tycoon
-
డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్, ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్ మాజీ యజమాని హమ్మద్ అల్ ఫయెద్ (94) ఇక లేరు. ప్రిన్సెస్ డయానాతో కారు ప్రమాదంలో మరణించిన డోడి అల్ ఫయెద్ పెద్ద కుమారుడు. హారోడ్స్ మాజీ ఓనర్అ యిన ఫయెద్ మరణాన్ని ఆయన కటుంబ సభ్యులు ధృవీకరించారు. తనయుడి మరణంతో కుంగిపోయిన ఆయన చివరకు కొడుకు దగ్గరికే చేరాడని, కొడుకు సమాధి దగ్గరే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించామని ఉకుటుంబ సభ్యులు ప్రకటించారు.అటు బ్రిటన్‌లోని ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఒక ప్రకటనలో ధృవీకరించింది. సామాన్య జీవితం నుంచి బిజినెస్ టైకూన్‌గా ఎదిగినా అతని మరణంపై పలువురి సంతాపం ప్రకటించారు. అతని మరణంతో ఒక శకం ముగిసిందనీ, బ్రిటీష్ఫుట్బాల్, వ్యాపారం, దాతృత్వం కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఆయనకు నివాళులు అర్పించారు. 1929 జనవరిలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జన్మించాడు. వీధుల్లో ఫిజీ డ్రింక్స్ అమ్మకాలతో మొదలైన అల్-ఫయేద్ కరియర్ కుట్టు యంత్రాల విక్రయదారుడిగాను, ఆ తరువాత రియల్ ఎస్టేట్, షిప్పింగ్ తదితర వ్యాపారాల్లో మధ్య ప్రాచ్యం, ఐరోపాలలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా అవతరించాడు.1954లో సౌదీ అరేబియా వ్యాపారవేత్త , అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి సోదరి సమీరా ఖషోగ్గిని వివాహం చేసుకున్నాడు. 1960ల మధ్యలో బ్రూనై సుల్తాన్‌కు సలహాదారు అయ్యాడు 1958లో ఇటలీలోని జెనోవాకు , ఆ తరువాత 1970లలో యూకేకువెళ్లాడు. కానీ బ్రిటీష్ పౌరసత్వం పొందాలనే అల్ ఫయెద్ దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరలేదు. పారిస్‌లోని రిట్జ్ హోటల్, లండన్‌లోని హారోడ్స్ డిపార్ట్మెంట్ స్టోర్‌తో సహా తన కెరీర్లో అనేక ప్రతిష్టాత్మక హోల్డింగ్లను సంపాదించి ఈజిప్షియన్ వ్యాపారవేత్తగా రాణించాడు. 1972లో అతను దుబాయ్‌లో మెరైన్ రిపేర్ యార్డ్ ఇంటర్నేషనల్ మెరైన్ సర్వీసెస్‌ని, స్వంత షిప్పింగ్ కంపెనీ అయిన జెనీవాకోను స్థాపించాడు. గొప్ప పరోపకారి కూడా. ముఖ్యంగా పేద , అనారోగ్యంతో ఉన్న పిల్లలపై ఎక్కువగా కృషి చేశాడు.అలాగే 1987లో, వెనుకబడిన యువకుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో అల్ ఫయెద్ ఛారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. క్యాష్ ఫర్ క్వశ్చన్స్ స్కాం 1994లో బ్రిటిష్ రాజకీయాలను కుదిపేసిన "క్యాష్ ఫర్ క్వశ్చన్స్" కుంభకోణంలో అల్ ఫయెద్ కూడా కీలక పాత్రధారి. అలాగే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రశ్నలు అడిగినందుకు ప్రతిఫలంగాటోరీ ఎంపీలు నీల్ హామిల్టన్, టిమ్ స్మిత్‌లకు పెద్దమొత్తంలో డబ్బులు పారిస్‌లోని రిట్జ్‌లో విలాసవంతమైన బస కల్పించానని చెప్పి పెద్ద దుమారాన్ని లేపాడు. మిస్టర్ స్మిత్ క్షమాపణ చెప్పిన తర్వాత 1997లో పదవీ విరమణ చేశాడు. నీల్ హామిల్టన్ అల్ ఫాయెద్పై పరువు నష్టం దావా వేసి భంగపడ్డాడు. పారిస్ విషాదం 1997, ఆగస్టు 31లో అతని పెద్ద కుమారుడు, డోడి యువరాణి డయానాల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన కారు ప్రమాదం తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది ప్రమాదమా, లేక కుట్రతో హత్య చేశారా? అనే చర్చ పెద్ద దుమారమే రేగింది. డయానా, డోడి కలిసి ఉండటం ఇష్టం లేని వ్యక్తులు ఇద్దరినీ హత్య చేశారని ఫయెద్ అరోపించాడు. దీనిపై న్యాయ పోరాటానికి వేల డాలర్లు ఖర్చుపెట్టాడు. 2008లో ఈ వాదనను అక్కడి కోర్టు తోసి పుచ్చింది. ఈ తీర్పు పక్షపాతమని వాదించిన ఫయెద్ తాను చేయాల్సింది చేశాననీ, మిగతా ఆ దేవుడికే వదిలివేస్తున్నానని వ్యాఖ్యానించాడు. కంపెనీ రుణాలను తీర్చడానికి 2010లో, అల్ ఫయెద్ హారోడ్స్ను ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్‌కి 2 బిలియన్ డాలర్లు విక్రయించి, పదవీ విరమణను ప్రకటించాడు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, నవంబర్ 2022లో ఫాయెద్ విలువ 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అల్ ఫయెద్ కుమారుడు డోడి ,వేల్స్ యువరాణి డయానా 1997లో కారు ప్రమాదంలో మరణించడంతో ఆయన జీవితంలో పెద్ద విషాదాన్ని నింపింది. వీరి ఆకస్మిక మరణం రాజకుటుంబం ఉందని ఆరోపించాడు. దీనికోసం పెద్ద న్యాయ పోరాటమే చేశాడు. అలాగే డయనా, డోడీకి హారోడ్స్‌లో 998లో రెండు స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశాడు. డయానా , డోడీల ఫోటోలతో పిరమిడ్-ఆకారంలో ఒక కట్టడాన్ని నిర్మించాడు. ఇందులోవారి ఆఖరి డిన్నర్లోని వైన్ గ్లాస్, యువరాణి కోసం తన కొడుకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్న ఉంగరంతో దీన్ని ఏర్పాడు ఏశాడు. అంతేకాదు హారోడ్స్ పైకప్పుపై ఉన్న గాజు సమాధిలో తన మృతదేహాన్ని ప్రదర్శనకు ఉంచాలని కోరుకున్నాడు. -
జాక్ మాకు షాకిచ్చిన వ్యాక్సిన్ టైకూన్
బీజింగ్ : అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మాకు వ్యాక్సిన్ టైకూన్, వాటర్ బాటిళ్ల వ్యాపారవేత్త భారీ షాక్ ఇచ్చాడు. రీటైల్ పెట్టుబడిదారుడైన జాంగ్ షాన్షాన్ చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ నికర విలువ బుధవారం 58.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది జాక్ మా కంటే రెండు బిలియన్ డాలర్లు ఎక్కువ. దీంతో ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తరువాత ఆసియాలో రెండవ ధనవంతుడిగా ఉన్నారు. అలాగే ప్రపంచంలో 17 వ సంపన్నుడుగా జాంగ్ ఘనత దక్కించుకున్నారు. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లో ఐటీ నష్టాలతో ప్రపంచంలోని 500 ధనవంతుల సంపద భారీగా తుడుచు పెట్టుకుపోయింది. ప్రధానంగా బ్యాటరీ ఈవెంట్ అంచనాలను అందుకోకపోవడంతో మస్క్ 10 బిలియన్ డాలర్లను కోల్పోయారు. బెజోస్ 7.1 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఫలితంగా మస్క్ సంపద 93.2 బిలియన్ డాలర్లకు చేరగా, బెజోస్ నికర సంపద 178 బిలియన్ డాలర్లుగా ఉంది. జాంగ్ బుధవారం ఒక్క రోజు 4 బిలియన్ల డాలర్లు సాధించడం విశేషం. "లోన్ వోల్ఫ్" గా పేరొందిన షాన్షాన్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరువాత ప్రపంచంలో మరెవ్వరూ సాధించని ఆదాయాన్ని ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్నారు. 2020లో అతని సంపద 51.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. వాటర్ బాటిల్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ కంపెనీ ఐపీవో ద్వారా హాంకాంగ్ లో అతిపెద్ద రీటైల్ పెట్టుబడిదారుడిగా షాన్షాన్ అవతరించాడు. ఆ తరువాత బీజింగ్ వంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ కంపెనీ లిస్టింగ్ ద్వారా ఆగస్టు నాటికి ఆయన నికర విలువ ఏకంగా 20 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే త్వరలోనే జాక్ మా మళ్లీ టాప్ ప్లేస్ కు చేరుకుంటాడని అంచనా. -
కరోనా : బిజినెస్ టైకూన్‌కు జైలు భారీ జరిమానా
బీజింగ్ : ప్రభుత్వంపై విమర్శలకు చేసినందుకు గాను చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలియనీర్ రెన్ జికియాంగ్ (69) కు మరోసారి భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ మహమ్మారి నిర్వహణలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సర్కార్ విఫలమైందంటూ బహిరంగంగా విమర్శించిన ప్రభుత్వ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ మాజీ చైర్మన్ రెన్కు అవినీతి ఆరోపణలపై 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పలు ఆరోపణలపై రెన్ను బీజింగ్‌లోని ఒక న్యాయస్థానం మంగళవారం దోషిగా తేల్చింది. ముఖ్యంగా సుమారు 16.3 మిలియన్ల డాలర్ల (110.6 మిలియన్ యువాన్లు) ప్రజా నిధుల అక్రమాలు, లంచాలు, అధికార దుర్వినియోగం లాంటి ఆరోపణలను విచారించిన కోర్టు జైలు శిక్షతోపాటు, 620,000 డాలర్ల (4.2 మిలియన్ యువాన్లు) జరిమానా కూడా విధించింది. అంతేకాదు రెన్ అక్రమసంపాదను ప్రభుత్వానికి స్వాధీనం చేయడంతోపాటు, తన నేరాలన్నింటినీ స్వచ్ఛందంగా అంగీకరించాడని కోర్టు తెలిపింది. చైనా ట్రంప్ గా పేరొందిన రెన్ జికియాంగ్ చిక్కుల్లో పడటం ఇదే మొదటి సారి కాదు. చైనా అధ్యక్షుడు జింపింగ్ పై తీవ్ర విమర్శలతో గతంలో వార్తల్లో నిలిచారు. కమ్యూనిస్ట్ పార్టీ పాలక కుటుంబంలో జన్మించిన రెన్ తరచుగా చైనా రాజకీయాలపై బహిరంగంగా, సూటిగా విమర్శలు గుప్పించేవారు. అందుకే చైనా సోషల్ మీడియాలో "ది కానన్" అనే పేరు వచ్చింది. ఈ క్రమంలో గత మార్చిలో ప్రభుత్వ విధానాలు, పత్రికా స్వేచ్ఛ, అసమ్మతిపై ఒక వ్యాసాన్ని ప్రచురించారు. చైనా ప్రజల భద్రత కంటే తన సొంత ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టిపెడుతోందని ఆరోపించారు. అలాగే వుహాన్‌లో డిసెంబర్లో ప్రారంభమైన వ్యాప్తిని జిన్‌పింగ్ తప్పుగా నిర్వహించాడని ఆరోపించడం దుమారం రేపింది. వాస్తవాలను ప్రచురించకుండా మీడియాకు అడ్డంకులు, సరైన నిర్వహణ వ్యవస్థలేకుండా కరోనావ్యాప్తి ఈ రెండింటి ద్వారా ప్రజల జీవితాలు నాశన మవుతున్నాయని రెన్ ఆరోపించారు. ఈ వ్యాసం ఆన్లైన్లో వైరల్ కావడంతో జూలైలో రెన్ను పార్టీ నుండి బహిష్కరించడంతో పాటు, పలు అవినీతి ఆరోపణలతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. 2016లో కూడా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు క్రమశిక్షణా చర్యకు గురైన రెన్కు ఇక రెండో అవకాశం లేదని అక్కడి రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనాపై ప్రపంచాన్నితప్పుదారి పట్టించిందంటూ చైనాపై అంతర్జాతీయంగా విమర్శలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో బహిరంగ విమర్శలు లేదా ధిక్కరణను సహించేది లేదనే సందేశాన్ని అక్కడ ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. -
జిన్‌పింగ్‌పై విమర్శలు, పార్టీ నుంచి గెంటివేత
బీజింగ్: అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌పై విమర్శలు చేసిన ఓ వ్యాపారవేత్తను చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) బహిష్కరించింది. అధ్యక్షుడిని విమర్శించడం ద్వారా రెన్ ఝిగియాంగ్ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఝిగియాంగ్పై అవినీతి, నిధుల మళ్లింపు ఆరోపణలు కూడా ఉన్నాయని సీపీసీ వెల్లడించింది. పార్టీ ప్రతిష్ఠ దృష్ట్యా కూడా బహిష్కరణ చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, 69 ఏళ్ల ఝిగియాంగ్ చైనాలో మంచి పలుకుబడి కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్త. సీపీపీలో సీనియర్ నేత. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ పాలనపై ఆయన తరచూ విమర్శలు చేస్తుంటారు. (చదవండి: మీ జోక్యం అక్కర్లేదు: చైనా) ఈక్రమంలోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన మార్చి నెలలో ఘాటు విమర్శలు చేశారు. దీంతో కొన్ని రోజులపాటు ఆయనను జైల్లో పెట్టారు. ఇక 2016లో సైతం ఆయన ప్రభుత్వ పనితీరు, సీపీసీపై విమర్శలు గుప్పించారు. అధ్యక్షడికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఊడిగం చేస్తోందంటూ విమర్శలు చేయడంతో చైనా సోషల్ మీడియాలో ఆయనపై కొన్ని రోజులపాటు నిషేధం కూడా విధించారు. ప్రభుత్వం, జిన్‌పింగ్‌పై నిర్భయంగా విమర్శలు చేయడంతో ఆయనను చైనాలో నెటిజన్లు ‘కేనాన్’గా పిలుస్తారు. ఇక ఝిగియాంగ్పై పార్టీ బహిష్కరణ జిన్‌పింగ్‌పై విమర్శలు చేసేవారికి సీపీసీ ఒక హెచ్చరిక ఇచ్చినట్టయింది. (ఇలాగైతే చైనాతో కటీఫ్!) -
రియల్టీ కుబేరులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) అధినేత మంగళ్ ప్రభాత్ లోధా నిలిచారు. ఈయన సంపద విలువ రూ.31,960 కోట్లు. దేశంలోని రియల్టీ కుబేరుల్లో లోధా వరుసగా రెండు సార్లు అగ్రస్థానంలో నిలిచినట్లు ‘హురున్– గ్రోహే’ సంస్థలు ఇండియాపై సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. లోధా ప్రస్తుతం బీజేపీ ముంబై శాఖ అధ్యక్షుడు కూడా. గతేడాదితో పోలిస్తే లోధా కుటుంబ సంపద 18 శాతం వృద్ధి చెందింది. 100 మందితో కూడిన ఈ జాబితాలో మిగతా 99 మంది రియల్టీ టైకూన్స్ సంపదలో లోధా కుటుంబ సంపద వాటా 12 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలియజేసింది. 100 మంది సంపద 2,77,080 కోట్లు.. దేశంలో అగ్రస్థానంలో ఉన్న 100 మంది రియల్టీ టైకూన్స్ సంపద విలువ రూ.2,77,080 కోట్లుగా అంచనా. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి చెందినట్లు ‘హురున్– గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్– 2019’ నివేదిక తెలియజేసింది. ఈ వంద మంది జాబితాలో 37 మంది ముంబైవాసులే. ఢిల్లీలో 19 మంది, బెంగళూరులో 19 మంది ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తల సగటు వయసు 59 ఏళ్లు. ఆరుగురు మాత్రం 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు. ముగ్గురు 80 ఏళ్లు పైబడిన వారు. 8 మంది మహిళలకు చోటు.. ఈ జాబితాలో తొలిసారి 8 మంది మహిళలకు స్థానం దక్కింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ స్మిత వీ స్రిశ్న మహిళల్లో టాప్‌లో ఉండగా.. మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.3,560 కోట్లు. తర్వాతి స్థానాల్లో డీఎల్ఎఫ్కు(కమర్షియల్) చెందిన రేణుక తల్వార్(సంపద రూ.2,590 కోట్లు) పాయ్ సింగ్ (రూ.2,370 కోట్లు), ఎమ్మార్ ఈజీఎఫ్ ల్యాండ్ శిల్పా గుప్తా (రూ.730 కోట్లు), సూపర్‌టెక్ సంగీత అరోరా (రూ.410 కోట్లు), గోపాలన్ ఎంటర్ప్రైజెస్ ఎం వసంత కుమారీ (రూ.310 కోట్లు), వాటికా కమర్షియల్ విభాగం కాంచన భల్లా (రూ.300 కోట్లు) నిలిచారు. మై హోమ్.. యంగ్ టైకూన్స్ దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన్స్గా హైద రాబాద్లోని మై హోమ్ గ్రూప్‌నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్‌రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయ స్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్... వృద్ధ రియల్టీ టైకూన్‌గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ.3,670 కోట్లు. రామురావు, శ్యామ్‌రావు -
ఏ సర్వీసు కావాలన్నా..!
• 85 రకాల సేవలందిస్తున్న అర్బన్‌క్లాప్ • ఇప్పటికే రూ.250 కోట్ల నిధుల సమీకరణ • ఇన్వెస్టర్లలో స్నాప్‌డీల్ ఫౌండర్లతో పాటూ రతన్‌టాటా కూడా.. • త్వరలోనే మధ్యప్రాచ్య దేశాలకూ విస్తరణ • ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో అర్బన్‌క్లాప్ ఫౌండర్ అభిరాజ్ భాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బిజినెస్ టైకూన్ రతన్ టాటా నుంచి పెట్టుబడులు పొందింది. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ఫౌండర్ల నుంచీ నిధులు సమీకరించింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా కలసి సేవల గురించి తెలుసుకునే స్థాయికీ ఎదిగింది. .. అయితే ఇదేదో పెద్ద కంపెనీ అనుకుంటే పొరపాటే. పోనీ టెక్నాలజీ స్టార్టప్ అనుకుంటే కూడా అంతే. ఇది కేవలం ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, ట్యూటర్, ఫిట్నెస్ ట్రెయినర్ వంటి సర్వీసులు కావాల్సినవారికి రోజూవారీ అవసరాలను తీర్చే ఓ స్టార్టప్! అసలేంటా స్టార్టప్.. దాని కథేంటో ఈవారం ‘స్టార్టప్డైరీ’లో.. ‘‘కార్పెంటర్, క్లీనింగ్, యోగా ట్రెయినర్, ప్యాకర్ అండ్ మూవర్స్ వంటివి చాలా వరకు సేవలు అసంఘటితంగా ఉన్నాయి. వేటికీ నిర్దిష్టమైన ధరలుండవు. కస్టమర్ల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని నోటికి ఎంతొస్తే అంత ధర చెప్పేస్తుంటారు. మనకూ అత్యవసరం కాబట్టి జేబు గుల్ల చేసుకొని మరీ పని చేయించుకుంటుంటాం’’ సరిగ్గా ఇదే అనుభవం అభిరాజ్ భాల్కూ ఎదురైంది. అందరిలా అక్కడికే ఆగిపోకుండా.. ఆయా సేవలకు టెక్నాలజీని జోడించి ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చి వ్యాపార అవకాశంగా మార్చుకుంటేపోలే అనుకున్నాడు. ఇంకేముంది.. మరో ఇద్దరు కో-ఫౌండర్స్ వరుణ్ కేతన్, రాఘవ చంద్రలతో కలిసి 2014 జూన్‌లో రూ.10 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా ‘అర్బన్‌క్లాప్’ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇంటి వద్దే 85 రకాల సేవలు.. ప్రస్తుతం బ్యూటీషియన్స్, యోగాటీచర్స్, ఫిట్నెస్ ట్రెయినర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రిషీయన్స్, కార్ క్లీనింగ్, అకాడమీ ట్యూటర్స్, వెడ్డింగ్, ఈవెంట్ ప్లానర్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్.. ఇలా 85 రకాల సర్వీస్ ప్రొవైడర్ల సేవలను అందిస్తున్నాం. కస్టమర్లకు సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య అర్బన్‌క్లాప్ సంధానకర్తగా పనిచేస్తుంది. సేవల్లో నాణ్యత, నమ్మకం రెండూ కల్పించడం మా ప్రత్యేకత. ప్రస్తుతం 50 వేల మంది సర్వీస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. వారంతా కస్టమర్ల ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తారు. ప్రొఫెషనల్స్ డేటాను పూర్తి స్థాయిలో వెరిఫై చేశాకే ఉద్యోగులుగా నియమించుకుంటాం. వారితో అగ్రిమెంటూ చేసుకుంటాం కాబట్టి సెక్యూరిటీ, నమ్మకమైన సర్వీసుపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దక్షిణాది వాటా 60 శాతం.. ఇప్పటివరకు 12 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజుకు 5-6 వేల మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 60 శాతం వరకుంటుంది. హైదరాబాద్ నుంచి 10-15 శాతం వాటా ఉంటుంది. ఏటా పది రెట్లు వృద్ధిని సాధిస్తున్నాం. సేవలను బట్టి 5-20 శాతం వరకు కమీషన్ రూపంలో తీసుకుంటాం. మా మొత్తం వ్యాపారంలో 20-25 శాతం వాటా అందం, ఆరోగ్యం విభాగాలదే. వచ్చే మూడు నెలల్లో దీన్ని 40 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. అందుకే సేవల సంఖ్యను వందకు చేర్చాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడులతో విస్తరణ చేయనున్నాం. డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, సేంద్రీయ తిండి వంటకాలు వంటివి తీసుకొస్తాం. మధ్యప్రాచ్య దేశాలకూ విస్తరణ.. ప్రస్తుతం మా సంస్థలో 320 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముంబై కేంద్రంగా పనిచేసే హ్యాండీహోమ్ను కొన్నాం. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్కత్తా నగరాల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరణతో పాటూ మధ్య ప్రాచ్య దేశాలకూ విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకోసమే ఇటీవలే రూ.165 కోట్లు పెట్టుబడులను సమీకరించాం. దీంతో మొత్తం రూ.250 కోట్ల పెట్టుబడులకు చేరింది. బెస్సీమెర్ వెంచర్, యాక్సెల్, సైఫ్ పార్టనర్స్, స్నాప్‌డీల్ ఫౌండర్లైన కునాల్బాల్, రోహిత్ బన్సల్, రతన్‌టాటాలు ఈ పెట్టుబడులు పెట్టారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
కోట్ల ఖర్చుతో మరో ఎన్నారై పెళ్ళి...
పెళ్ళంటె పందిళ్ళు, సందళ్ళు.... తప్పెట్లు, తలంబ్రాలు అన్న చందంనుంచీ కోట్ల రూపాయల ఖర్చులు, చిత్ర సీమను మించిపోయే సెట్లుగా మారిపోయాయి. విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్తలు వారి పిల్లల పెళ్ళిళ్ళకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి... స్టేటస్ ను చాటుతున్నారు. ఒకరికంటే ఒకరు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల కేరళకు చెందిన ఎన్నారై రవి పిళ్ళై జరిపిన అత్యంత ఖరీదైన పెళ్ళి మరిచిపోకముందే... మరో పారిశ్రామికవేత్త యోగేష్ మెహతా తన ఏకైక కుమారుడి పెళ్ళికి సుమారు నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైనం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ఇటాలియన్ వెడ్డింగ్ బొనాంజా ఇప్పుడు దుబాయ్ ప్రజలనే కాక, ప్రపంచాన్నే ఆకట్టుకుంటోంది. దుబాయిలో పేరొందిన వ్యాపారవేత్త.. 2015లో టాప్ 50 ధనవంతుల్లో ఒకరైన యోగేష్ మెహతా... తన కుమారుడు రోహాన్ పెళ్ళిని దుబాయి ప్లోరెన్స్ లోని రిలైన్స్ నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. లండన్ వధువు రోషని తో జరిపిన ఈ వివాహానికి సుమారు 500 మంది అతిథులను ఆహ్వానించారు. నవంబర్ 25 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన వివాహ మహోత్సవానికి ఇతర దేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. భారత సంప్రదాయ చీరకట్టుతో, చేతులనిండా గోరింటాకు డిజైన్లతో మెరిసిన వధువు రోషని లండన్ లో సొంతంగా ఓ ఫ్యాషన్ కంపెనీని నడుపుతోంది. ఇక వరుడు రోహాన్ తమ కుటుంబం స్థాపించిన ప్రముఖ పెట్రో కెమ్ కంపెనీలో ఇటీవలే చేరాడు. వధూవరులిద్దరూ ఇకపై దుబాయిలోనే స్థిరపడే ఉద్ద్దేశ్యంలో ఉన్నారట. ఈ కోట్ల రూపాయల పెళ్ళి ఫొటోలను యోగేష్ తన ట్విట్టర్ లో సైతం పోస్ట్ చేశారు. అయితే దక్షిణాసియాలోని సంప్రదాయంలో భాగంగా వరుడు పెళ్ళి సందర్భంలో ఏనుగుపై ఊరేగి రావడానికి మాత్రం... అక్కడి నిబంధనల మేరకు..ఫ్లోరెన్స్ సిటి కౌన్సిల్ అభ్యంతరం తెలిపిందట. ఏది ఏమైనా ఆ సంపన్న వివాహం ఇప్పుడు మీడియాలో ప్రత్యేక వార్తగా మారింది.