యంగా జరిగే విషయం కాదు. ఇవన్నీ ఎందుకు దాస్తున్నావ్ కేట్. అమాయకపు ఆడపిల్లలు నమ్మేందుకా? ఉన్న సంగతి చెప్పేందుకు బలం కావాలి. ఇప్పుడు చెప్పు.. ఒక బాధాకరమైన స్థితి గురించి అందమైన అబద్ధం చెబుతున్న నువ్వు వీకర్ సెక్సా? ఉన్నది ఉన్నట్లుగా బయట పెడుతున్న నేను వీకర్ సెక్సా?’ అని తన వ్యాసంలో కేట్కు ప్రశ్నలు సంధించారు కైరా. 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన కైరా.. తన దారుణమైన ప్రసవ వేదనను ‘ఫెమినిస్ట్స్ డోన్ట్ వేర్ పింక్’ (అండ్ అదర్ లైస్) అనే పుస్తకంలో వర్ణించారు. ఇప్పుడీ వ్యాసంలో ఆనాటి చేదు అనుభవాన్ని పునర్లిఖించారు. -
అందరు ఎందుకు ఫొటో తీయడానికి పోటీ పడుతున్నారు
-
వీళ్లంతా మీ ఫొటో తీస్తున్నారేందుకు..?!
లండన్ : అప్పుడప్పుడు చిన్న పిల్లలు అడిగే అమాయకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలికేం కాదు. అలాంటి సందర్భాల్లో చాలామంది ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. ఇదే పరిస్థితి బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్కి ఎదురయ్యింది. కానీ ఆమె చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. ఈమధ్యే ప్రసూతి సెలవులు ముగించుకున్న కేట్ మిడిల్టన్ వెస్ట్ లండన్‌లో సయేర్స్ క్రాఫ్ట్స్ ఫారెస్ట్ స్కూల్‌ని, వైల్డ్ లైఫ్ గార్డెన్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు కేట్‌ని ఫొటో తీయడానికి పోటీ పడ్డారు. ఈ హడావుడి చూసిన పిల్లలకు ‘ఏంటి ఈమె ప్రత్యేకత.. అందరు ఎందుకు ఈమెని ఫొటో తీయడానికి ఇంతలా పోటీ పడుతున్నారు’ అనే అనుమానం మొదలయ్యింది. సందేహం అయితే వచ్చింది కానీ ఎవరూ దాన్ని బయటపెట్ట లేదు. కానీ ఓ చిన్నారి మాత్రం ధైర్యంగా ‘వీళ్లంతా ఎందుకు మిమ్మల్ని ఫోటో తీస్తున్నారు’ అని కేట్‌ని అడిగింది. అందుకు యువరాణి నవ్వుతూ ‘వారంతా నన్ను ఫొటో తీయడం లేదు.. నిన్ను ఫొటో తీస్తున్నారు. ఎందుకంటే నువ్వు చాలా ప్రత్యేకం కదా’ అంటూ సమాధానం చెప్పారు. కేట్ చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక అక్కడున్న వారిని కూడా సంతోషపెట్టింది. కేట్ సమాధానం విన్న నెటిజన్లు ‘ఎంతైనా ముగ్గురు పిల్లలకు తల్లి కదా..! పిల్లలతో ఎలా ప్రవర్తించాలో బాగానే తెలిసి ఉంటుందం’టూ ప్రశంసిస్తున్నారు. అంతేకాక ‘అవును మరి అంత చిన్న బుర్రకు కేట్ యువరాణి అని.. అందుకే ఫొటో తీస్తున్నారంటే ఎలా అర్థమవుతుంది.. అర్థమవ్వకపోగా మరిన్ని సందేహాలు తలెత్తే అవకాశం ఉందం’టూ కామెంట్ చేస్తున్నారు. -
బుల్లి యువరాజు హత్యకు కుట్ర..
లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్డన్ ముద్దుల కొడుకు ప్రిన్స్ జార్జ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది ఈ హత్యకు కుట్ర చేశాడు. దీంతో రషీదును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాను బుల్లి యువరాజు జార్జ్ హత్యకు కుట్ర చేసినట్టు రషీదు కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనికి 25 ఏళ్ల శిక్షను విధించారు. లండన్‌లోని వూల్విచ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును వెలవరించారు. టెలిగ్రామ్ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు. కాగా, జార్జ్‌ను హత్య చేస్తామంటూ గత అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బ్రిటన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు, చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో ‘యుద్ధమనేది వస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని తెలిపారు. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
మర్యాద మర్యాద
బ్రిటన్ రాచకుటుంబంలోకి కొత్తగా ఎవరు అడుగు పెట్టినా అంతఃపుర సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవలసిందే. ఏం తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎలా మాట్లాడాలి... ఇలా ప్రతి విషయంలోనూ ఆచారం, వ్యవహారం ఉంటుంది. ఇవి కాకుండా మరికొన్ని నిబంధనల్ని స్వయంగా బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ విధిస్తారు. మొదటిది వస్త్రధారణ. అందుకు తగ్గట్లుగా మహారాణి దగ్గరకు వెళ్లేటప్పుడు ఆ కుటుంబంలోకి కొత్తగా వెళ్లిన మేఘన్ మార్కల్ (ప్రిన్స్ హ్యారీ భార్య) ఇప్పుడు ఎత్తు చెప్పులు ధరించడం లేదు. మార్కల్‌కు ఎత్తు చెప్పులంటే ఇష్టం అయినప్పటికీ రాణి గారికి ఇష్టం లేదు. అందుకే అధికార కార్యక్రమాలలో రాణిగారు లేని సమయంలో మాత్రమే తోడికోడళ్లిద్దరూ ఎత్తుచెప్పులు వేసుకుంటున్నారు. గత మే నెలలో మేఘన్ రాజప్రాసాదంలోకి ప్రవేశించాక, ఎత్తు చెప్పులతో ఫొటోలకు చిక్కలేదు కానీ ఇటీవల తన తెలియనితనంతో రాయల్ ఫ్యామిలీ ఆగ్రహానికి గురికావలసి వచ్చింది! బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘన్ రెండు తప్పులు చేసినట్లుగా గుర్తించారు. ఆ కార్యక్రమంలో రాణిగారు ఆసీనులై ఉన్న వరుసలోనే కూర్చున్న మేఘన్ కాలు మీద కాలు వేసుకోవడం ఒక తప్పు. అయితే చాలా త్వరగానే ఆమె తన తప్పును సరిచేసుకున్నారు. ఇంకో తప్పేమిటంటే.. రాణి గారు ఉండగానే ప్రిన్స్ హ్యారీ చేతిని తన చేతిలోకి తీసుకోవడం. దీనిపై ఇప్పుడు బ్రిటన్‌లో పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ‘తెలియని పిల్ల’ అని రాణిగారు సరిపెట్టుకున్నట్లున్నారు. మేఘన్ రాజకుటుంబంలో కొత్త సభ్యురాలయ్యాక తెలుసుకున్న ఇంకో సంగతి ఏంటంటే.. భోజనంలో వెల్లుల్లి తీసుకోకూడదు. నలుగురితో కలిసి తింటున్నప్పుడు వెల్లుల్లి వాసన రాకూడదనే ఈ నిషేధం విధించారు. అయితే మేఘన్ తాను ఒంటరిగా భోజనం చేసేటప్పుడు కావలసినంత వెల్లుల్లి తినడానికి అనుమతి ఉంది. ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడిప్పుడే మేఘన్ అలవాటుపడుతున్నారు. – రోహిణి -
మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్
లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, యువరాణి కేట్ మిడిల్టన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి. ఇప్పటికే రాజ దంపతులకు నాలుగేళ్ల రాకుమారుడు జార్జ్, రెండేళ్ల రాకుమారి చార్లెట్లు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన రాకుమారుడి పేరు ఇంకా ఖరారు చేయలేదు. బ్రిటిష్ సింహాసనం అధిష్టించే వారిలో నూతన రాకుమారుడు ఐదో వారసుడు. -
రాజకుటుంబంలో బాబు పుట్టాడోచ్!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో బుల్లి వారసుడు వచ్చాడు. ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్ సోమవారం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. లండన్‌లోని సెయింట్ మెరీ ఆస్పత్రిలో కేట్ మూడో బిడ్డను ప్రసవించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని రాయల్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్స్, కేట్ దంపతులకు బాబు జార్జ్, పాప చార్లెట్.. ఉన్నారు. మూడో బిడ్డను ప్రసవించే సమయంలో కేట్ పక్కన ప్రిన్స్ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. కేట్ తాజాగా జన్మనిచ్చిన శిశువు బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబేత్ ఆరో మునిమనవడు కాగా.. బ్రిటన్ సింహాసనం అధిరోహించబోయేవారిలో ఐదో వ్యక్తిగా ఉండనున్నాడు. -
ఆకర్షిస్తున్న యువరాణి చేతి వేళ్లు.. వైరల్
లండన్ : ఇంటర్నెట్లో ఇప్పుడు ఓ అంశంపై తెగ చర్చ నడుస్తోంది. బ్రిటన్ టాబ్లాయిడ్లలో, వెబ్ సైట్లలో ఆ అంశంపై మోతమోగిపోతోంది. ఇక డెయిలీ మెయిల్ అయితే ఏకంగా తన ముఖ పేజీలో ఒక స్టోరీనే ప్రచురించింది. ఇంతకీ ఏమిటా అంశం అంటే బ్రిటన్ ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ చేతివేళ్లు. 'ఎందుకు కేట్ వేళ్లు సమానంగా ఉన్నాయి?' అనే హెడ్డింగ్‌తో డెయిలీ మెయిల్ పెద్ద కథనం వెలువరించింది. అంతేకాదు ఆమె చేతి వేళ్లను కూడా బాగా దగ్గరిగా చేసి ఛాయాచిత్రంగా ప్రచురించింది. అసలేం జరిగింది? గత వారం ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు తల్లి అయి ప్రస్తుతం గర్భవతిగా ఉన్న బ్రిటన్ యువరాణి కేట్ ఆక్స్‌ఫర్డ్‌లోని పిగాసస్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఓ చారిటీ సంస్థ పనితీరును అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లారు. సాధారణంగానే ఆమెను ఫొటోలు ఎప్పటి మాదిరిగానే తీశారు. అయితే, ఆ ఫొటోలు పరిశీలించిన వారు ఆమె కుడిచేత్తో పర్సును పట్టుకున్న సమయంలో ఆమె చేతి వేళ్లు మూడు సమానంగా కనిపించాయి. ఉంగరపు వేలు కొంచెం చిన్నగా, చూపుడువేలు దానికి కాస్త సమానంగా మధ్య వేలి పొడవుగా అందరికీ ఉంటుంది. అయితే, కేట్కు మాత్రం మూడు వేళ్లు సమానంగా ఉన్నట్లు కనిపించాయి. దాంతో ఇదే అంశంపై పెద్ద మొత్తంలో చర్చ మొదలుపెట్టి పుంఖాను పుంఖాలుగా టాబ్లాయిడ్లలో రాతలు మొదలుపెట్టారు. -
యువరాజు హత్యకు కుట్ర
లండన్ : బ్రిటన్ యువరాజు జార్జ్ ఐసిస్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ల తొలి సంతానం జార్జ్. నాలుగేళ్ల వయసున్న యువరాజును హతమారుస్తామని సోషల్‌మీడియా వేదికగా ఐసిస్ ప్రకటించడంతో బ్రిటన్‌లో కలకలం రేగింది. గత నెలలోనే జార్జ్ పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. జార్జ్ స్కూల్‌కు వెళ్లేప్పుడు దాడి చేసి హతమార్చాలని ఐసిస్ యోచిస్తున్నట్లు తెలిసింది. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
మళ్లీ తండ్రి కాబోతున్న ప్రిన్స్
లండన్: బ్రిటన్ యువరాజు విలియం మూడోసారి తండ్రి కాబోతున్నారు. విలియం, క్యాథరిన్ మిడిల్టన్ దంపతులకు ఇప్పటికే ప్రిన్స్ జార్జి(4), ప్రిన్సెస్ చార్లెట్(2) లనే ఇద్దరు సంతానం ఉన్నారు. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి మూడో సారి తల్లి కాబోతున్నారని కెన్సింగ్టన్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. రాజకుటుంబమంతా ఈ వార్తతో చాలా ఆనందంతో ఉందని తెలిపింది. ప్రస్తుతం మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న కేట్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నట్లు ప్యాలెస్ వర్గాలు వివరించాయి. కాగా కేట్ 2013 జూలైలో తొలి బిడ్డ ప్రిన్స్ జార్జికి జన్మనిచ్చారు. 2015 మే లో రెండవ సంతానంగా ప్రిన్సెస్ చార్లెట్ ఎలిజబెత్ డయానా పుట్టింది. -
యువరాణి టాప్‌లెస్ ఫొటోలు.. ప్రిన్స్ దావా!
-
యువరాణి టాప్‌లెస్ ఫొటోలు.. ప్రిన్స్ దావా!
పారిస్: సంచలనం రేపిన బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు జర్నలిస్టులను మంగళవారం ప్రశ్నించింది. ఐదేళ్లకిందట ప్రిన్స్ దంపతులు దక్షిణ ఫ్రాన్స్‌లో ఓ ఫాం హౌస్‌లో విడిది చేశారు. అనుమతి లేకుండా మూడోవ్యక్తి ప్రవేశించలేని ఆ ఫాం హౌస్‌లో కేట్ మిడిల్టన్ టాప్ లెస్ గా భర్తతో కలిసి సన్ బాత్ చేయగా ఫొటోలు తీసి.. ఫ్రెంచ్ గాసిప్ మ్యాగజైన్, పేపర్ క్లోజర్ లో 2012 సెప్టెంబర్‌లో ప్రచురించారు. తమ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఫొటోలు ప్రచురించిన మ్యాగజైన్ నష్టపరిహారంగా 1.5మిలియన్ యూరోలను చెల్లించాలని బ్రిటన్ రాకుమారుడు విలియమ్ దంపతులు దావా వేశారు. పత్రికల మొదటి పేజీలో ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ మిడిల్టన్ తరఫు న్యాయవాదుల వాదనకు కోర్టు గతేడాది మొగ్గుచూపింది. టాప్ లెస్ ఫొటోలు ప్రచురించిన క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణ చేపట్టింది. ఆ టాప్‌లెస్ ఫొటోలు ఇప్పటికీ యూరోపియన్ పబ్లికేషన్స్ అయిన ఇటలీలో చే, స్వీడన్, డెన్మార్క్‌లలో డైలీ స్టార్, సిస్టర్ మ్యాగజైన్స్‌లలో ప్రచురితం అవుతుండటం గమనార్హం. దీంతో ప్రిన్స్ దంపతులు న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. క్లోజర్ మ్యాగజైన్ ఎడిటర్ లారెన్స్ పియు, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టులపై విచారణ కొనసాగుతోంది. 1997 కేట్ అత్త, దివంగత ప్రిన్సెస్ డయానా మీడియా నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదానికి గురై మరణించడంతో ఆ రాజకుటుంబం జర్నలిస్టులపై ఇప్పటికీ ఆగ్రహంగా ఉంది. ఈ విషయంపై లాయర్ పాల్ అల్బర్ట్ ఐయిన్స్ మాట్లాడుతూ.. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ ఫొటోలు వారి అన్యోన్యతను మాత్రమే తెలుపుతుండగా.. దీనిపై పరువునష్టం దావా వేశారని చెప్పారు. మరోవైపు క్లోజర్ మ్యాగజైన్ యాజమాన్యం దీనిపై స్పందిస్తూ.. తమ ఫొటో జర్నలిస్టులు నేరుగా ఈ ఫొటోలు తీయలేదని, ఇతర వ్యక్తుల ద్వారా సంపాదించిన ఫొటోలను మాత్రమే పబ్లిష్ చేశామని వివరణ ఇచ్చుకుంది. కానీ కోర్టు వీరి వివరణతో సంతృప్తి చెందలేదు. -
కేట్ టాప్‌లెస్ ఫొటోలు: జర్నలిస్టులపై విచారణ
పారిస్: సంచలనం రేపిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. రహస్యంగా ఫొటోలు తీయడమేకాక, వాటిని పత్రికల మొదటి పేజీలో ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ తరఫు న్యాయవాదుల వాదనకు కోర్టు మొగ్గుచూపింది. దీంతో కేట్ ఫొటోలను ప్రచురించిన క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు రంగం సిద్ధమైంది. ఏడాది జనవరి నుంచి విచారణ జరగనున్నట్లు ఫ్రెంచ్ న్యాయ శాఖ వర్గాలు మంగళవారం మీడియాకు తెలిపాయి. కేట్ మిడిల్టన్ ..భర్త ప్రిన్స్ విలియమ్స్‌తో కలిసి హాలిడే కోసం ఫ్రాన్స్‌లోని లా ఫ్రావిన్స్‌కు వెళ్లింది. అక్కడ మూడో మనిషి అడుగుపెట్టే అవకాశంలేని భవంతి పోర్టికోలో కేట్, విలియంలు చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. మరుసటి రోజే భారీ హెడ్డింగ్ లతో కేట్ టాప్ లెస్ ఫొటోలు కవర్ పేజీగా మ్యాగజీన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. 2012లో జరిగిన ఈ ఘటనపై బ్రిటన్ రాచకుటుంబం భగ్గునమండింది. ఫ్రెంచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు పత్రికపై దావా వసింది. నాలుగేళ్ల విచారణలో.. మొత్తం ఆరుగురు నిందితులుగా తేలారు. మ్యాగజీన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టులపై వచ్చే ఏడాది నుంచి విచారణ జరగనుంది. కేట్ అత్త, దివంగత ప్రినెన్స్ డయానా మీడియా నుంచి తప్పించుకునే క్రమంలో మరణించారని కొందరి వాదన. ఫ్రాన్స్ లో కేట్, విలియమ్ విడిదిచేసిన ఫాంహౌస్ ఇదే