ఆకట్టుకుంటున్న బుజ్జీ యువరాణి ఫొటోలు! | Kate Middleton clicks pictures of daughter Princess Charlotte | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న బుజ్జీ యువరాణి ఫొటోలు!

Published Sun, Nov 29 2015 8:40 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

ఆకట్టుకుంటున్న బుజ్జీ యువరాణి ఫొటోలు!

ఆకట్టుకుంటున్న బుజ్జీ యువరాణి ఫొటోలు!

లండన్: ఆరునెలల చిన్నారి బ్రిటన్‌ యువరాణి చార్లెట్‌ ఫొటోలు అందరినీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  బ్రిటన్ రాజవంశ సిహాసనం అధిష్టించబోయే నాలుగోతరం యువరాణి అయిన చార్లెట్‌ ఫొటోలను ఆమె తల్లి కేట్‌ మిడిల్టన్ తీశారు. ఈ ఫొటోలను కేట్‌, ప్రిన్స్ విలియమ్‌ దంపతులు కెన్సింగ్టన్ ప్యాలెస్‌ ట్విట్టర్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ఈ ఫొటోలు ఆనందం కలిగిస్తాయని ఆకాంక్షించారు.

నార్‌ఫోక్‌లోని అన్మెర్‌ రాజభవనంలో నవంబర్‌లో చార్లెట్‌ ఫొటోలను కేట్‌ స్వయంగా తీశారు. కేట్‌ పేరొందిన ఫొటోగ్రాఫర్. ఆమె గతంలో తన ఇద్దరు పిల్లలైన రెండేళ్ల ప్రిన్స్ జార్జ్‌, చార్లెట్ ఫొటోలను తీశారు. గత మే 2న కేట్‌, ప్రిన్స్ విలియమ్స్ దంపతులకు చార్లెట్‌ జన్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement