ఆ యువరాణి పేరు డయానా! | William and Kate name baby princess Charlotte Elizabeth Diana | Sakshi
Sakshi News home page

ఆ యువరాణి పేరు డయానా!

Published Mon, May 4 2015 8:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

ఆ యువరాణి పేరు డయానా!

ఆ యువరాణి పేరు డయానా!

బ్రిటిష్ రాజ కుటుంబంలో కొత్తగా ఉదయించిన యువరాణికి పేరు పెట్టేశారు. ఆమెకు షార్లట్ ఎలిజబెత్ డయానా అని పేరు ఎంచుకున్నారు. యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఈ పేరు పెట్టారు. సింహాసనాన్ని అధిష్ఠించే వరుసలో నాలుగో వారసురాలిగా ఉన్న ఆమెను.. ''హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ షార్లట్ ఆఫ్ కేంబ్రిడ్జి''గా పిలుస్తారు. డయానా పేరు తప్పకుండా కలుపుతారని అందరూ ముందునుంచే ఊహిస్తున్నారు.

యువరాణి తాత ప్రిన్స్ చార్లెస్, తాతమ్మ ఎలిజబెత్ 2, డయానా ముగ్గురి పేర్లను కలిపి మరీ ఈమెకు పెట్టారు. శనివారం నాడు లండన్లోని సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో షార్లట్ పుట్టిన విషయం తెలిసిందే. పుట్టినప్పుడు ఆమె 8 పౌండ్ల 3 ఔన్సుల బరువుంది. ఇంతకుముందు విలియం, కేట్ దంపతులకు ప్రిన్స్ జార్జ్ అనే కొడుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement