Egyptian
-
హజ్ యాత్రలో వెయ్యి మంది మృతి
రియాద్: ఈ ఏడాది హజ్ యాత్రలో ఎండల తీవ్రతకు తాళలేక 10 దేశాలకు చెందిన 1,081 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారతీయులు 68 మంది కాగా, ఈజిప్టు దేశస్తులు అత్యధికంగా 658 ఉన్నారు. ఒక్క గురువారమే ఈజిప్టుకు చెందిన 58 మంది చనిపోయినట్లు ఆ దేశ దౌత్యాధికారి ఒకరు తెలిపారు. మొత్తం మృతుల్లో 630 మంది వరకు అనధికారికంగా వచ్చిన వారు ఉన్నారు. అధికారికంగా పేర్లు నమోదైన వారికి, ప్రభుత్వం ఏసీ ప్రాంతాన్ని కేటాయిస్తుంది. అనధికారికంగా వచ్చిన వారు ఎండకు తాళలేక ప్రాణాలు కోల్పోతున్నారని అ«ధికారులు చెప్పారు. -
ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు -
వాట్! ఈజిప్టు మమ్మీ సాయంతో పురాతన కాలం నాటి "సెంట్"!
ఈజిప్టు మమ్మీల గురించి కథనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇంతవరకు ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు విపులీకరించారు. ఆరోజుల్లో వారు ఎలాంటి వాటిని ఉపయోగించారో చూశాం. ఐతే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు ఇంకాస్తు ముందడుగు వేసి.. వేల ఏళ్ల నాటి పురానత మమ్మీ నుంచి పరిమళాలు వెదజల్లే 'సెంట్'ని తయారు చేశారు. మమ్మీఫికేషన్‌లో వాడే సుగంధాన్నే తిరిగి ఆ మమ్మీ సాయంతో రూపొందించామని చెబుతున్నారు. వాట్ పురాత మమ్మీతో సెంట్ ఎలా?! అనే కదా! వివరాల్లోకెళ్తే..మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్తలు మమ్మీ 'సెనెట్నే' అనే ఈజిప్షియన్ మహిళ మమ్మీఫికేషన్‌లో ఉపయోగించిన పురాత సువాసనను వారు తిరిగి పునః సృష్టించారు. దీంతో ఆనాడు వారు ఉపయోగించిన పద్ధతులను తెలుసుకోగలిగామని అంటున్నారు. అందుకోసం మమ్మీ 'సెనెట్నే' ఊపిరితిత్తులు, కాలేయాన్ని రెండు పాత్రలలోకి తీసుకున్నారు. అప్పుడు వచ్చిన ఔషధ తైలాల నమునాలను సేకరించి వాటిలో ఉపయోగించిన పదార్థాలను కనుగొన్నారు. వాటిలో బీస్వాక్స్, ప్లాంట్ ఆయిల్, కొవ్వులు, బిటుమెన్, పినేసి రెసిన్లు, ట్రీ రెసిన్ వంటి పరిమళ పదార్థాల సంక్లిష్ట మిశ్రమం అని గుర్తించారు. ఇది కాస్త 3వేల సంత్సరాల క్రితం ఉపయోగించిన సువాసన గల సెంట్‌ని తిరిగి రూపొందించేందుకు దారితీసింది. శాస్త్రవేత్తలు పునాదిలో లభించిన సేంద్రీయ అవశేషాలను ఉపయోగించి ఈ సువాసన గల 'సెంట్'ని తయారు చెయ్యడం విశేషం. ఈ 'సెంట్'ని శాస్త్రవేత్తలు "సెంట్ ఆఫ్ ఎటర్నీటీ" లేదా "సెంట్ ఆఫ్ లైఫ్" అని పిలుస్తున్నారు. ఈ "సెన్ట్నే" అనే మమ్మీకి మమ్మీఫికేషన్ ఉపయోగించే పదార్థాలు ఇప్పటివరకు గుర్తించని వాటితో రూపొందించినట్లు తెలిపారు. వీటి కారణంగానే బాడీలు పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయని ఆ కాలంలోని వారు విశ్వసించటం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఈ మమ్మీఫికేషన్‌లో అత్యంత ఖరీదైన పదార్థాలనే వాడినట్లు తెలిపారు. ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ కరోల్ కాల్వేజ్ సాయంతో పరిశోధకులు 3 వేల ఏళ్ల నాటి పురాతన సువాసనను పునః సృష్టించారు. త్వరలో డెన్మార్క్‌లోని మోస్గార్డ్ మ్యాజియంలో ఈ సెంట్ బాటిల్‌ని ఉంచనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఒకరకంగా ఈజిప్షియన్ మమ్మీల మమ్మీఫికేషన్కి సంబంధించిన రహస్యాలను మరింత చేధించేందుకు మార్గం సుగమం చేసింది. So happy to share our new paper out today in @SciReports "Biomolecular characterization of 3500-year-old ancient Egyptian mummification balms from the Valley of the Kings"https://t.co/0Uk46qvJZe — Barbara Huber (@Bara_Huber) August 31, 2023 (చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...) -
డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్, ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్ మాజీ యజమాని హమ్మద్ అల్ ఫయెద్ (94) ఇక లేరు. ప్రిన్సెస్ డయానాతో కారు ప్రమాదంలో మరణించిన డోడి అల్ ఫయెద్ పెద్ద కుమారుడు. హారోడ్స్ మాజీ ఓనర్అ యిన ఫయెద్ మరణాన్ని ఆయన కటుంబ సభ్యులు ధృవీకరించారు. తనయుడి మరణంతో కుంగిపోయిన ఆయన చివరకు కొడుకు దగ్గరికే చేరాడని, కొడుకు సమాధి దగ్గరే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించామని ఉకుటుంబ సభ్యులు ప్రకటించారు.అటు బ్రిటన్‌లోని ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఒక ప్రకటనలో ధృవీకరించింది. సామాన్య జీవితం నుంచి బిజినెస్ టైకూన్‌గా ఎదిగినా అతని మరణంపై పలువురి సంతాపం ప్రకటించారు. అతని మరణంతో ఒక శకం ముగిసిందనీ, బ్రిటీష్ఫుట్బాల్, వ్యాపారం, దాతృత్వం కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఆయనకు నివాళులు అర్పించారు. 1929 జనవరిలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జన్మించాడు. వీధుల్లో ఫిజీ డ్రింక్స్ అమ్మకాలతో మొదలైన అల్-ఫయేద్ కరియర్ కుట్టు యంత్రాల విక్రయదారుడిగాను, ఆ తరువాత రియల్ ఎస్టేట్, షిప్పింగ్ తదితర వ్యాపారాల్లో మధ్య ప్రాచ్యం, ఐరోపాలలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా అవతరించాడు.1954లో సౌదీ అరేబియా వ్యాపారవేత్త , అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి సోదరి సమీరా ఖషోగ్గిని వివాహం చేసుకున్నాడు. 1960ల మధ్యలో బ్రూనై సుల్తాన్‌కు సలహాదారు అయ్యాడు 1958లో ఇటలీలోని జెనోవాకు , ఆ తరువాత 1970లలో యూకేకువెళ్లాడు. కానీ బ్రిటీష్ పౌరసత్వం పొందాలనే అల్ ఫయెద్ దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరలేదు. పారిస్‌లోని రిట్జ్ హోటల్, లండన్‌లోని హారోడ్స్ డిపార్ట్మెంట్ స్టోర్‌తో సహా తన కెరీర్లో అనేక ప్రతిష్టాత్మక హోల్డింగ్లను సంపాదించి ఈజిప్షియన్ వ్యాపారవేత్తగా రాణించాడు. 1972లో అతను దుబాయ్‌లో మెరైన్ రిపేర్ యార్డ్ ఇంటర్నేషనల్ మెరైన్ సర్వీసెస్‌ని, స్వంత షిప్పింగ్ కంపెనీ అయిన జెనీవాకోను స్థాపించాడు. గొప్ప పరోపకారి కూడా. ముఖ్యంగా పేద , అనారోగ్యంతో ఉన్న పిల్లలపై ఎక్కువగా కృషి చేశాడు.అలాగే 1987లో, వెనుకబడిన యువకుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో అల్ ఫయెద్ ఛారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. క్యాష్ ఫర్ క్వశ్చన్స్ స్కాం 1994లో బ్రిటిష్ రాజకీయాలను కుదిపేసిన "క్యాష్ ఫర్ క్వశ్చన్స్" కుంభకోణంలో అల్ ఫయెద్ కూడా కీలక పాత్రధారి. అలాగే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రశ్నలు అడిగినందుకు ప్రతిఫలంగాటోరీ ఎంపీలు నీల్ హామిల్టన్, టిమ్ స్మిత్‌లకు పెద్దమొత్తంలో డబ్బులు పారిస్‌లోని రిట్జ్‌లో విలాసవంతమైన బస కల్పించానని చెప్పి పెద్ద దుమారాన్ని లేపాడు. మిస్టర్ స్మిత్ క్షమాపణ చెప్పిన తర్వాత 1997లో పదవీ విరమణ చేశాడు. నీల్ హామిల్టన్ అల్ ఫాయెద్పై పరువు నష్టం దావా వేసి భంగపడ్డాడు. పారిస్ విషాదం 1997, ఆగస్టు 31లో అతని పెద్ద కుమారుడు, డోడి యువరాణి డయానాల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన కారు ప్రమాదం తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది ప్రమాదమా, లేక కుట్రతో హత్య చేశారా? అనే చర్చ పెద్ద దుమారమే రేగింది. డయానా, డోడి కలిసి ఉండటం ఇష్టం లేని వ్యక్తులు ఇద్దరినీ హత్య చేశారని ఫయెద్ అరోపించాడు. దీనిపై న్యాయ పోరాటానికి వేల డాలర్లు ఖర్చుపెట్టాడు. 2008లో ఈ వాదనను అక్కడి కోర్టు తోసి పుచ్చింది. ఈ తీర్పు పక్షపాతమని వాదించిన ఫయెద్ తాను చేయాల్సింది చేశాననీ, మిగతా ఆ దేవుడికే వదిలివేస్తున్నానని వ్యాఖ్యానించాడు. కంపెనీ రుణాలను తీర్చడానికి 2010లో, అల్ ఫయెద్ హారోడ్స్ను ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్‌కి 2 బిలియన్ డాలర్లు విక్రయించి, పదవీ విరమణను ప్రకటించాడు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, నవంబర్ 2022లో ఫాయెద్ విలువ 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అల్ ఫయెద్ కుమారుడు డోడి ,వేల్స్ యువరాణి డయానా 1997లో కారు ప్రమాదంలో మరణించడంతో ఆయన జీవితంలో పెద్ద విషాదాన్ని నింపింది. వీరి ఆకస్మిక మరణం రాజకుటుంబం ఉందని ఆరోపించాడు. దీనికోసం పెద్ద న్యాయ పోరాటమే చేశాడు. అలాగే డయనా, డోడీకి హారోడ్స్‌లో 998లో రెండు స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశాడు. డయానా , డోడీల ఫోటోలతో పిరమిడ్-ఆకారంలో ఒక కట్టడాన్ని నిర్మించాడు. ఇందులోవారి ఆఖరి డిన్నర్లోని వైన్ గ్లాస్, యువరాణి కోసం తన కొడుకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్న ఉంగరంతో దీన్ని ఏర్పాడు ఏశాడు. అంతేకాదు హారోడ్స్ పైకప్పుపై ఉన్న గాజు సమాధిలో తన మృతదేహాన్ని ప్రదర్శనకు ఉంచాలని కోరుకున్నాడు. -
టూరిస్టును సొర మింగేసింది.. కన్న తండ్రి కళ్లముందే.. క్షణాల్లోనే..
ఈజిప్టు: ఈజిప్టులోని హుర్ఘదా రీసార్ట్ సమీపంలో ఓ భయానక ఘటన జరిగింది. ఎర్రసముద్రం ఒడ్డున ఈతకొడుతున్న రష్యా పర్యాటకున్ని షార్క్ చేప మింగేసింది. దీంతో స్థానిక పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వ్లాదిమిర్ పొపోవ్(23) తన కుటుంబంతో సహా విహారానికి హుర్ఘదాలో బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో వ్లాదిమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సముద్ర ఒడ్డున ఈత కొడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఓ సొరచేప ప్రత్యక్షమయింది. భయంతో వారు వేగంగా ఈదినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వ్లాదిమిర్‌ను సొర మింగేసింది. అయితే.. అతని గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తప్పించుకోగలిగింది. రెస్క్యూ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అంతా అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు. Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort 23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X — Nabila Jamal (@nabilajamal_) June 9, 2023 బాధితుడు సొర నుంచి తప్పించుకునే క్రమంలో రక్షించమని తన తండ్రి కోసం ఆర్తనాదాలు చేశాడు. ఒడ్డున ఉన్న అతని తండ్రి చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో బాధితుని తండ్రి విలపించారు. రక్షించమని స్థానికులను వేడుకున్నారు. కానీ నిమిషాల్లోనే అతని కుమారున్ని సొర మింగేసింది. దీంతో అంతా షాక్‌కు గురయ్యామని స్థానిక పర్యాటకులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదీ చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
అప్పటికే ఇద్దరు భార్యలు, అయినా హీరోయిన్‌కు సింగర్ పెళ్లి ప్రపోజల్
Urvashi Rautela Says Egyptian Singer With 2 Wives Proposed Her: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల 'ది లెజెండ్' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించినందుకు ఊర్వశీ ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో 'బ్లాక్ రోజ్' సినిమాలో నటించిన ఈ గ్లామర్ క్వీన్ తాజాగా తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా 'మీకు ఎప్పుడైన ఇబ్బందికర మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందా?' అని అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యే సమాధానం ఇచ్చింది ఊర్వశీ. 'నాకు చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. అందులో మీరు చెప్పినటువంటి ప్రతిపాదన ఒకటి ఉంది. దుబాయ్‌లో ఈజిప్ట్‌కు చెందిన స్టార్ సింగర్ ఒకరిని కలిశాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అయితే అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది మన సాంస్కృతికి, సాంప్రదాయానికి విరుద్ధం. మనం మన కుటుంబం గురించి ఆలోచించగలగాలి. అలాగే ఒక మహిళ తన జీవితం గురించిన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు' అని తెలిపింది. చదవండి: ఆ హీరోయిన్‌కు రూ. 20 కోట్ల పారితోషికం !.. నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు.. మీడియాతో తాప్సీ వాగ్వాదం అయితే ఈజిప్టు సింగర్ పేరును ఊర్వశీ రౌటేలా చెప్పలేదు. కానీ ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో 'అతని పేరు మహ్మద్ రమదాన్' అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఎందుకంటే 2021లో విడుదలైన 'వెర్సాస్ బేబీ' అనే మ్యూజిక్ వీడియోలో ఈజిప్షియన్ యాక్టర్, సింగర్ మహ్మద్ రమదాన్‌తో కలిసి ఊర్వశీ నటించింది. ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం ఈ మ్యూజిక్ వీడియోలో ఊర్వశీ అత్యంత ఖరీదైన దుస్తులు వేసుకుందని సమాచారం. ఆమె దుస్తులకు రూ. 15 కోట్లు ఖర్చు అయ్యాని టాక్. చదవండి: చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
‘ఈజిప్ట్ వ్యక్తితో కంగనా ప్రేమయాణం!’
బాలీవుడ్ సినీ క్రిటిక్ కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఖాన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఈజిప్ట్‌కు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉందంటూ ట్వీట్ చేశాడు. దీంతో తరచూ వివాదాలతో వార్తల్లోకి నిలిచే కంగనా ఈ సారి ప్రేమ వ్యహరంతో వార్తల్లోకిక్కెంది. కంగనా ఈజిప్టుకు చెందిన ఓ ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడిందంటూ అతడితో కంగనా దిగిన ఫొటోలను షేర్ చేశాడు. అంతలోనే ఈ ట్వీట్‌ను డిలీట్ చేయడం గమనార్హం. దీంతో కేఆర్కే ఖాన్ కంగనాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కమల్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ కంగనా లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ ఓ ట్వీట్ చేశాడు. ‘నా క్లయింట్ చిత్రాలను దురుసుగా .. దుర్మార్గంగా ఉపయోగించి ప్రతి ఒక్కరూ వదంతులు అసత్యాలను వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే కేఆర్కే ఈ మధ్య పలువురు బాలీవుడ్ స్టార్స్‌పై తప్పుడు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమిర్, కిరణ్ రావుల విడాకుల విషయంపై స్పందిస్తూ కిరణ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చొప్రా 10 ఏళ్లలో తన భర్త నిక్‌జోనస్‌తో విడాకులు తీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. -
ఈజిప్టు ఉల్లి..రావే తల్లీ..!
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు పెరిగినా ధర మాత్రం ఇంకా ఆకాశంలోనే ఉంది. వస్తున్న ఉల్లిగడ్డ డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవడంతో ధరలు దిగి రావడం లేదు. నిన్నమొన్నటితో పోలిస్తే మాత్రం కాస్త ఊరటినిచ్చేలా రూ.20 మేర ధరలు తగ్గడం కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తోంది. శనివారం సైతం మలక్‌పేట మార్కెట్లో క్వింటాలు ఉల్లి ఏకంగా రూ.16,000 పలకగా, మహారాష్ట్ర ఉల్లి రూ.14,000 పలికింది. అంటే హోల్‌సేల్ మార్కెట్లో ధర రూ.160 వరకు ఉండగా, బహిరంగ మార్కెట్లో అది రూ.170–180 మధ్య ఉంది. ఈ ఇబ్బంది ఈజిప్టు నుంచి వచ్చే ఉల్లి దిగుమతులు తీరుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు ధర బాగా తగ్గే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. 2 వేల క్వింటాళ్లు అధికంగా మార్కెట్లోకి.. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్ నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఉల్లి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు రోజుల కిందట కిలో ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో రూ.170కి చేరగా, రెండు రోజుల క్రితం అది రూ.200 దాటింది. గురువారం సైతం మలక్‌పేట మార్కెట్లో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చిన ఉల్లి వ్యాపారులు క్వింటాల్ రూ.18 వేలకు అమ్మారు. అంటే మార్కెట్ యార్డుల్లోనే కిలో ఉల్లి రూ.180 ఉండగా, అది బహిరంగ మార్కెట్లకు వచ్చేసరికి రూ.200లు పలికింది. శుక్రవారం 2,500 క్వింటాళ్ల నుంచి 3వేల క్వింటాళ్ల మేర మాత్రమే ఉల్లి రాగా, శనివారం 5,514 క్వింటాళ్ల ఉల్లిగడ్డ వచ్చింది. దీంతో శనివారం మార్కెట్లో కర్ణాటక నుంచి వచ్చిన పెద్దసైజు ఉల్లి క్వింటాల్ రూ.16 వేలు పలకగా, మహారాష్ట్ర ఉల్లి రూ.14 వేలు పలికింది. మీడియం రకం కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చింది రూ.15 వేలు పలకగా, మహారాష్ట్ర ఉల్లిగడ్డ రూ.16 వేలు పలికింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి మరో రూ.20 అదనంగా పెరిగి రూ.170–180 మధ్య ఉన్నాయి. సోమవారం నుంచి రాష్ట్రానికి మహారాష్ట్ర, రాజస్తాన్ నుంచి ఉల్లి దిగుమతి 7 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల మేర ఉండే అవకాశం ఉంటుందని మలక్‌పేట మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలా అయితే ధర కిలో రూ.100 దిగొచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు శనివారం కర్నూల్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు దిగొచ్చాయి. మొన్నటి వరకు కర్నూలులో క్వింటాల్ ఉల్లి ధర రూ.14 వేలు పలకగా, అది శనివారం రూ.8 వేలకు తగ్గింది. పొరుగు రాష్ట్రంలో ధరలు దిగిరావడం సైతం రాష్ట్రానికి అనుకూలించనుంది. 15న రానున్న ఈజిప్టు ఉల్లి.. ఇక ఈజిప్టు నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిలో తెలంగాణ 500 మెట్రిక్ టన్నులు ఇదివరకే కోరింది. ఈ ఉల్లి ఈ నెల 15న ముంబై పోర్టు ద్వారా రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. వారానికి 100 మెట్రిక్ టన్నుల వంతున ఐదు వారాల పాటు ఈ ఉల్లిని మార్కెట్లోకి వదలనున్నారు. దీన్ని రాష్ట్రంలోని 40 రైతుబజార్ల ద్వారా కిలో రూ.40కే అమ్మనున్నారు. దీనిద్వారా ధరలు దిగొస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనా వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వ్యాపారులతో మాట్లాడి సరూర్‌నగర్, మెహిదీపట్నం మార్కెట్లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయిస్తోంది. దీనిద్వారా సామాన్యుడికి ఉపశమనం కలుగుతోందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
మహిళతో టిఫిన్ చేశారని అరెస్ట్ చేశారు!
రియాద్(సౌదీ అరేబియా) : మహిళతో కలిసి అల్పహారం చేస్తూ వీడియో తీసుకున్నందుకు ఓ ఈజిప్టియన్ కటకటాలపాలయ్యాడు. సహుద్యోగిని అయిన సదరు మహిళతో ఆ వ్యక్తి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సౌదీ అరేబియా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అది అభ్యంతకరమైన వీడియో అని అధికారులు ఆ ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతను పనిచేసే హోటల్‌కు సమన్లు కూడా పంపారు. ఈ వీడియోలో ఇస్లామిక్ నికాబ్తో ఉన్న సదరు మహిళ ఆ వ్యక్తిని తాకుతూ చేయిపట్టుకుని వీడియో తీయసాగింది. ఇది సౌదీ సంప్రదాయలకు విరుద్దం కావడంతో ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సౌదీ ఆచారా సంప్రదాయాలు పాటించాలని దేశప్రజలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ విజ్ఞప్తి చేసింది. -
గుండెపోటుతో కామెంటేటర్ మృతి
మాస్కో: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను అభిమానులు ఆసక్తితో తిలకిస్తున్నారు. తమకిష్టమైన టీమ్ ఆటలో గెలిస్తే ఆనందంతో ఎగిరి గంతులేసే వీరాభిమానులు ఉన్నారు. ఒకవేళ ఓడితే ప్రాణాలు తీసుకునే పిచ్చి అభిమానులున్నారు. గతవారం అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వీరాభిమాని సూసైడ్ చేసుకున్నాడు. తాజాగా ఓ కామెంటేటర్ తమ టీమ్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో తమ దేశం ఓటమిపాలు కావడంతో ఈజిప్టు వ్యాఖ్యాత అబ్దుల్ రహీమ్ మహ్మద్ గుండెపోటుతో మరణించినట్టు తెలిపింది. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగుస్తుంది అనుకున్న సమయంలో సౌదీ అరేబియా డిఫెండర్ సలేం అల్ దాస్రి అదనపు సమయంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. అయితే ఆ సమమంలోనే ఆయనకు చాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు గుర్తించారు. అబ్దుల్ మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు తెలిపారు. మ్యాచ్ మొదట్లోనే ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్‌తో ఆధిక్యంలో దూసుకెళ్లినా, సెకండాఫ్‌లో పుంజుకున్న సౌదీ అరేబియా అనూహ్యంగా మ్యాచ్ గెలిచింది. وفاة نجم نادي #الزمالك الكابتن عبدالرحيم محمد اليوم في الاستديو التحليلي لمباراة #السعودية_مصر على قناة النيل نتيجة انفعاله من الخسارة تسببت له بجلطة و انتقل للمستشفي وفشلت محاولات الاسعاف. لا إله إلا الله و إنا لله وإنا إليه راجعون الدعاء له بالثبات عند السؤال pic.twitter.com/OnSTxeutMV — احمد صالح🇪🇬Ahmd Saleh (@iAHMEDsalih) June 25, 2018 -
బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టు అద్భుతాలు!
ఫ్రెంచ్ పురాతత్వవేత్త గాడియో అద్భుత ఆవిష్కారాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శనకు సిద్ధమయ్యాయి. ప్రాచీన ఈజిప్టు నగరాల ఆనవాళ్ళు త్వరలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. సముద్రంలో మునిగిపోయి, ఎవ్వరికీ కనిపించకుండా పోయిన గొప్ప ఈజిప్టు నగరాలు ఎన్నో వేల సంవత్సరాలపాటు రహస్య నగరాలుగానే మిగిలిపోయాయి. కనిపించకుండా పోయిన ఆ నగరాలను పురాతత్వవేత్త ఫ్రాంక్ గాడియో కొన్నేళ్ళ క్రితం సముద్రానికి అడుగు భాగంలో కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ నగరాలకు సంబంధించిన అనేక అద్భుతాలను ఇప్పుడు సందర్శకులకు అందుబాటులో బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన థోనిస్ హెరాస్టెయిన్ నగరంలోని అద్భుత దేవాలయాలు, ప్రాచీన శిలాకృతులు గాడియో కనిపెట్టే వరకూ ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా నీటి అడుగున నిక్షిస్తమైపోయాయి. చేపలకు ఆవాసాలుగా మారిపోయాయి. ఆ నగరాలనుంచి సేకరించిన దేవతా విగ్రహాలు, శిల్ప సంపద ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం కానున్నాయి. సంవత్సరాలకొద్దీ కాలం ఈ ప్రాచీన చిహ్నాలను గుర్తించేందుకు గాడియో ఎంతో శ్రమించాడు. దీనికి తోడు కానోపస్ ను కూడ అంగుళం లోతు ఇసుకలో కూరుకుపోయి నీటి అడుగు భాగంలో ఉన్నట్లుగా 1933లో బ్రిటిష్ ఆర్ ఏ ఎఫ్ పైలట్ కనుగొన్నాడు. ప్రస్తుతం ఆ ఈజిప్టు అద్భుత శిలా సంపదను మే 19న ప్రదర్శనకు అందుబాటులోకి తేనున్నట్లు మ్యూజియం క్యూరేటర్ మాసెన్ బెర్గోఫ్ తెలిపారు. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు, గ్రంథాలు, పురాణాలు వంటి ఎన్నో విశేషాలను ఇప్పుడు మ్యూజియంను సందర్శించిన వారు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. -
మతాచారంపై వ్యాఖ్యలు.. రచయితకు జైలు
కైరో: ఇస్లాం మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో దోషీగా తేలిన ఫాతిమా నవోత్ అనే సెక్యులర్ రచయితకు ఈజిప్ట్‌లోని ఓ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, లక్షా 73 వేల రూపాయల జరిమానా విధించింది. శిక్షను వెంటనే అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించినట్టు ఓ ఈజిప్ట్ పత్రిక వెల్లడించింది. ఈజిప్ట్‌లో గత నెల రోజుల్లో మతాన్ని కించపరిచినందుకు జైలు శిక్ష ఎదుర్కొన్న రెండో ప్రముఖ వ్యక్తి ఫాతిమా. ఆమె ఈజిప్ట్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు. కాగా ఫాతిమా జైల్లో శిక్షను అనుభవిస్తూనే పైకోర్టులో సవాల్ చేసుకునే అవకాశముంది. గత అక్టోబర్‌లో ఫాతిమా తన ఫేస్బుక్ పేజీలో ఇస్లాం మతాచారాలను విమర్శిస్తూ పోస్ట్ చేసింది. ఈద్ పర్వదినం సందర్భంగా గొర్రెలను చంపడాన్ని ఆమె తప్పుపట్టారు. 'మానవ జాతి చేస్తున్న అతి కిరాతక వధ' అని ఫాతిమా అభివర్ణించారు. ఇదే అంశంపై ఫాతిమా ఓ పత్రికలో వ్యాసం రాశారు. ఈ ఆచారాన్ని తప్పుపడుతూ ఫేస్బుక్లో తాను కామెంట్ చేసిన మాట వాస్తమేనని, అయితే ఇస్లాం మతాన్ని కించపరచాలన్నది తన లక్ష్యం కాదని ఫాతిమా చెప్పారు. ఈజిప్ట్‌లో ఇలాంటి కేసులోనే ఇస్లాం బెహరీ అనే టీవీ వ్యాఖ్యాతకు గత డిసెంబర్లో జైలు శిక్ష పడింది. -
అంతుచిక్కని అందగత్తె కథ
* ఆమె ఓ అందాల రాణి. * ఈజిప్టు తలరాతనే మార్చింది. * మరి ఎందుకు అదృశ్యమైంది? డిసెంబర్ 6, 1913... ఈజిప్ట్... అమర్నా ప్రాంతంలోని ఎడారి అంతా సందడి సందడిగా ఉంది. ఆర్కియాల జిస్టుల బృదం పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి నేలను తవ్వుతోంది. అందరూ కలిసి దేని దేని కోసమో తీవ్రంగా అన్వేషిస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఓ కేక వినిపించింది... ‘‘సర్... ఓసారి ఇలా రండి’’ అంటూ. మరో చోట దేనినో పరిశీలిస్తోన్న జర్మన్ ఆర్కియాలజిస్టు లుడ్విగ్ బోర్షార్ట గబగబా అటువైపు నడిచాడు. అక్కడున్న తన అసిస్టెంట్ చేతిలో ఉన్నదాన్ని చూసి ఆశ్చర్యపోయాడతను. లైమ్‌స్టోన్‌తో చేసిన మహిళ శిల్పం అది. శిల్పమే అయినా అందులో జీవకళ ఉట్టి పడుతోంది. తల నుంచి ఛాతి వరకు మాత్రమే ఉందా శిల్పం. దాన్ని చూస్తుంటే... ఆమె చాలా అందగత్తె అయి ఉంటుందని అనిపిస్తోంది. ‘‘వండర్ఫుల్. ఈమె ఎవరో రాణి అనిపిస్తోంది. అంటే మనం అనుకుంటు న్నట్టు ఈ నేల కింద ఏదో సామ్రాజ్యం ఉండే ఉంటుంది’’ అన్నాడు లుడ్విగ్ హుషారుగా. వెంటనే అతడు ఆ విగ్రహం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఆ ప్రయత్నం చివరికి ఓ పెద్ద చరిత్రనే వెలికి తీస్తుందని అతనికప్పుడు తెలియదు. తనకు దొరికిన శిల్పం ఓ రాణిదని, ఆమె