ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్, ఫుల్‌హామ్ ఫుట్‌బాల్ క్లబ్ మాజీ యజమాని హమ్మద్ అల్ ఫయెద్ (94) ఇక లేరు. ప్రిన్సెస్ డయానాతో కారు ప్రమాదంలో మరణించిన డోడి అల్ ఫయెద్ పెద్ద కుమారుడు. హారోడ్స్ మాజీ ఓనర్అ యిన ఫయెద్ మరణాన్ని ఆయన కటుంబ సభ్యులు ధృవీకరించారు. తనయుడి మరణంతో కుంగిపోయిన ఆయన చివరకు కొడుకు దగ్గరికే చేరాడని, కొడుకు సమాధి దగ్గరే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించామని ఉకుటుంబ సభ్యులు ప్రకటించారు.అటు బ్రిటన్‌లోని ఫుల్‌హామ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఒక ప్రకటనలో ధృవీకరించింది. సామాన్య జీవితం నుంచి బిజినెస్ టైకూన్‌గా ఎదిగినా అతని మరణంపై పలువురి సంతాపం ప్రకటించారు. అతని మరణంతో ఒక శకం ముగిసిందనీ, బ్రిటీష్ఫుట్‌బాల్, వ్యాపారం, దాతృత్వం కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఆయనకు నివాళులు అర్పించారు.
1929 జనవరిలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జన్మించాడు. వీధుల్లో ఫిజీ డ్రింక్స్ అమ్మకాలతో మొదలైన అల్-ఫయేద్ కరియర్ కుట్టు యంత్రాల విక్రయదారుడిగాను, ఆ తరువాత రియల్ ఎస్టేట్, షిప్పింగ్ తదితర వ్యాపారాల్లో మధ్య ప్రాచ్యం, ఐరోపాలలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా అవతరించాడు.1954లో సౌదీ అరేబియా వ్యాపారవేత్త , అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి సోదరి సమీరా ఖషోగ్గిని వివాహం చేసుకున్నాడు.
1960ల మధ్యలో బ్రూనై సుల్తాన్‌కు సలహాదారు అయ్యాడు 1958లో ఇటలీలోని జెనోవాకు , ఆ తరువాత 1970లలో యూకేకువెళ్లాడు. కానీ బ్రిటీష్ పౌరసత్వం పొందాలనే అల్ ఫయెద్ దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరలేదు. పారిస్‌లోని రిట్జ్ హోటల్, లండన్‌లోని హారోడ్స్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌తో సహా తన కెరీర్‌లో అనేక ప్రతిష్టాత్మక హోల్డింగ్‌లను సంపాదించి ఈజిప్షియన్ వ్యాపారవేత్తగా రాణించాడు. 1972లో అతను దుబాయ్‌లో మెరైన్ రిపేర్ యార్డ్ ఇంటర్నేషనల్ మెరైన్ సర్వీసెస్‌ని, స్వంత షిప్పింగ్ కంపెనీ అయిన జెనీవాకోను స్థాపించాడు. గొప్ప పరోపకారి కూడా. ముఖ్యంగా పేద , అనారోగ్యంతో ఉన్న పిల్లలపై ఎక్కువగా కృషి చేశాడు.అలాగే 1987లో, వెనుకబడిన యువకుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో అల్ ఫయెద్ ఛారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించాడు.
క్యాష్ ఫర్ క్వశ్చన్స్ స్కాం
1994లో బ్రిటిష్ రాజకీయాలను కుదిపేసిన "క్యాష్ ఫర్ క్వశ్చన్స్" కుంభకోణంలో అల్ ఫయెద్ కూడా కీలక పాత్రధారి. అలాగే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రశ్నలు అడిగినందుకు ప్రతిఫలంగాటోరీ ఎంపీలు నీల్ హామిల్టన్, టిమ్ స్మిత్‌లకు పెద్దమొత్తంలో డబ్బులు పారిస్‌లోని రిట్జ్‌లో విలాసవంతమైన బస కల్పించానని చెప్పి పెద్ద దుమారాన్ని లేపాడు. మిస్టర్ స్మిత్ క్షమాపణ చెప్పిన తర్వాత 1997లో పదవీ విరమణ చేశాడు. నీల్ హామిల్టన్ అల్ ఫాయెద్‌పై పరువు నష్టం దావా వేసి భంగపడ్డాడు.
పారిస్ విషాదం
1997, ఆగస్టు 31లో అతని పెద్ద కుమారుడు, డోడి యువరాణి డయానాల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన కారు ప్రమాదం తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది ప్రమాదమా, లేక కుట్రతో హత్య చేశారా? అనే చర్చ పెద్ద దుమారమే రేగింది. డయానా, డోడి కలిసి ఉండటం ఇష్టం లేని వ్యక్తులు ఇద్దరినీ హత్య చేశారని ఫయెద్ అరోపించాడు. దీనిపై న్యాయ పోరాటానికి వేల డాలర్లు ఖర్చుపెట్టాడు. 2008లో ఈ వాదనను అక్కడి కోర్టు తోసి పుచ్చింది. ఈ తీర్పు పక్షపాతమని వాదించిన ఫయెద్ తాను చేయాల్సింది చేశాననీ, మిగతా ఆ దేవుడికే వదిలివేస్తున్నానని వ్యాఖ్యానించాడు. కంపెనీ రుణాలను తీర్చడానికి 2010లో, అల్ ఫయెద్ హారోడ్స్‌ను ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్‌కి 2 బిలియన్ డాలర్లు విక్రయించి, పదవీ విరమణను ప్రకటించాడు.
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, నవంబర్ 2022లో ఫాయెద్ విలువ 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అల్ ఫయెద్ కుమారుడు డోడి ,వేల్స్ యువరాణి డయానా 1997లో కారు ప్రమాదంలో మరణించడంతో ఆయన జీవితంలో పెద్ద విషాదాన్ని నింపింది. వీరి ఆకస్మిక మరణం రాజకుటుంబం ఉందని ఆరోపించాడు. దీనికోసం పెద్ద న్యాయ పోరాటమే చేశాడు. అలాగే డయనా, డోడీకి హారోడ్స్‌లో 998లో రెండు స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశాడు. డయానా , డోడీల ఫోటోలతో పిరమిడ్-ఆకారంలో ఒక కట్టడాన్ని నిర్మించాడు. ఇందులోవారి ఆఖరి డిన్నర్‌లోని వైన్ గ్లాస్, యువరాణి కోసం తన కొడుకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్న ఉంగరంతో దీన్ని ఏర్పాడు ఏశాడు. అంతేకాదు హారోడ్స్ పైకప్పుపై ఉన్న గాజు సమాధిలో తన మృతదేహాన్ని ప్రదర్శనకు ఉంచాలని కోరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment