princess diana
-
డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి..
ప్రిన్స్ డయానా దుస్తులు వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు మునుపు ఆమె ధరించిన స్వెట్టర్ ధర, వివాహ దుస్తులు ఇలానే కోట్లలో ధర పలికి ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని ప్రూవ్ చేసింది. మళ్లీ మరోసారి అదే రికార్డు స్థాయిలో ప్రిన్స్ డయానికి సంబంధించిన డ్రస్ అమ్ముడిపోయింది యువరాణి క్రేజ్‌ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ డ్రస్‌ని ప్రిన్స్ డయానా 1985లో ఫోరెన్స్లోని బాలేరినాలో సాయంత్రం ఈ దుస్తులను ధరించింది. అలాగే వాంకోవర్ పర్యటనలో ఈ డ్రస్‌తో ఫోటోగ్రాఫర్ల కంట పడినట్లు జూలియన్స్ వేలం సంస్థ పేర్కొంది. ఈ డ్రస్ టాప్ నీలిరంగు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి నల్లటి వెల్వెట్ కలర్లో ఉండగా, స్కర్ట్ ఊదారంగులోని ఆర్గ్కాన్జాలా ఉండి పైన రిబ్బన్ మాదిరిగా ఉంటుంది. లండన్‌లో జూలియన్స్ నిర్వహించిన వేలంలో అంచనా వేసిన దానికంటే 11 రెట్టు ధర పలికడం విశేషం. ఇంతకమునుపు వేలం వేసిన డయనా గౌనుల్లో ఒక దాని రికార్డుని బ్రేక్ చేసేలా రూ. 9 కోట్లు పలికింది. ఈ దుస్తులు యువరాణి ప్రిన్స్ డయానా రాజదర్పాన్ని తెలియజేసేలా ఉండటమే గాక ఆ డ్రస్ అత్యధికంగా అమ్ముడుపోయి ఆమె ఫ్యాషన్ ఐకాన్‌కి కేరాఫ్ అని మరోసారి చాటి చెప్పింది. వేలంలో అత్యధిక ధర పలికిన దుస్తులగా ప్రపంచ రికార్డును డయాన ధరించిన దుస్తులే నిలవడం విశేషం. నిజానికి జూలియన్స్ వేలం నిర్వాహకులు ఈ డ్రస్ వేలంలో సుమారు రూ. 83 లక్షల నుంచి కోటి రూపాయ వరకు పలికే అవకాశం ఉందనుకున్నారు. కనివినీ ఎరుగని రీతిలో అత్యధికంగా పలికీ దటీజ్ ప్రిన్స్ డయానా అనేలా ఆశ్చర్యపరిచింది. కొందరూ కొద్దికాలమే బతికినా వారి ప్రభావం అలానే ఉంటుంది. అందరి మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు కూడా. ఆఖరికీ వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారి మాదిరిగానే ఓ అద్భుతంగా నిలుస్తాయి కాబోలు. (చదవండి: శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?) -
ప్రిన్సెస్ డయానా స్వెటర్ ధర రూ. 9.14 కోట్లు
లండన్: దివంగత బ్రిటిష్ యువరాణి డయానా ధరించిన స్వెటర్ ఒకటి వేలంలో రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు పలికింది. రాజ కుటుంబానికి చెందిన వస్తువుకు అంచనాకు మించి ఇంతటి ధర పలకడం ఇదే మొదటిసారి. ప్రముఖ సోథ్‌బీ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రూ.9,14,58,510కి ఈ స్వెటర్‌ను సొంతం చేసుకున్నారు. గురువారం ఆఖరి రోజు చివరి 15 నిమిషాల వరకు ఈ స్వెటర్‌కు అత్యధికంగా 1.90 లక్షల డాలర్ల వరకు పలికింది. చివరి నిమిషాల్లో ఒక్కసారిగా 11 లక్షల డాలర్లకు బిడ్ వేశారని సోథ్‌బీ తెలిపింది. జనవరిలో సోథ్‌బీ సంస్థ నిర్వహించిన డయానా ధరించిన బాల్ గౌన్ సైతం రూ.5 కోట్లకు పైగా పలకడం గమనార్హం. -
డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్, ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్ మాజీ యజమాని హమ్మద్ అల్ ఫయెద్ (94) ఇక లేరు. ప్రిన్సెస్ డయానాతో కారు ప్రమాదంలో మరణించిన డోడి అల్ ఫయెద్ పెద్ద కుమారుడు. హారోడ్స్ మాజీ ఓనర్అ యిన ఫయెద్ మరణాన్ని ఆయన కటుంబ సభ్యులు ధృవీకరించారు. తనయుడి మరణంతో కుంగిపోయిన ఆయన చివరకు కొడుకు దగ్గరికే చేరాడని, కొడుకు సమాధి దగ్గరే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించామని ఉకుటుంబ సభ్యులు ప్రకటించారు.అటు బ్రిటన్‌లోని ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఒక ప్రకటనలో ధృవీకరించింది. సామాన్య జీవితం నుంచి బిజినెస్ టైకూన్‌గా ఎదిగినా అతని మరణంపై పలువురి సంతాపం ప్రకటించారు. అతని మరణంతో ఒక శకం ముగిసిందనీ, బ్రిటీష్ఫుట్బాల్, వ్యాపారం, దాతృత్వం కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఆయనకు నివాళులు అర్పించారు. 1929 జనవరిలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జన్మించాడు. వీధుల్లో ఫిజీ డ్రింక్స్ అమ్మకాలతో మొదలైన అల్-ఫయేద్ కరియర్ కుట్టు యంత్రాల విక్రయదారుడిగాను, ఆ తరువాత రియల్ ఎస్టేట్, షిప్పింగ్ తదితర వ్యాపారాల్లో మధ్య ప్రాచ్యం, ఐరోపాలలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా అవతరించాడు.1954లో సౌదీ అరేబియా వ్యాపారవేత్త , అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి సోదరి సమీరా ఖషోగ్గిని వివాహం చేసుకున్నాడు. 1960ల మధ్యలో బ్రూనై సుల్తాన్‌కు సలహాదారు అయ్యాడు 1958లో ఇటలీలోని జెనోవాకు , ఆ తరువాత 1970లలో యూకేకువెళ్లాడు. కానీ బ్రిటీష్ పౌరసత్వం పొందాలనే అల్ ఫయెద్ దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరలేదు. పారిస్‌లోని రిట్జ్ హోటల్, లండన్‌లోని హారోడ్స్ డిపార్ట్మెంట్ స్టోర్‌తో సహా తన కెరీర్లో అనేక ప్రతిష్టాత్మక హోల్డింగ్లను సంపాదించి ఈజిప్షియన్ వ్యాపారవేత్తగా రాణించాడు. 1972లో అతను దుబాయ్‌లో మెరైన్ రిపేర్ యార్డ్ ఇంటర్నేషనల్ మెరైన్ సర్వీసెస్‌ని, స్వంత షిప్పింగ్ కంపెనీ అయిన జెనీవాకోను స్థాపించాడు. గొప్ప పరోపకారి కూడా. ముఖ్యంగా పేద , అనారోగ్యంతో ఉన్న పిల్లలపై ఎక్కువగా కృషి చేశాడు.అలాగే 1987లో, వెనుకబడిన యువకుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో అల్ ఫయెద్ ఛారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. క్యాష్ ఫర్ క్వశ్చన్స్ స్కాం 1994లో బ్రిటిష్ రాజకీయాలను కుదిపేసిన "క్యాష్ ఫర్ క్వశ్చన్స్" కుంభకోణంలో అల్ ఫయెద్ కూడా కీలక పాత్రధారి. అలాగే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రశ్నలు అడిగినందుకు ప్రతిఫలంగాటోరీ ఎంపీలు నీల్ హామిల్టన్, టిమ్ స్మిత్‌లకు పెద్దమొత్తంలో డబ్బులు పారిస్‌లోని రిట్జ్‌లో విలాసవంతమైన బస కల్పించానని చెప్పి పెద్ద దుమారాన్ని లేపాడు. మిస్టర్ స్మిత్ క్షమాపణ చెప్పిన తర్వాత 1997లో పదవీ విరమణ చేశాడు. నీల్ హామిల్టన్ అల్ ఫాయెద్పై పరువు నష్టం దావా వేసి భంగపడ్డాడు. పారిస్ విషాదం 1997, ఆగస్టు 31లో అతని పెద్ద కుమారుడు, డోడి యువరాణి డయానాల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన కారు ప్రమాదం తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది ప్రమాదమా, లేక కుట్రతో హత్య చేశారా? అనే చర్చ పెద్ద దుమారమే రేగింది. డయానా, డోడి కలిసి ఉండటం ఇష్టం లేని వ్యక్తులు ఇద్దరినీ హత్య చేశారని ఫయెద్ అరోపించాడు. దీనిపై న్యాయ పోరాటానికి వేల డాలర్లు ఖర్చుపెట్టాడు. 2008లో ఈ వాదనను అక్కడి కోర్టు తోసి పుచ్చింది. ఈ తీర్పు పక్షపాతమని వాదించిన ఫయెద్ తాను చేయాల్సింది చేశాననీ, మిగతా ఆ దేవుడికే వదిలివేస్తున్నానని వ్యాఖ్యానించాడు. కంపెనీ రుణాలను తీర్చడానికి 2010లో, అల్ ఫయెద్ హారోడ్స్ను ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్‌కి 2 బిలియన్ డాలర్లు విక్రయించి, పదవీ విరమణను ప్రకటించాడు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, నవంబర్ 2022లో ఫాయెద్ విలువ 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అల్ ఫయెద్ కుమారుడు డోడి ,వేల్స్ యువరాణి డయానా 1997లో కారు ప్రమాదంలో మరణించడంతో ఆయన జీవితంలో పెద్ద విషాదాన్ని నింపింది. వీరి ఆకస్మిక మరణం రాజకుటుంబం ఉందని ఆరోపించాడు. దీనికోసం పెద్ద న్యాయ పోరాటమే చేశాడు. అలాగే డయనా, డోడీకి హారోడ్స్‌లో 998లో రెండు స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశాడు. డయానా , డోడీల ఫోటోలతో పిరమిడ్-ఆకారంలో ఒక కట్టడాన్ని నిర్మించాడు. ఇందులోవారి ఆఖరి డిన్నర్లోని వైన్ గ్లాస్, యువరాణి కోసం తన కొడుకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్న ఉంగరంతో దీన్ని ఏర్పాడు ఏశాడు. అంతేకాదు హారోడ్స్ పైకప్పుపై ఉన్న గాజు సమాధిలో తన మృతదేహాన్ని ప్రదర్శనకు ఉంచాలని కోరుకున్నాడు. -
షిఫాన్ రాణి
ధరించే దుస్తుల నుంచి అలంకరించుకునే ఆభరణాల వరకు అన్నీ భారీగానే ఉంటాయి మహారాణులకు. మహారాణులంటే ఇలాగే ఉండితీరాలి అన్నట్టుగా ఉంటారు వారు. ఈ సంప్రదాయ ఆహార్యం ఓ మహారాణికి బాగా విసుగు పుట్టించింది. దీంతో ఆమె సాదాసీదా, బరువులేని వస్త్రాలు ధరించాలను కుంది. భారీగా కాకుండా సిల్క్‌తో తయారయ్యే షిఫాన్ చీరను కట్టుకుని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి, షిఫాన్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ఆ రాణీగారు. అప్పటినుంచి ఇప్పటికీ షిఫాన్ చీరలు మగువల మనసులు దోస్తూనే ఉన్నాయి. స్టైల్గానేగాక, ఎంతో సౌకర్యంగా ఉండే షిఫాన్ చీరలను ప్రపంచానికి పరిచయం చేసింది రాణి ఇందిరాదేవి. అప్పటి బరోడా రాష్ట్ర యువరాణి. కూచ్‌బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్‌ను వివాహం చేసుకున్న ఇందిరా దేవి ధరించే దుస్తులు చూపరులను అమితంగా ఆకర్షించేవి. ఎప్పుడూ భారీగా ఉండే చీరలు, నగలు ధరించే ఇందిరకు వాటిమీద మొహం మెత్తేసింది. తేలికగా ఉండే చీరలను ధరించాలనుకుంది. ఎక్కువగా యూరప్‌లో పర్యటించే ఆమె ఎంతో ఖరీదైన షిఫాన్ వస్త్రాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుని ఆరుగజాల చీరను రాజవంశానికి తగ్గట్టుగా కళాకారులతో డిజైన్ చేయించి మరీ ధరించింది. అది ఆమెకు బాగా నప్పడంతోపాటు కట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉండడంతో.. అప్పటి నుంచి షిఫాన్ చీరలనే ధరించేది. ఇలా షిఫాన్ చీరలను ఇందిర ఇండియాకు పరిచయం చేసింది. తల్లికి తగ్గ వారసురాలిగా.. ఇందిర కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా అమ్మ షిఫాన్ చీరకట్టును అనుసరించింది. తల్లి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్హెయిర్తో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. షిఫాన్ చీరకట్టుతో అందంగా ఉండడంతో ప్రపంచంలోని పదిమంది అందమైన మహిళల్లో గాయత్రి దేవి ఒకరుగా నిలిచినట్లు 1960లో ఓ మ్యాగజీన్ పేర్కొంది. ఇందిరా, గాయత్రి షిఫాన్ చీరలు మహిళలను అమితంగా ఆకట్టుకోవడంతో.. అన్ని తరగతుల వారు వీటిని ధరించడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా షిఫాన్ పాపులర్ అయ్యింది. బ్రిటన్ మహారాణి తల్లి నుంచి ప్రిన్సెస్ డయానా వరకు అందరూ షిఫాన్ను వాడినవారే. వారి గౌనులు షిఫాన్‌తో తయారు చేయించుకుని అనేక కార్యక్రమాల్లో మెరిసిపోయేవారు. మహారాణుల నుంచి సామాన్యులు మెచ్చిన షిఫాన్ను సిల్క్ నుంచి రూపొందించేవారు. అప్పట్లో దీనిని సంపద, ప్రతిష్టకు గౌరవసూచికగా భావించేవారు. తర్వాత నైలాన్, సింథటిక్ ఫైబర్ అందుబాటులోకి రావడంతో పాలిస్టర్ షిఫాన్ అందుబాటులోకి వచ్చి ధరకూడా తగ్గింది. ఇప్పటికీ ఫ్రెంచ్‌లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది. ఒకరి విభిన్న ఆలోచనకు ప్రతిరూపమే నేటి షిఫాన్ చీరలు. ట్రెండ్ సెట్టర్లు కావాలంటే గుంపులో గోవిందా అనకుండా..వందమందిలో ఉన్నా ఒక్కరిలా నిలిచేలా సరికొత్తగా ఆలోచించాలి. -
వేలానికి 40 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఏకంగా
లండన్: పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణలుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువుల వేలం కోసం ఎదురు చూస్తుంటారు. వాటికి లక్షల్లో డబ్బులు చెల్లించి మరి సొంతం చేసుకుంటారు. వేలం పాటలో వస్తువులను సొంతం చేసుకుంటే పర్లేదు కానీ.. మరీ ఏళ్ల క్రితం నాటి ఆహారాన్ని తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుంది. అటు తినలేం ఇటు పడేయలేం. వాసన రాకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క వేలానికి రాబోతుంది. అది కూడా బ్రిటన్ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడంతో చాలా మంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలు.. ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా అనగా 1981 కాలంలో తయారు చేసిన కేక్ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. వివాహం సందర్భంగా వచ్చిన 23 అధికారక పెళ్లి కేకుల్లోని ఓదాని ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. దీనిపై జూలై 29, 1981 అని డేట్ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది. ఈ కేక్ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు ఇవ్వబడింది. ఆమె దీన్ని ఓ పూల కేక్ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్ అంటించి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్ చార్లెస్-ప్రిన్సెస్ డయానాల వివాహ కేక్’ అని ఉంది. అలానే 24-07-81 అని డేట్ వేసి ఉంది. స్మిత్ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మారు. ఆ తర్వాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు. త్వరలో జరగబోయే వేలంలో ఈ కేక్ ముక్క 300-500 పౌండ్ల (31,027-51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్ ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్ వింటర్ ఔక్షనీర్స్ సీనియర్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు. -
62 ఏళ్ల బిజినెస్ టైకూన్‌ను పెళ్లాడిన, 30 ఏళ్ల కిట్టీ: పిక్స్ వైరల్
ప్రిన్సెస్ డయానా మేనకోడలు కిట్టి స్పెన్సర్ (30) రోమ్‌లో దక్షిణాఫ్రికా ఫ్యాషన్ వ్యాపారవేత్త, బిలియనీర్ మైఖేల్ లూయిస్ (62)ను పెళ్లాడారు. ఇటలీలోని ఫ్రాస్కాటిలోని విల్లా అల్డోబ్రాండినిలో ఈ నెల 24న వివాహం అత్యంత ఘనంగా జరిగింది. తాజాగా ఈ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రధానంగా ఈ పెళ్లి వేడుకలో కిట్టీ ధరించిన గౌన్లు హాట్ టాపిక్‌గా మారాయి. దివంగత యువరాణి డయానా తమ్ముడు విక్టోరియా ఐట్కెన్ కుమార్తె కిట్టి స్పెన్సర్ డోల్స్ అండ్ గబ్బానా రూపొందించిన కస్టమ్ మేడ్ వైట్ ఆల్టా మోడ్రన్ గౌనులో మెరిసిపోయింది. మరి డయానా మేనకోడలు, పైగా అతిపెద్ద ఫ్యాషన్ బిజినెస్ టైకూన్‌తో పెళ్లి ఆ మాత్రం ఉండాలి కదా. కిట్టి స్పెన్సర్ తన వెడ్డింగ్ గౌను ఫోటోలను, ఆ వివరాలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కిట్టి స్పెన్సర్ ఇలా పేర్కొన్నారు...“నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు కోసం .. నా కలలకు మించిన గౌనుని సృష్టించిన డొమెనికో అండ్ స్టెఫానోకు హృదయపూర్వక ధన్యవాదాలు... నా సంతోషాన్ని వెల్లడించేందుకు పదాలు లేవు.’’ పెళ్లి రోజున కిట్టీ ధరించిన వైట్ లేస్ గౌను తయారీకి ఆరు నెలల సమయం పట్టిందట. డెల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్న స్పెన్సర్ మూడు రోజుల ఈవెంట్లో ఐదు రీగల్ గౌన్లు ధరించింది. హై నెక్, లాంగ్ స్లీవ్స్, బుట్ట చేతులతో స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ గౌన్‌ను చూడటానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ప్రిన్స్ చార్లెస్‌తో పెళ్లి సమయంలో ఆమె అత్త డయానా ధరించిన పొడవాటి గౌన్‌ను తలపించిందని ఫ్యాషన్ ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. స్పెన్సర్ "విక్టోరియన్ ఇన్స్పిరేషన్ లేస్ బ్రైడల్ గౌన్" విశేషాలపై డిజైనర్లు కూడా ఇన్‌స్టాలో ఒక వీడియోషేర్ చేశారు. ఈ పెళ్లికి హాజరైన ప్రముఖుల్లో టెస్కా అధిపతి, ఎలోన్ మస్క్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జేడ్ హాలండ్ కూపర్ ,ప్రముఖ మోడల్ ఎమ్మా థిన్ తదితరులు ఉన్నారు. View this post on Instagram A post shared by Manu Leoni (@manu.leoni) View this post on Instagram A post shared by Dolce&Gabbana (@dolcegabbana) View this post on Instagram A post shared by Kitty Spencer (@kitty.spencer) -
వయసు చిన్నది.. సేవ గొప్పది..!
మన పని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న మాటకు ఉదాహరణగా నిలుస్తు్తన్నారు ఢిల్లీకి చెందిన దేవాన్షి రంజన్, సనా మిట్టార్లు. ఈ ఇద్దరు విద్యార్థినులూ చదువుతోపాటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. కరోనా సమయంలోనూ వెనుకంజ వేయక వీరు చేస్తోన్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. దివంగత ప్రిన్సెస్ డయానా గౌరవార్థం సామాజిక సేవ, మానవతా కారణాలకోసం కృషి చేసే 9–25 ఏళ్ల యువతీయువకులకు ఇచ్చే డయానా అవార్డు ఈ ఇద్దరమ్మాయిలనూ వెతుక్కుంటూ వచ్చి మరీ పురస్కరించింది. పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదువుతోన్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, బాలబాలిక విద్యపై కృషిచేస్తోంది. గత ఐదేళ్లుగా మురికివాడల్లో నివసించే నిరుపేద పిల్లలకు చదువు చెప్పడం, నిరుపేద మహిళల్లో ఆర్థిక అంశాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. మైక్‌డ్రాప్.. ‘‘కరోనా కారణంగా అంతంతమాత్రంగా ఉన్న నిరుపేద బతుకులు రోడ్డు మీద పడడంతో చాలా మంది పిల్లలు బడికెళ్లడం మానేశారు, కొంతమంది స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే స్థోమత లేకపోవడం వల్ల కూడా చదువుకు దూరమయ్యారు. ఇటువంటి వారందరికి చదువు చెప్పేందుకు లడ్లీ అనే ఎన్జీవో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాను. స్టడీ మెటిరియల్, స్టేషనరీలు విద్యార్థులకు అందించి వారిని చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాను. ఢిల్లీలోని మురికివాడల్లోని వెయ్యిమందికిపైగా పిల్లలకు చదువు చెబుతున్నాము. ఈ క్రమంలోనే మా సామాజిక సేవా కార్యక్రమాలను పదిరాష్ట్రాల్లోని యాభై జిల్లాల్లో విస్తరించాము. స్నేహితులతో కలిసి గతేడాది జూలైలో మైక్‌డ్రాప్ పేరిట ప్రాజెక్టును ప్రారంభించాను. స్త్రీవాదం, రాజకీయాలు, లింగ సమానత్వం, ఇంకా కళల ద్వారా మహిళలు ఎలా ఉపాధి పొందవచ్చు అన్న అంశాలపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం మా బృందంలో 50 మంది సభ్యులు ఉండగా మరో150 మంది కంట్రిబ్యూటర్స్ వివిధ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్క్‌షాపులు, వెబినార్స్‌ను నిర్వహిస్తూ నిరుపేదల్లో అవగాహన కల్పిస్తున్నాము’’ అని దేవాన్షి వివరించింది. మనదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో సనా మిట్టార్ 150 వలంటీర్లతో డిజిటల్ క్యాంపెయిన్‌ను సమన్వయ పరిచి ఐదు లక్షల రూపాయల విరాళాలను సేకరించింది. అంతేగాక లాక్డౌన్ కాలంలో నిరుపేద విద్యార్థులు స్మార్ట్ఫోన్లు కొనుక్కునేందుకు సాయం చేసింది. 40 మంది విద్యార్థులు సనా సాయంతో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. సోషల్ ఎంటర్పైజ్ గ్లోబల్ వలంటీర్ యాక్షన్ నెట్వర్క్(జీవీఏఎన్)ను ఏర్పాటు చేసి సాయం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువతను జీవీఏఎన్ వేదికగా వారి సహాయ సహకారాలను సమాజానికి అందిస్తోంది సనా. పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఏకంగా రూ.790 కోట్లు ఖర్చు
సాక్షి, వెబ్‌డెస్క్: దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో వివాహ వ్యవస్థ పెనవేసుకుపోయింది. రెండు మనసులను.. రెండు కుటుంబాలను.. మూడు ముళ్లతో పెనవేస్తుంది వివాహ బంధం. అందుకే ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వివాహ వేడుక జీవితాంతం గుర్తిండిపోవాలని భావిస్తారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. నిశ్చితార్థం వేడుక నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు ప్రతి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఉవ్విళ్లురతారు. అందుకే తమ తమ స్థాయిలకు తగ్గట్లు.. కొన్ని సార్లు అంతకుమించే ఖర్చు చేస్తారు. అయితే కొన్ని పెళ్లి వేడుకలు ఖర్చు విషయంలో ఏకంగా చరిత్ర సృష్టించాయి. మరి ఆ వేడుకలు ఎక్కడ.. ఎవరింట జరిగాయి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. 1.ప్రిన్సెస్ డయానా-చార్లెస్ వివాహ వేడుక బ్రిటన్ రాజవంశంలోనే కాక.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది డయానా-చార్లెస్‌ల పెళ్లి. 1981లో జరిగిన వీరి వివాహ వేడుక కోసం మొత్తం నగరాన్ని లైట్లతో దేదీప్యమానంగా అలంకరించారు. అప్పట్లోనే వీరి పెళ్లి కోసం ఏకంగా 48 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి లెక్కల్లో అది ఏకంగా 100 మిలియన్ డాలర్ల కన్న ఎక్కువ అనగా సుమారు 790 కోట్ల రూపాయలుగా ఉంటుంది. 2. వనిషా మిట్టల్-అమిత్ భాటియా వివాహం ప్రపంచ ఉక్కు రారాజు, ఇంగ్లండ్‌లోనే అత్యంత ధనవంతుడే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్ కుమార్తె వనిషా వివాహానికి ఏకంగా 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 408 కోట్లు) ఖర్చు చేశారు. 2004లో వనిషా-అమిత్ భాటియాల వివాహం పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి 20వ శాతాబ్దపు అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా చరిత్ర సృష్టించింది. 3. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్ల పెళ్లి వేడుక ప్రపంచంలోనే మరో అత్యంత ఖరీదైన వివాహ వేడుక బ్రిటన్ రాజకుటుంబంలోనే జరిగింది. తల్లి డయానా బాటలోనే కుమారుడు ప్రిన్స్ విలియం వివాహం కూడా అత్యంత ఖరీదైన వేడుకగా నిలిచింది. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్లు 29, ఏప్రిల్, 2011న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక కోసం 34 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే 244 కోట్ల రూపాయలన్నమాట. 4. ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహం ఆసియా కుబేరుడు, భారతదేశపు అతిపెద్ద వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, బాలీవుడ్ నటులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి అతిథులుగా హాజరయ్యారు. ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహం 12, డిసెంబర్, 2018 న జరిగింది. తన కుమార్తె వివాహం కోసం అంబానీ 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని వార్తలు వినిపించగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహ వ్యయం 15 మిలియన్ డాలర్లకు మించలేదని (దాదాపు 111 కోట్ల రూపాయలు) తెలిపింది. 5. లిజా మిన్నెల్లి-డేవిడ్ గెస్ట్‌ల వివాహం.. అమెరికన్ గాయని, నటి లిసా 2002 లో ఒక అమెరికన్ టీవీ షో నిర్మాత డేవిడ్ గెస్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ తమ వివాహానికి 3.5 మిలియన్ డాలర్లు (రూ .26 కోట్లు) ఖర్చు చేశారు. 6. ఎలిజబెత్ టేలర్-లారీ ఫోర్టెన్స్కీ హాలీవుడ్ ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన ఎలిజబెత్ టేలర్ 1991 లో లారీ ఫోర్టెన్స్కీ అనే భవన నిర్మాణ కార్మికుడిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఎలిజబెత్ స్నేహితుడు, పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్, నెవర్‌ల్యాండ్ రాంచ్లో జరిగింది. వీరి వివాహ వేడుక కోసం 1.5 నుంచి 2 మిలియన్ డాలర్లు (రూ. 11-14 కోట్లు) ఖర్చు చేశారు. అయితే, వివాహం అయిన 5 సంవత్సరాలకే వారు విడాకులు తీసుకున్నారు. -
ప్రిన్సెస్ డయానా కారు వేలం; వామ్మో అంత ధర!
వేల్స్: వేల్స్ యువరాణి డయానాకు చెందిన ఫోర్డ్ ఎస్కార్ట్ కారును వేలం వేశారు. కాగా వేలంలో దక్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యుజీషియన్ ఆ కారును కొనుగోలు చేశాడు. డయానా వాడిన కారుకు వేలంలో 50 వేల పౌండ్స్‌కు పైగా ధర పలికింది. మన ఇండియన్ కరెన్సీలో కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షల కన్నా ఎక్కువ. ప్రస్తుతం డయానా వాడిన కారుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఒక పాతకారుకు ఇంత ధర అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రిన్సెస్ డయానా 1961 లో జన్మించింది. 1981లో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. 1981లో వారి వివాహానికి ముందు డయానాకు ఎంగేజ్మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారును డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది. అయితే 36 ఏళ్ల వయసులో ఆగస్టు 31, 1997లో పారిస్‌కు వెళ్లిన డయానా ఘోరరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోటార్‌బైక్‌ను తప్పించబోయి కారు పల్టీ కొట్టడంతో డయానా అక్కడికక్కడే మరణించారు. చదవండి: యువతి క్లాసికల్ డ్యాన్స్; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్ -
అమ్మను చంపేశారు.. తనను కూడా వదలరా?: హ్యారీ
లండన్: ‘‘అమ్మ అంత్యక్రియల నాడు నాకు వినిపించిన గుర్రాల గిట్టల శబ్దం నుంచి.. కారులో నేను అమ్మతో ప్రయాణిస్తుండగా.. మమ్మల్ని వెంటాడిన ఫోటోగ్రాఫర్ల వరకు ప్రతి జ్ఞాపకం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.. అమ్మను కోల్పోయిన బాధ ఇప్పటికి నన్ను కలచివేస్తూనే ఉంది’’ అంటూ ప్రిన్స్ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమ్మలాగే.. నా భార్యను కూడా కోల్పోతాననే భయంతోనే రాచకుంటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లానని తెలిపాడు హ్యారీ. ఒక కొత్త టీవీ డాక్యుమెంటరీ సిరీస్ ది మీ యూ కాన్ట్ సీలో తన మనోవేదనను వెల్లడించారు హ్యారీ. హ్యారీ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ తెల్ల జాతీయుడు కానీ మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్న నాటి నుంచి.. ఆమె మరణం వరకు ఫోటోగ్రాఫర్లు తనను వెంబడిస్తూనే ఉన్నారు. చివరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆమె మరణించిన తర్వాత కూడా వదల్లేదు. ఇప్పుడు తను(మేఫన్) చనిపోయే వరకు కూడా ఆగరు.. చరిత్ర పునరావృతం చేయాలని మీరు భావిస్తున్నారా’’ అంటూ ఆవేదనకు గురయ్యాడు. ఇది ఇలానే కొనసాగితే.. నా జీవితంలో మరో స్త్రీని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చాను’’ అన్నాడు హ్యారీ. హ్యారీ, అతని అమెరికన్ భార్య మేఘన్ మార్కెల్ గురించి బ్రిటిష్ పత్రికలలో జాత్యహంకార వార్తలు వెలువడ్డాయి. అలానే సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి తప్పుడు ప్రచారం జరిగింది. ఇక మేఘన్ మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు బ్రిటన్‌లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని తెలిపాడు హ్యారీ. ఈజిప్టుకు చెందిన తన ప్రియుడు డోడి ఫయేద్‌తో కలిసి ప్రయాణిస్తున్న కారును ఛాయాచిత్రకారులు వెంబడించడంతో పారిస్‌లో జరిగిన ప్రమాదంలో యువరాణి డయానా 1997 లో 36 ఏళ్ళ వయసులో మరణించింది. ఆ సమయంలో హ్యారీకి 12 సంవత్సరాలు. ఈ డాక్యుమెంటరీలో, హ్యారీ తన సోదరుడు విలియం, తండ్రి ప్రిన్స్ చార్లెస్, మామ చార్లెస్ స్పెన్సర్‌తో కలిసి లండన్ వీధుల గుండా డయానా శవపేటిక వెనుక నడుస్తున్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నేను ఆ దారి వెంబడి నడుస్తున్నాను.. నాకు గుర్రాల గిట్టల శబ్దం వినిపిస్తుంది.. నేను నా శరీరాన్ని విడిచిపెట్టి.. బయటకు వచ్చినట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాను’’ అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు హ్యారీ. ‘‘ఈ బాధను నేను దాదాపు 20 ఏళ్ల పాటు అణిచిపెట్టుకున్నాను.. తాగుడుకు అలవాటు పడ్డాను. కెమరాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వీరు ఓ నిస్సహాయ మహిళను ఆమె తన కారు వెనక సీటులో మరణించే వరకు వెంటాడారు. ఆ సమయంలో నేను నా తల్లికి సాయం చేయలేకపోయాను.. మా అమ్మకు న్యాయం జరగలేదు.. నా బాల్యంలో మా అమ్మ విషయంలో ఏదైతే జరిగిందో.. దాని గురించి నాకు ఇప్పటికి కోపం వస్తుంది. ఇప్పుడు నాకు 36 ఏళ్లు.. కానీ ఇప్పుడు కెమరాలు చూసినా.. వారు నన్ను వెంటాడుతున్నట్లు ఆందోళనకు గురవుతాను. కెమరాల క్లిక్, ఫ్లాష్ చూస్తే.. నా రక్తం మరిగిపోతుంది’’ అన్నాడు హ్యారీ. ‘‘మేఘన్‌ను కలిసే వరకు నేను ఈ బాధ అనుభవించాను. ఆ తర్వాతే నేను థెరపీ తీసుకోవడం ప్రారంభించాను. ఇక మా బంధం కొనసాగితేనే.. నేను నా గతాన్ని ఎదుర్కోగలనని అనిపించింది. అందుకే తనను వివాహం చేసుకున్నాను అన్నాడు. ఈ విషయాలన్నింటిని హ్యారీ తన మీ యూ కాన్ట్ సీ సిరీస్‌లో తెలిపారు. అమెరికన్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో కలిసి హ్యారీ నిర్మించిన "మీ యూ కాన్ట్ సీ" సిరీస్ ఆపిల్ టీవీ + లో శుక్రవారం విడుదలైంది. చదవండి: మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు -
ప్రిన్సెస్ డయానా రాసిన ఆ ఉత్తరాల్లో ఏముంది..?
ప్రిన్సెస్ డయానా మరణించి దాదాపు 24 ఏళ్లు అవుతున్నప్పటికీ తన వ్యక్తిగత జ్ఞాపకాలతో ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుండడం విశేషం. క్లోజ్ ఫ్రెండ్స్‌కు డయానా స్వయంగా రాసిన ఉత్తరాలు తాజాగా వెలుగులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఎవరూ చదవని రెండు దశాబ్దాల క్రితం నాటి.. దాదాపు 40 ఉత్తరాలను ‘డేవిడ్ లే’ అనే వేలం సంస్థ విక్రయించనుంది. ఈ ఉత్తరాలను డయానా స్నేహితుడు రోజర్ బ్రాంబుల్‌కు 1990 ఆగస్టు నుంచి 1997 మే నెల మధ్యకాలం లో రాశారు. 1997లో ఆమె మరణించిన తరువాత కంట్రీ ఫామ్ హౌస్‌లో ఓ కప్ బోర్డులో ఈ ఉత్తరాలు దొరికాయి. ఇన్నేళ్లు చీకట్లో మగ్గిన ఆ ఉత్తరాలు జన బాహుళ్యంలోకి రానున్నాయి. ప్రిన్స్ చార్లెస్‌తో తన వివాహబంధాన్ని తెంచుకున్న తరువాత రాసిన లెటర్స్ కావడంతో వాటిలో ఏముందోనని ఆసక్తి నెలకొంది. తన కుమారులైన ప్రిన్స్‌విలియం, హ్యారీల గురించి కూడా దీనిలో డయానా ప్రస్తావించారని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘డయానా ఓ యాక్సిడెంట్లో మరణించినప్పటికీ ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామంది కుతూహలం చూపుతున్నారు. అందుకే ఆమె జీవితానికి సంబంధించిన మరిన్ని నిజాలు తెలుసుకునేందుకు ఉత్తరాలను వేలం వేస్తున్నట్లు’’ వేలం సంస్థ వెల్లడించింది. మార్చి 18న 39 లెటర్స్ ను వేలం వేస్తున్నామని, మరింత సమాచారం కోసం తమ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సంస్థ పేర్కొంది. -
ప్రిన్సెస్ డయానాలో ఉన్న ఆకర్షణ అదే: మాజీ లవర్
ప్రిన్సెస్ డయానా అందమైన మహిళ. బ్రిటన్ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్ చార్ల్స్ భార్య. వీరికి ఇద్దరు కొడుకులు. ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ. ఇద్దరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. ప్రిన్స్ విలియం- కేట్ మిడిల్టన్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ప్రిన్స్ లూయీస్, ప్రిన్స్ జార్జ్.. ఒక కుమార్తె ప్రిన్సెస్ చార్లెట్. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మోర్కెల్ జంటకు కొడుకు ప్రిన్సెస్ ఆర్చీ ఉన్నాడు. అన్నీ సజావుగా సాగి, డయానా నేడు బతికి ఉంటే ఇంతటి ముచ్చటైన కుటుంబాన్ని చూసి కచ్చితంగా సంతోషపడేవారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనుమరాలు.. అన్ని బంధాలతో ఆమె జీవితం సంపూర్ణమయ్యేది. కానీ దాంపత్య జీవితంలో చెలరేగిన సంఘర్షణ, భర్తతో విభేదాలు, వ్యక్తిగతంగా మోయలేని నిందలు.. వీటికి తోడు విధి చిన్నచూపు చూడటంతో 1997లో ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో ప్రిన్సెస్ డయానా దివంగతులయ్యారు. అయితే ఇరవయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానా మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలతో నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రిన్సెస్ డయానా మాజీ ప్రియుడిగా పేరొందిన హసంత్ ఖాన్ ఇటీవల డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆమె గురించి మరోసారి చర్చ మొదలైంది. మమ్మీ.. తను మంచివాడు కాదు.. చనిపోవడానికి రెండేళ్ల ముందు అంటే 1995లో డయానా పనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. తప్పుడు బ్యాంకు పత్రాలు చూపించి బీబీసీ సీనియర్ జర్నలిస్టు మార్టిన్ బషీర్.. డయానాను ఇందుకు ఒప్పించారని ఆమె సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ ఇటీవల ఆరోపించారు. రాజభవనంలోని కొంతమంది సిబ్బంది ప్రిన్సెస్ వ్యక్తిగత వివరాలు లీక్ చేస్తున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. మార్టిన్‌పై ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ వార్తా సంస్థ సుప్రీంకోర్టు మాజీ జడ్జి లార్డ్ డైసన్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హార్ట్ సర్జన్ అయిన హసంత్ ఖాన్(పాకిస్తాన్లో జన్మించారు) మాట్లాడుతూ.. మార్టిన్ తన మాటలతో డయానాను ప్రభావితం చేసి, ఆమె మెదడునంతా చెత్తతో నింపేశాడన్నారు. నైతిక విలువలు వదిలేసి, అడ్డదారులు తొక్కి ఎట్టకేలకు ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నాడని ఆరోపించారు. ‘‘మా పెళ్లి సమయంలో మేం ముగ్గురం’’ అని తన చేత చెప్పించాడని పేర్కొన్నారు. ‘‘తనొక మోసగాడు. ప్రిన్సెస్‌ను నేను పెళ్లి చేసుంటానా అంటూ నన్ను అత్యంత వ్యక్తిగత విషయాల గురించి అడిగాడు. బషీర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని నేను ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను. అతడితో మాట్లాడవద్దని హెచ్చరించాను కూడా. నిజానికి ఆమెలో ఉన్న అత్యంత ఆకర్షించే గుణం ఏంటో తెలుసా? తన మానసిక బలహీనతే. దానినే మార్టిన్ అవకాశంగా తీసుకున్నాడు. ఆమె మనసును కకావికలం చేశాడు. డయానా భర్త ప్రిన్స్ చార్లీ కారణంగా నానీ టిగ్గీ గర్భవతి అయ్యారని చెప్పాడు. అతడిని ఆమె నమ్మారు. అయితే అప్పటికి టీనేజర్‌గా ఉన్న ప్రిన్స్ విలియం.. ‘‘మమ్మీ.. తను అస్సలు మంచి వ్యక్తి కాదు’’ అని హెచ్చరించేంత వరకు ఇది కొనసాగింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా హసంత్ ఖాన్, ప్రిన్సెస్ డయానా రెండేళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె అతడిని ముద్దుగా మిస్టర్ వండర్ఫుల్ అని పిలిచేవారట. ఇక హ్యారీ జన్మించిన తర్వాత డయానా- చార్లెస్ వైవాహిక బంధంలో విభేదాలు తారస్థాయికి చేరాయంటూ గతంలో వెలువడిన కథనాలు చెబుతున్నాయి.(చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) మిస్టర్ వండర్ఫుల్తో సంభాషణ అంతేగాక దాంపత్య జీవితంలో అసంతృప్తి, భర్త ప్రవర్తన కారణంగానే డయానా అభ్రదతాభావానికి లోనై ఇతరులవైపు ఆకర్షితురాలయ్యారని అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె కారు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. అదే విధంగా ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్లాండ్లో వేసవి సెలవుల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్‌లో ఉండటంపై విపరీతపు కామెంట్లు వినిపించాయి. ఇక ఖాన్‌తో ప్రేమలో ఉన్న సమయంలో తన టెలిఫోన్లు ట్రాప్ చేస్తున్నారన్న భయంతో.. డయానా కోడ్ భాషలో మాట్లాడేవారట. బషీర్‌కు డాక్టర్ జర్మన్, మోల్ అనే ఓ రహస్య పేరుతో అతడు తనను ఇంటర్వ్యూకి ఒప్పించడానికి చేసిన ప్రయత్నాల గురించి తనకు చెప్పినట్లు ఖాన్ వెల్లడించారు. ఇక 1995 నాటి బషీర్ ఇంటర్వ్యూ వల్ల రాజ దంపతుల మధ్య మనస్పర్థలు మరింతగా పెరిగిపోయానని వారి సన్నిహితులు గతంలో పేర్కొన్నారు. -
డయానాలా మాట్లాడగలనా అని భయం
‘స్పెన్సర్’ అని ఒక హాలీవుడ్ మూవీ వచ్చే ఏడాది మొదలు కాబోతోంది. ప్రిన్సెస్ డయానా బయోపిక్. అందులో డయానాగా అచ్చు డయానాలా లేని క్రిస్టెన్ స్టీవార్ట్ నటిస్తున్నారు. అంతేకదా, డయానాలా ఉండేవారు ఈ భూమి మీద ఎవరు దొరుకుతారు? డయానాకు ఇద్దరూ మగ పిల్లలే. అదొక సృష్టి అసంపూర్ణత. డయానాలా ఆ ఇంగ్లిష్ అదీ మాట్లాడాలన్నా ఏళ్ల ప్రాక్టీసు కూడా సరిపోదు. యూట్యూబ్‌లో వెతికి వినండి. ఆమె స్పీచ్‌లు వినడం కాదు. ఒరిజినల్ మాట తీరు దొరుకుతుంది కాస్త కష్టపడి గాలిస్తే. ‘తనలా మాట్లాడగలనా అని భయం వేస్తోంది’ అని అప్పుడే మొదలుపెట్టేశారు క్రిస్టెన్. ఆ ఉచ్చారణ నోరు తిరగట్లేదట. గొప్ప ఇంగ్లిష్ అని కాదు. డయానా స్వరంలోంచి ఆ ప్రత్యేకమైన యాక్సెంట్‌కి ప్రాణం తేవడం! ‘ప్రిన్సెస్ డయానాకు నా మేకప్‌తో పోలికలు తేగలిగిన మహామహులు ఉన్నారు. అయితే ఆమె మాటకు పోలిక తేవడం నా వల్ల అవుతుందా?’ అని క్రిస్టెన్. ‘కానీ మీరే చెప్పాలి క్రిస్టెన్. డయానాలా యాక్ట్ చేస్తున్నవారే డయానా మాటనూ యాక్ట్ చేయగలరని నా నమ్మకం. దానర్థం నేను మిమ్ముల్ని నమ్ముతున్నానని’ అన్నారట డైరెక్టర్. ఈ ‘స్పెన్సర్’ చిత్రం డయానా ప్రేమ, పెళ్లి, పిల్లలు వరకే ఉంటుంది. ఆమె ట్రాజిక్ డెత్ వైపు వెళ్లడం లేదు డైరెక్టర్ పాబ్లో లారైన్, ఆయన నిర్మాతలు. మంచిదైంది. లేడీ డయానాకు కొన్ని నప్పవు. మరణం అసలే నప్పదు. -
డయానా పెళ్లి గౌను
ఒంట్లో బాగోలేదు. ఆ వెచ్చదనం బట్టలకు తెలుస్తుంది. మనసు బాగోలేదు. తెలుస్తుందా బట్టలకు?! ఒంటి మీద ఉన్నవాటికి తెలియకపోవచ్చు. ఇష్టమైన డ్రెస్ ఒకటి ఉంటుంది. ఆ డ్రెస్‌కి తెలుస్తుంది. డయానాకు మనసు బాగోలేనప్పడు.. ఆమె పెళ్లి గౌనుకు తెలిసేది!! వెళ్లి టచ్ చేస్తారు డయానా. గౌనుకు మొత్తం తెలిసిపోతుంది! సంతోషంగా ఉన్నారు లేడీ డయానా. ప్రిన్స్ చార్ల్స్‌తో వివాహం కాగానే ఆమె ప్రిన్సెస్ డయానా అవుతారు. అయితే పూర్తిగా అది మాత్రమే ఆమె సంతోషం కాదు. తను ధరించి ఉన్న వెడ్డింగ్ గౌన్ ఆమెను ఎగిరేందుకు ఉత్సాహపడుతున్న ఒక తెల్లని పావురంలా మార్చేసింది. లండన్‌లోని సెయింట్ పాల్స్ కెథడ్రాల్లో ఆమె తన 25 అడుగుల పొడవున వెనుక పారాడే వస్త్రం గల గౌనును రెండు చేతులతో ఎత్తిపట్టి అడుగుల్ని సుళువు చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. ఫ్యాషన్ డిజైనర్ల పరిభాషలో ఆ గౌను సాంకేతిక నామం ‘ఐవరీ సిల్క్ టఫేటా యాంటిక్ లేస్ గౌన్’. భార్యాభర్తలైన డేవిడ్, ఎలిజబెత్ అనే ఇద్దరు డిజైనర్లు లేడీ డయానా కోసం అప్పటికి కొన్ని నెలల ముందుగా తమకు అందిన ఇంగ్లండ్ ఆస్థాన ఆదేశాల మేరకు, డయానా అభీష్టానికి అనుగుణంగా కుట్టి తెచ్చారు. ఇప్పటి ధరల ప్రకారం అప్పటి ఆ గౌను కోటీ నలభై నాలుగు లక్షల రూపాయలు. ఖరీదు విషయంలో బ్రిటన్ రాజకుటుంబానికి అది నిరాడంబరమైన వస్త్ర విశేషమే. అయితే లేడీ డయానాకు పెళ్లికి ముందే ప్రిన్స్ డయానా హోదాను కల్పించిన ఆ గౌనుకు నకళ్లను కనిపెట్టేందుకు ఆ మర్నాటి నుంచే ఫ్యాషన్ ప్రపంచం తన కుట్టు మిషన్లకు సూదులు మెత్తగా కదలే మేర కొన్ని నూనె చుక్కలు వేసి కసరత్తులు చేయించడం మొదలు పెట్టింది. డయానా వెడ్డింగ్ గౌన్ ప్రపంచ దుస్తుల ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఒక చరిత్రాత్మక మార్మికత. డయానాకు షిఫాన్ బ్లవుజులంటే ప్రాణం. ఆమె కోసం వాడుకగా ఆ బ్లవుజులను కుట్టి తెస్తుండే డిజైనర్లకే డయానా తన పెళ్లి గౌను కుట్టే బాధ్యతనూ అప్పగించారు. గౌనుపై వాళ్లు పదివేల మేలిమి ముత్యాలను పొదిగారు. రెండేళ్ల క్రితం ‘టైమ్’ మ్యాగజీన్ ‘మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్రిటిష్ రాయల్ వెడ్డింగ్ డ్రసెస్ ఆఫ్ ఆల్ టైమ్’గా డయానా వెడ్డింగ్ గౌన్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆ గౌను డయానా చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ దగ్గర ఉంది. హ్యారీకి చిన్నప్పట్నుంచీ అమ్మకు దగ్గర. తల్లి చనిపోయేనాటికి అతడి వయసు 13 ఏళ్లు మాత్రమే. 1981 జూలైలో పెళ్లి వేడుకకు డయానా ధరించిన గౌను లాంటి గౌనే ఇప్పుడు మళ్లీ తయారైంది! నెట్‌ఫ్లిక్స్ వెబ్ సీరీస్ ‘ది క్రౌన్’ నాలుగో సీజన్లో డయానా పాత్రను పోషిస్తున్న ఎమ్మా కారిన్ కోసం 71 ఏళ్ల బ్రిటన్ కాస్ట్యూమ్స్ డిజైనర్ యామీ రాబర్ట్స్ ఈ గౌన్ని డిజైన్ చేశారు. నాటి గౌనుకు జతగా ఉన్న 153 గజాల తెల్లటి ట్రాన్స్పరెంట్ తల ముసుగు (ట్యూల్ వెయల్) ను కూడా అచ్చుగుద్దినట్లుగా డిజైన్ చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నెట్‌ఫ్లిక్స్ సోమవారం నాడు డయానా గౌన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. నవంబర్ 15న మనం మళ్లీ డయానా పెళ్లిని చూడబోతున్నాం. ఫిక్షన్ గౌను మాట అటుంచితే, ప్రిన్సెస్ డయానా పెళ్లి గౌన్‌తో కలగలిసి అనేక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ‘ది క్రౌన్’ వెబ్ సీరీస్‌లో డయానా పాత్రధారి ఎమ్మా కారిన్ వాటిల్లో ఒక విశేషాన్ని ఆమె మాటల్లో చెప్పుకోవడమే బాగుంటుంది. ‘‘పెళ్లి గౌనుకు కొలతలు ఇచ్చే సమయానికి 29 అంగుళాలు ఉన్న నా నడుము చుట్టుకొలత పెళ్లి ముందు నాటికి 23 అంగుళాలకు తగ్గిపోయింది. ఇదంతా కూడా ఫిబ్రవరి–జూలై మధ్యన జరిగింది. డైటింగ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ, పెళ్లి గౌను కొలతల్ని ఎందుకు పట్టించుకుంటాను? గౌను రెడీ అయి వచ్చాక వేసుకుని చూస్తే నడుము భాగం చాలా వదులు అయింది. వదులు తగ్గించడం కోసం గౌను లోపలికి మరికొన్ని కుట్లు వేయించవలసి వచ్చింది’’ అని, పెళ్లి తర్వాత ఎప్పటికో ఒక ఇంటర్వూ్యలో నవ్వుతూ చెప్పారు డయానా. డయానా మేకప్ కోసం బార్బారా డేలీ అనే ఆర్టిస్ట్ ఉండేవారు. పెళ్లి గౌను సిద్ధమై వచ్చిన రోజు డయానా ఆ గౌనుపై పెర్ఫ్యూమ్ ఒలకబోసుకున్నారు. అసలే తెల్ల గౌను. మరకలు ఉండిపోతాయేమోనని డయానా విలవిల్లాడిపోయారు. అప్పుడు ఆమె పక్కనే ఉన్నారు బార్బారా డేలీ. డయానా బాధను చూసి, ‘పర్లేదు, యువర్ మెజెస్టీ. గౌనులోని పొరల్లో పెర్ఫ్యూమ్ ఆవిరైపోతుంది’ అని చెప్పారు. ఆమె చెప్పినట్లే పెర్ఫ్యూమ్ ఛాయలే కనిపించకపోవడంతో డయానా ఊపిరి పీల్చుకున్నారు. రోసాలిండ్ కోవార్డ్ రాసిన ‘డయానా: ది పోట్రెయిట్’ (2004) పుస్తకంలో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. పెళ్లయ్యాక తండ్రి పక్కన కూర్చొని కొంత దూరం గ్లాసు పల్లకిలో ప్రయాణించే సంప్రదాయం ఉంటుంది బ్రిటన్ రాజకుటుంబాల్లో. డయానా ఆ రోజు పల్లకీలో కూర్చోడానికి గౌను బాగా పెద్దదైపోయింది. గౌను కిందిభాగంలో పరుచుకుని ఉండే వస్త్ర వలయాన్ని సహాయకులు జాగ్రత్తగా దుప్పటిలా మడతపెట్టి ఆమెను పల్లకిలో పట్టించారు కానీ, పల్లకి దిగాక చూసుకుంటే గౌను బాగా నలిగిపోయి ఉంది. అప్పుడు కూడా డయానా ప్రాణం ఉసూరుమందట! పెళ్లి గౌనుతో డయానాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిల్లోని ఒక జ్ఞాపకం ఆమెకు అపురూపమైనది. పెళ్లిరోజు పెళ్లి గౌనులో నెమ్మదిగా మెట్లు దిగుతున్న డయానాను కింది నుంచి చూసిన ఒక వ్యక్తి.. ‘డయానా, యు లుక్ బ్యూటిఫుల్’ అన్నారు. ఆమె కళ్లల్లో మెరుపు. ఆ మాట అన్నది డయానా తండ్రి జాన్ స్పెన్సర్. వెళ్లి, తండ్రిని కావలించుకోవాలని అనుకుంది కానీ గౌను చెరిగిపోతుందని ఊరుకుంది! తండ్రి ప్రశంసను కూడా జీవితాంతం అలాగే చెరిగిపోకుండా చూసుకున్నారు డయానా.. చార్ల్స్‌తో వివాహబంధపు ఒడిదుడుకుల్లో కూడా. బాల్యం నుంచీ తండ్రి ఆమెకు బలమైన అండ. ఏ బాధనైనా ఒక్క మాటతో పోగొట్టేవారు. అయితే తన భర్త ఛార్ల్స్ తన పూర్వపు స్నేహితురాలితో గడిపి వస్తున్న విషయాన్ని మాత్రం ఆమె తన తండ్రితో చెప్పకోలేకపోయారు. తం్రyì కి బదులుగా ఒంటరి గదిలో తన పెళ్లి గౌనుతో డయానా ఆ విషయాలను మౌనంగా పంచుకునేవారని ఆమె బతికి ఉండగానే ఆమె జీవిత చరిత్ర.. ‘డయానా: హర్ ట్రూ స్టోరీ’ ని రాసిన ఆండ్రూ మార్టన్ ఓ సందర్భంలో కవితాత్మకంగా తన సన్నిహితుల దగ్గర బహిర్గతం చేశారని అంటారు. -
డయానా పోలికలు
ప్రిన్సెస్ డయానా పుట్టిన ముప్పైఏళ్లకు జన్మించిన క్రిస్టెన్ స్టెవార్ట్ ఇప్పుడు తన ముప్పై ఏళ్ల వయసులో డయానా ముప్పై ఏళ్ల వయసులోని పాత్రను పోషించబోతున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సరళంగా చెప్పాలంటే... ప్రిన్స్చార్లెస్తో తన దాంపత్యం సవ్యంగా లేదని డయానా గ్రహించిన ఒకనాటి వీకెండ్ చుట్టూ కథను నిర్మించుకుని చిలీ దర్శకుడు పాబ్లో లారెయిన్ తీస్తున్న ‘స్పెన్సర్’ అనే చిత్రంలో క్రిస్టెన్ కథానాయికగా నటిస్తున్నారు. 20 ఏళ్ల వయసులో ప్రిన్స్ చార్లెస్‌తో డయానాకు పెళ్లయింది. తర్వాత పదేళ్ల కన్నా తక్కువ కాలంలోనే భర్తతో మానసికంగా ఆమె బంధం తెగిపోయింది. తెగిందని రూఢీ అయిన ఆ శని, ఆది వారాలలో డయానా మానసిక స్థితిని ఈ సినిమాలో క్రిస్టెన్ ప్రతిఫలింప జేయబోతున్నారు. బ్రిటన్ యువరాణిగా అభినయించనున్న ఈ అమెరికన్ నటి తన అత్యద్భుతమైన ప్రదర్శనను అలవోకగా ఇవ్వగలదని లారెయిన్ నమ్ముతున్నారు. బహుశా ఆ నమ్మకం రెండు కారణాల వల్ల ఆయనకు కలిగి వుండొచ్చు. ఒకటి స్టీవెన్ నైట్ స్క్రిప్టు ఇంకోటి క్రిస్టెన్ నవ్వు. ఆమె నవ్వితే అచ్చు నవ్వీనవ్వకుండా డయానా నవ్వినట్లే ఉంటుంది. -
వేర్వేరు దారుల్లో నడుస్తున్నాం: ప్రిన్స్ హ్యారీ
లండన్ : తామిద్దరం ప్రస్తుతం వేర్వేరు దారుల్లో నడుస్తున్నటికీ.. ఎల్లప్పుడూ అన్నదమ్ముల బంధం కొనసాగుతుందని ప్రిన్స్ హ్యారీ అన్నారు. ప్రతీ బంధంలో చిన్న చిన్న గొడవలు సహజమని.. నేటికీ తాను అన్నయ్యను అమితంగా ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు. బ్రిటీష్ రాజవంశ సోదరులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని గత కొంతకాలంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం.. భార్య మేఘన్ మార్కెల్‌తో కలిసి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ ఈ విషయాలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ క్షణం మేము కచ్చితంగా వేర్వేరు దారుల్లోనే ఉన్నాం. అయితే అత్యవసర సమయాల్లో మేము ఒకరికరం అండగా ఉంటాము. ప్రతిరోజూ నేరుగా కలుసుకోలేకపోవచ్చు కానీ ఆయనను అమితంగా ప్రేమిస్తూనే ఉంటాను. అన్నదమ్ముల మధ్య ప్రేమలు, చిన్న చిన్న గొడవలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతమాత్రాన మా గురించి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు’ అని చెప్పుకొచ్చారు. ఇక దక్షిణాఫ్రికా దేశాల పర్యటన గురించి చెబుతూ ఇది తన మనసుకు సాంత్వన చేకూరుస్తుందని అన్నారు. తన తల్లి ప్రిన్సెస్ డయానాను గుర్తు చేసుకునేందుకు.. ఆమె అడుగుజాడల్లో నడిచేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఒక రాజకుటుంబీకుడిగా తాను ప్రతీ క్షణం కెమెరా ముందే ఉంటున్నానని, ప్రతి క్షణం తన ఫొటోలు తీస్తున్నారని.. అయితే ఇదంతా తనను ఒక్కసారిగా గతంలోకి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. తన తల్లి జీవితంపై ఇలాంటివి దుష్ప్రభావం చూపాయని.. తన మరణాన్ని కూడా చెడుగా గుర్తుపెట్టుకునేలా చేశాయని విచారం వ్యక్తం చేశారు. ఆ గాయం తనను నేటికీ వెంటాడుతుందని.. తన జీవితంలో అతిపెద్ద విషాదం అని ఉద్వేగానికి గురయ్యారు. కాగా 1997లో బ్రిటన్ యువరాణి డయానా ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్లాండ్లో వేసవి సెలవల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్‌లో ఉండడంపై సందేహాలు రేకెత్తాయి. కారు ప్రమాదంలో డయానాతో పాటు సంపన్న వ్యాపారి కుమారుడు డోడీ అల్ ఫయేద్ కూడా ఉండడంతో మీడియా ఊహాలకు అంతేలేకుండా పోయింది. ఇరవైయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానాను తన ప్రియుడితో విహరిస్తున్న సమయంలో పాపరాట్సీ(ప్రముఖ వ్యక్తుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీసే ప్రయత్నం చేసేవారు) వెంటపడటంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైందంటూ వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. -
‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’
లండన్: ప్రిన్సెస్ డయానా.. ఈ కాలం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ ఇరవై ఏళ్ల క్రితం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్నారు. మామూలు సాధరణ కుటుంబంలో జన్మించి.. బ్రిటీష్ రాజకుంటుంబంలో కోడలిగా అడుగు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇందరి ప్రేమను పొందిన ఆమె మీద విధికి కన్ను కుట్టింది. దాంతో యాక్సిడెంట్ రూపంలో అర్థాంతరంగా డయానాను తనతో తీసుకెళ్లి.. కోట్ల మందిని కన్నీటి సంద్రంలో ముంచింది. చార్లెస్ ప్రిన్సెస్‌ను 1981లో వివాహం చేసుకుని రాజ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు డయానా. తరువాత 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆమె మరణించారు. డయానా మరణించి నేటికి 20 ఏళ్లకు పైనే అయ్యింది. అయితే తాజాగా ఓ నాలుగేళ్ల ఆస్ట్రేలియా బాలుడు తాను గత జన్మలో ప్రిన్సెస్ డయానాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన టీవీ ప్రజెంటర్ డేవిడ్ క్యాంప్ బెల్ నాలుగేళ్ల కుమారుడు బిల్లీ క్యాంప్ బెల్ తానే ప్రిన్సెస్ డయానాను అంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అని చెబుతున్నాడు. ప్రిన్స్ విలయమ్, ప్రిన్స్ హ్యారీ తన పిల్లలంటున్నాడు. ఈ విషయం గురించి బిల్లీ తండ్రి డేవిడ్ క్యాంప్ బెల్ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల వయసులో బిల్లీ తొలిసారి ఏదో కార్డు మీద డయానా ఫోటోను చూశాడు. అప్పుడే వచ్చిరాని భాషలో ఆ ఫోటోలో ఉన్నది నేనే.. ప్రిన్సెస్‌గా ఉన్నప్పుడు తీసిన ఫోటో అని చెప్పడం ప్రారంభించాడు’ అన్నాడు. ‘చిన్నతనం కదా.. అందుకే అలా మాట్లాడుతున్నాడని భావించాం. కానీ బిల్లీ పెరుగుతున్న కొద్ది.. డయానా జీవితానికి సంబంధించిన విషయాలు.. చార్లెస్‌తో గడిపిన రోజుల గురించి చెప్పేవాడు. కేవలం నాలుగేళ్ల వయసున్న బిల్లీకి.. డయానా గురించి తెలిసే అవకాశం లేదు. అయినా కూడా అతని వ్యాఖ్యలకు మేం పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. కానీ కొద్ది రోజుల క్రితం బిల్లీ మరో ఆసక్తికర, నమ్మలేని విషయం గురించి చెప్పాడు. డయానాకు జాన్ అనే సోదరుడు ఉన్నాడని.. కానీ పుట్టిన కొద్ది గంటల్లోనే అతను చనిపోయాడని తెలిపాడు. దాంతో నా కుమారుడి మాటలు నమ్మాల్సి వస్తోంది’ అంటున్నాడు డేవిడ్. -
చరిత్రలో నిలిచిపోయిన సెలబ్రిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సూపర్ స్టార్ శ్రీదేవీ దుబాయ్‌లో అకాల మరణం చెందడం దశాబ్ద కాలంలోనే పెద్ద చర్చనీయాంశం అయింది. భారతీయులతోపాటు పాకిస్థాన్ ప్రజల నివాళులను అందుకుంటున్న ఏకైక తార శ్రీదేవీయే కాచ్చు! జాతి, మత, కుల వైషమ్యాలు లేకుండా ప్రపంచ ప్రజల నీరాజనాలు అందుకుని చరిత్రలో నిలిచిపోయే వారు అతి కొద్ది మందే ఉంటారు. మైఖేల్ జాక్సన్ (1958–2009) పాప్ సింగర్‌గా ‘కింగ్ ఆఫ్ పాప్’ విశ్వవిఖ్యాతి చెందిన మైఖేల్ జాక్సన్ 2009లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో, తన ఇంట్లో అకాల మరణం పొందారు. ఆయన తన పాటలకు సంబంధించి 26 లక్షల డిజిటల్ ట్రాక్‌లను విక్రయించడం ద్వారా పది లక్షల డిజిటల్ ట్రాక్లకన్నా ఎక్కువగా విక్రయించిన ఏకైన సింగర్‌గా కూడా రికార్డు సృష్టించారు. ఎల్విస్ ప్రెస్లీ (1935–1977) ప్రముఖ అమెరికా గాయకుడు, కంపోజర్, నటుడు ఎల్విస్ ప్రెస్లీ తన గానామతంతో ‘కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా గుర్తింపు పొందారు. 20వ శతాబ్దంలో ఆయన పాట వినని ఇల్లంటూ అమెరికా, యూరప్ దేశాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకన్న ఆయన తన 42వ ఏట బాత్రూమ్లోనే కన్నుమూశారు. ఆయన అప్పటికే చిన్న ప్రేగు సమస్యతో బాధ పడుతున్నారు. ప్రిన్సెస్ డయానా (1961–1997) బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ డయానా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఎంటర్డేన్మెంట్ సెలబ్రిటిగా గుర్తింపు పొందారు. 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. ఆమెతోపాటు అ ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు. మార్లిన్ మాన్రో (1926 –1962) హాలీవుడ్ శృంగార తారగా 1950వ దశకంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మార్లిన్ మాన్రో పిన్న వయస్సులో, అంటే 36వ ఏట అకాల మరణం చెందారు. నాడీ మండలం చికిత్సకు వాడే ‘బార్బిటు రేట్’ ఒవర్ డోస్ వల్ల మరణించారు. విట్నీ హూస్టన్ (1963–2012) తన పాటలతో ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తూ ‘బిల్బోర్డ్ ఆల్బమ్ అవార్డు’ను దక్కించుకొని అనేక అవార్డులు పొందిన మహిళా సింగర్ ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కిన విట్నీ హూస్టన్ కూడా వాటర్ టబ్‌లోనే మరణించారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌లో గెస్ట్ రూమ్‌లో 2012, ఫిబ్రవరి 11వ తేదీన ఆమె కన్నుమూశారు. ఆ తర్వాత మూడేళ్లకు అంటే, 2015లో ఆమె కూతురు బొబ్బి కష్ణా బ్రౌన్ కూడా నీటి తొట్టిలోనే కోమాలోకి వెళ్లి ఆర్నెళ్లలోగా మరణించారు. ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ (1958 నుంచి 2016) పాటకు తగ్గ నత్యంతో యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ అమెరికా సింగర్ ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ తన 57వ ఏట ‘ఫెంటానిల్’ ఒవర్ డోస్ కారణంగా అకాల మరణం చెందారు. అభిమానులు ‘ప్రిన్సి’గా పిలుచుకునే రోగర్స్ పలు వాయిద్యాల్లో ఆరితేరిన విద్వాంసుడు. బెస్ట్ సెల్లింగ్ పాప్ సింగర్‌గా పాపులర్. -
డయానా వెర్రిది.. అయినా ఆమెతో..
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరు జారారు. ఆయన అధికారంలోకి రాకముందు ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ రాణి ప్రిన్స్ డయానాపై అసభ్యంగా మాట్లాడారు. డయానా ఓ వెర్రిబాగులదని, అయినప్పటికీ తాను కాదనకుండా ఆమెతో ఏకాంతంగా గడిపేవాడినంటు చెప్పవీలుకాని మాటలు అన్నారు. హోవార్డ్ స్టెర్న్ 2000 సంవత్సరంలో ట్రంప్ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన అన్న మాటలను తాజాగా చిన్న ట్రాన్స్క్రిప్ట్ల, ఆడియోల రూపంలో విడుదల చేసింది. 'ఆమె మంచి ఎత్తుంటుంది. మంచి రూపవతి. సూపర్ మోడల్ బ్యూటిఫుల్.. ఆకర్షణీయురాలు.. ఆమె చర్మం వర్ణించలేను... ఇంకా చెప్పాలంటే ఆమె ఒక వెర్రిబాగులది.. ఇవన్నీ కూడా కొద్ది వివరాలు మాత్రమే' అంటూ ఆయన అన్నారు. ఆమె వెర్రిది అయినప్పటికీ తాను ఆమెతో కాదనకుండా ఏకాంతంగా గడిపేవాడినని చెప్పారు. అంతేకాకుండా 1997లో స్టెర్న్‌కు, ట్రంప్‌కు మధ్య జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టింది. ఇందులో ట్రంప్ మరో అనూహ్య కామెంట్లు చేశారు. తాను ఏ మహిళతోనైనా శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు ఆమెను హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని కోరేవాడినని అప్పటి ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. ఇక 2000 సంవత్సరంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ టాప్ టెన్ హాట్ మహిళల గురించి చెప్పగా మొదటి స్థానంలో ఆయన మొదటి భార్యను, రెండో స్థానంలో ఆయన ప్రస్తుత భార్యను, మూడో స్థానంలో డయానాను పేర్కొన్నారట. -
బడికెళ్లిన బుల్లి యువరాజు
లండన్: బ్రిటన్ బుల్లి యువరాజు ప్రిన్స్ విలియం తనయుడు జార్జి బుల్లి స్వెట్టర్ వేసుకుని తొలిరోజు ఎంతో బుద్ధిగా బడికి కెళ్లారు. తొలిసారి స్కూల్‌కు వెళుతున్నజార్జిని ప్రిన్స్ విలియం ప్రత్యేకంగా స్కూల్‌కు తీసుకువెళ్లారు. ప్రిన్స్ జార్జి స్కూల్ యూనిఫాం ధరించి.. చక్కటి క్రాఫ్ తీసిన జుట్టుతో, చిన్న బ్యాగ్ పట్టుకునిబుడిబుడి అడుగులు వేసుకుంట బడికెళ్లారు. తొలిరోజు బడిలో సహ విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపాడని.. స్కూల్ అధ్యాపకులు చెప్పారు. తొలిరోజు తరగతిగదిలో గంట 40 నిమిషాల సేపు జూనియర్ ప్రిన్స్ గడిపాడు. 35 ఏళ్ల కిందట ఇదే పాఠశాలకు నన్ను మా అమ్మ ప్రిన్సెస్డయానా తొలిరోజు తీసుకు వచ్చిందని,ఇప్పుడు నేను నా కుమారుడిని అదే స్కూల్‌కు తీసుకువెళుతున్నాని ప్రిన్స్ విలియం అన్నారు. ఈ రెండు ఫొటోలను ప్రిన్స్ విలిమం సోషల్ మీడియాలో షేర్చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
డయానా శృంగార జీవిత రహస్యాలు వెలుగులోకి!
లండన్: ప్రిన్సెస్ డయానాకు చెందిన ప్రైవేట్ టేపులను విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. రాయల్ కుటుంబం వద్దని వారిస్తున్నా లెక్కచేయకుండా బ్రిటన్‌కు చెందిన బ్రాడ్ కాస్టర్ చానెల్ 4 ఆదివారం వాటిని బహిర్గతం చేయనుంది. టీవీ డాక్యుమెంటరీ రూపంలో ఉన్న ఈ ప్రైవేట్ టేపుల్లో డయానా వ్యక్తిగత లైంగిక జీవితం, వివాహం తర్వాత ప్రిన్స్ చార్లెస్ పట్ల ఉన్న అసంతృప్తి వంటి తదితరమైన అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రాయల్ కుటుంబం ఆలోచనలో పడింది. అనుమానాస్పదస్థితిలో ప్రిన్సెస్ డయానా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందే తన భర్త ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉండేది. లైంగిక జీవితం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందంటూ పలుమార్లు ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. అయితే, పలుటీవీ చానెల్లు రేడియో సంస్థలు ఆమె బతికున్న రోజుల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే బయటకు రాగా ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. వచ్చే నెలలో డయానా వర్థంతి నేపథ్యంలో ఆమె శృంగార జీవితానికి సంబంధించిన రహస్యాలను చానెల్ 4 విడుదల చేయనుంది. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టేపుల్లో చార్లెస్‌కు డయానాకు మధ్య ఏడేళ్లపాటు శృంగార జీవితం లేదని విషయం కూడా ఉండనుందని తెలుస్తోంది. హ్యారీ జన్మించిన తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎలా పెరిగిందనే విషయాలు, ఆ తర్వాత ఒకరిపట్ల ఒకరు విద్వేషంగా ఎలా మారారనే విషయాలు కూడా ఇందులో తెలియనున్నాయట. అయితే, వీటిని బహిర్గతం చేయొద్దంటూ ఇప్పటికే రాయల్ కుటుంబంతోపాటు డయానా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మాజీ అధికారులు చెబుతున్నప్పటికీ వాటిని విడుదల చేసేందుకు సదరు టీవీ చానెల్ సిద్ధమైంది. -
రాణి డయానా గురించి షాకింగ్ న్యూస్
లండన్: కారు ప్రమాదంలో చనిపోయిన బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించి ఒక షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి అయిన పది రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఆమె తన రెండు చేతుల మణికట్టులను రేజర్ బ్లేడ్‌తో కోసుకునే ప్రయత్నం చేసిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె తన సొంతమాటల్లో చెప్పినట్లు ఉన్న ఆడియో రికార్డులు ఉన్నట్లు తెలిసింది. ఆమె పెళ్లి అయిన తర్వాత చాలా మానసిక ఒత్తిడికి లోనైందని, అందుకు కారణం ఆమె భర్త చార్లెస్‌తోపాటు అతడి ప్రియురాలు క్యామిల్లానేనని తాజాగా బహిర్గతమైంది. ‘నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. నేను రేజర్ బ్లేడ్లతో నా చేతుల మణికట్లు కోసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని ఒకప్పుడు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అయిన డయానా ఈ ఘటనకు పాల్పడుతూ తన వాయిస్‌ను రికార్డు చేసుకుంది. ఈ మాటలు దాదాపు 1991 ప్రాంతంలో రికార్డయినట్లు చెబుతున్నారు. అయితే, ఆమె ఈ రికార్డింగులను ఓ స్నేహితురాలి సహాయంతో 20 ఏళ్లు బయటకు రాకుండా భద్రపరిచినట్లు ది సన్ తెలిపింది. గతంలోనే డయానాపై మోర్టన్ అనే పుస్తకం వచ్చినప్పటికీ అందులో కేవలం స్నేహితులు మాత్రమే ఈ విషయం చెప్పినట్లు ఉండగా తాజాగా విడుదల చేస్తున్న పుస్తకంలో మాత్రం ఆత్మహత్యా ప్రయత్నం విషయాన్ని డయానేనే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. తాజా పుస్తకం ఆండ్రూ మోర్టన్: డయానా-హర్ ట్రూ స్టోరీ అనే పేరుతో వస్తోంది. 1996 ఆగస్టు 28న ఆమెకు చార్లెస్‌కు వివాహం కాగా, 1997 ఆగస్టులో కారు ప్రమాదంలో చనిపోయింది. ఇది ఇప్పటికీ ఓ మిస్టరీనే. -
మా అమ్మ డయానా కోసం 20 ఏళ్లుగా..
లండన్: ఏదేశంలో ఉన్నా అమ్మ అమ్మే అని మరోసారి రుజువైంది. కొండంత డబ్బు, లెక్కలేనంత బంగారం, కాలు కిందపెట్టనీయని మంది మార్బలం ఉన్నా అమ్మలేని లోటు ముందు అవన్నీ దిగదుడుపే. ఈ విషయాన్ని స్వయంగా బ్రిటన్ యువరాజు హ్యారీ తెలిపాడు. తన తల్లి ప్రిన్సెస్ డయానా లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ప్రస్తుతం 32 ఏళ్ల వయసులో ఉన్న యువరాజు హ్యారీ 12 ఏళ్ల వయసులోనే 1997లో తన తల్లి డయానాను కోల్పోయాడు. అప్పటి నుంచి అతడు నరకం అనుభవించాడట. వేలసార్లు తనలో తానే కుమిలిపోయేవాడని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రతి క్షణం తన తల్లి డయానా గుర్తొచ్చేదని, వెంటనే ఎంతో ఎమోషనల్ అవుతుండేవాడినని కాల క్రమంలో అందులో నుంచి బయటపడేందుకు శత విధాల ప్రయత్నించినట్లు వివరించాడు. ఇంకెప్పుడు తన తల్లి గురించి ఆలోచించకూడదని బలంగా అనుకునేవాడినని, ఎందుకంటే ఆ ఆలోచన తనను మరింత కుంగదీస్తున్నందున ఆమె జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని భావించే వాడినని పేర్కొన్నారు. ఒక్కసారి అసలు తనకు ఏమవుతుందని భయంతో 28 ఏళ్ల సమయంలో కూడా మానసిక నిపుణులతో తర్ఫీదు తీసుకున్నట్లు వివరించారు. తన సోదరుడు ప్రిన్స్ విలియం నుంచి కూడా ఎంతో మద్దతులభించేదని, తన బాధ ఎప్పటికీ తన తల్లిని తీసుకురాలేదని క్రమంగా అర్థం చేసుకునేవాడినని, ఇప్పటికీ తానొక ఎమోషనల్ పర్సన్‌ను అని చెప్పేశారు. వాస్తవానికి మీడియా హ్యారీ ఎప్పుడూ దూరంగా ఉంటాడు. అతడికి మీడియాతో వ్యవహరించడం పెద్దగా అనుభవం కూడా లేదు. అతడి వ్యక్తిగత విషయాలను ఏనాడు వివరించలేదు. ఇంత ఓపెన్‌గా మాట్లాడటం ఇదే తొలిసారి. ఓ కారు ప్రమాదంలో డయానా ఆగస్టు 31, 1997లో కన్నుమూసిన విషయం తెలిసిందే. -
మా అమ్మ రోజూ గుర్తొస్తుంది!
'నీకెలా ఉంటుందో నాకు తెలుసు. మా అమ్మ నాకు ప్రతిరోజూ గుర్తొస్తుంటుంది. ఆమె చనిపోయి 20 ఏళ్లయినా ఆమెను నేను మిస్ అవుతూనే ఉన్నా'.. ఇది బ్రిటన్ రాకుమారుడు విలియమ్ ఓ చిన్నారితో చెప్పిన మాట. 14 ఏళ్ల ఆ బాలుడి తల్లి క్యాన్సర్ బారిన పడి చనిపోయింది. దీంతో అతన్ని ఓదార్చిన ప్రిన్స్ విలియమ్ తన తల్లి ప్రిన్సెస్ డయానా లేనిలోటు తనను ఎలా వెంటాడుతుందో తెలిపారు. 1997 ఆగస్టు 31న పారిస్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో డయానా చనిపోయింది. ప్రిన్స్ విలియమ్ గతవారం తూర్పు ఇంగ్లండ్‌లోని ఓ సంరక్షణాకేంద్రాన్ని సందర్శించి అక్కడి బాలలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తల్లిని కోల్పోయిన ఓ బాలుడితో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. 'నువ్ బాధపడటం, అమ్మను మిస్ అవ్వడం సరైనదే. కానీ, నీ ఆవేదనను కుటుంబంతో పంచుకో' అంటూ అతన్ని ఓదార్చారు. ప్రిన్స్ విలయమ్ వెంట ఆయన సతీమణి కేట్ కూడా ఉన్నారు. -
ఆ యువరాణి పేరు డయానా!
బ్రిటిష్ రాజ కుటుంబంలో కొత్తగా ఉదయించిన యువరాణికి పేరు పెట్టేశారు. ఆమెకు షార్లట్ ఎలిజబెత్ డయానా అని పేరు ఎంచుకున్నారు. యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఈ పేరు పెట్టారు. సింహాసనాన్ని అధిష్ఠించే వరుసలో నాలుగో వారసురాలిగా ఉన్న ఆమెను.. ''హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ షార్లట్ ఆఫ్ కేంబ్రిడ్జి''గా పిలుస్తారు. డయానా పేరు తప్పకుండా కలుపుతారని అందరూ ముందునుంచే ఊహిస్తున్నారు. యువరాణి తాత ప్రిన్స్ చార్లెస్, తాతమ్మ ఎలిజబెత్ 2, డయానా ముగ్గురి పేర్లను కలిపి మరీ ఈమెకు పెట్టారు. శనివారం నాడు లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో షార్లట్ పుట్టిన విషయం తెలిసిందే. పుట్టినప్పుడు ఆమె 8 పౌండ్ల 3 ఔన్సుల బరువుంది. ఇంతకుముందు విలియం, కేట్ దంపతులకు ప్రిన్స్ జార్జ్ అనే కొడుకున్నాడు. -
హ్యారీకి 100 కోట్ల వారసత్వ సంపద
తల్లి వీలునామా కింద అందుకోనున్న యువరాజు లండన్: బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ ఈ నెల 15న తన 30వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద మొత్తంలో సంపదను అందుకోనున్నారు. 1997లో పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణంపాలైన తన తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా సుమారు రూ. 100 కోట్ల సంపదను స్వీకరించనున్నారు. వీలునామాలో డయానా తన సంపదలో కొంత వాటాను ఇద్దరు కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలకు 25 ఏళ్లు నిండాక పంచాలని పేర్కొన్నారు. అయితే వీలునామా అమలుదారులు మాత్రం ఆ వయసును 30కి పెంచారు. దీంతో ఇప్పటివరకూ ఆ సంపదపై వడ్డీని పొందుతూ వచ్చిన హ్యారీ ఇక ఆ సంపదను కూడా పొందనున్నారు. ప్రిన్స్ హ్యారీ ప్రస్తుతం ఆర్మీ కెప్టెన్‌గా పనిచేస్తూ ఏటా దాదాపు రూ. 40 లక్షల వేతనం అందుకుంటున్నారు. 2012లో 30వ ఏట అడుగుపెట్టిన హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియమ్స్ ఇప్పటికే అతని వాటా సంపదను పొందాడు. ఈ వివరాలను ‘ద సండే టైమ్స్’ వెల్లడించింది. -
సీక్రెట్ - ప్రిన్సెస్ డయానా విషాద గాధ