ఒకప్పుడు ఈజిప్టును తన కనుసన్నల్లో నడిపిందని, ఆమె ఈజిప్టు చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ అని అంత కన్నా తెలియదు. ఇంతకీ ఎవరామె? ఈజిప్టులోని థీబ్స్... పద్నాలుగో శతాబ్దం... రాజప్రాసాదం ముందు జనం నిలబడి ఉన్నారు. రాజుగారు తమతో ఏదో చెప్పాలనుకుంటున్నారన్న కబురు అంది వాళ్లంతా వచ్చారు. ఆయనేం చెప్పబోతున్నారోనని ఆతృతగా ఎదురు చూస్తూ నిలబడ్డారు. కొన్ని నిమిషాల తర్వాత ఫరో అకనాటన్ బయటకు వచ్చాడు. అందరూ ఆయనకు నమస్కరించారు. అభివాదం ఆయనకు చేశారే కానీ, ఆయన పక్కన ఉన్న రాణి మీదే ఉన్నాయి అందరి కళ్లూ. అతిలోక సౌందర్యరాశి దిగి వచ్చిందా అన్నట్టు ఉంది... అకనాటన్ భార్య నెఫర్‌తితీ. కలువ రేకులను పక్కపక్కనే అమర్చినట్టుగా ఉన్న కళ్లు, చక్కగా చెక్కినట్టుగా ఉన్న నాసిక, లేత గులాబీ రంగులో మెరిసిపోతోన్న పెదవులు, బంగారు మేనిఛాయ... పోత పోసిన అందం ఆమె! వెండి తీగెలతో ఎంబ్రాయిడరీ చేసిన దుస్తుల్లో దేవకన్యలాగా కనిపిస్తోంది. ఫరో పక్కన ఆమె నిలబడిన తీరు ఎంతో హుందాగా ఉంది. ‘‘ఫరో మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నారు. దాని కోసమే మిమ్మల్నందరినీ ఇక్కడికి పిలిపించారు.’’ రాణి నెఫర్‌తితీ గంభీరమైన స్వరంతో మాట్లాడుతుంటే అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. ‘‘ఇప్పటి వరకూ థీబ్స్నే రాజగనరిగా భావిస్తున్నాం. అయితే ఇప్పుడీ రాజనగరిని ఇక్కడి నుంచి తరలించాలని, నైలు నైదికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నా ప్రాంతంలో సరికొత్తగా నిర్మించాలని అనుకుంటున్నాం. ఈ విషయం తెలియజేయడానికే మిమ్మల్ని పిలిపించాం.’’ అందరూ ముఖాలు చూసుకున్నారు. ఇంత అర్జంటుగా రాజనగరిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. కొందరు మౌనంగా తలాడించారు. కొందరు మాత్రం ముఖాలు మాడ్చుకున్నారు. ఈ రాణి ఎప్పుడూ ఇంతే... ఎప్పుడూ ఏవో కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటుంది, ఎంతసేపూ తమ సుఖం, సౌఖ్యం చూసుకుంటుంది, ఇంకెంత విలాసంగా బతుకుదామా అని ఆలోచిస్తుంది అని మనసుల్లోనే గొణుక్కుంటూ అక్కడ్నుంచి కదిలారు. ఒక్కసారి ఏదైనా అనుకున్నదంటే ఆగదు నెఫర్‌తితీ. అందుకే రాజనగరిని కొద్ది రోజుల్లోనే అక్కడ్నుంచి మార్చేసింది. కొత్త ప్రదేశంలో, కొత్త కొత్త హంగులతో, కొన్ని ఎకరాల స్థలంలో నిర్మింపజేసింది. ఆ నిర్మాణ శైలికి, వైభవానికి ప్రజల కళ్లు చెదిరిపోయాయి. ఇతర దేశాల రాజులు, స్నేహితులు, బంధువులందరినీ పిలిచి విందు చేసింది నెఫర్‌తితీ. వచ్చినవాళ్లంతా ఆమె ప్లానింగ్‌ని పొగిడారు. ఏం చేసినా అద్భుతంగా చేస్తావని ప్రశంసలతో ముంచెతారు. నెఫర్‌తితీ కన్నా ఆమె భర్త అకనాటన్ ఎక్కువ మురిసిపోయాడు. ఆమె తన భార్యగా దొరకడమే తన అదృష్టం అనుకున్నాడు. అనుకుని ఊరుకోలేదు... ఆ విషయాన్ని అందరి ముందూ సగర్వంగా వెల్లడించాడు కూడా. అతనెప్పుడూ అంతే. నెఫర్‌తితీ అంటే అతడికి ప్రాణం. ఆమె మాటంటే వేదం. ఆమె ఏం చేయమన్నా చేస్తాడు. నడవ మన్నట్టే నడుస్తాడు. నెఫర్‌తితీ అన్న పేరుకు ‘అందగత్తె వచ్చింది’ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టు గానే అద్భుతమైన అందం నెఫర్తితీది. ఆమెని చూసిన ఏ ఒక్కరూ చూపు తిప్పుకో లేకపోయేవారు. ఇతర దేశాల రాజులు సైతం ఆమె మీద మోహపడేవారు. అంత అందాన్ని సొంతం చేసుకున్న అకనాటన్ని చూసి అసూయ పడేవారు. అవన్నీ చాలా గర్వంగా అనిపించేవి అకనాటన్కి. తనెంతో అదృష్టవంతుడినని పొంగి పోతుండేవాడు. ఆమె అడుగలకు మడుగు లొత్తేవాడు. పేరుకి అతడు రాజు అయినా, పాలన సాగించేది మాత్రం నెఫర్తితీయే. ఆలోచనలన్నీ ఆమెవే. వాటిని అతడు తు.చ. తప్పకుండా పాటిస్తాడంతే. అంతగా అకనాటన్ జీవితంలో, ఈజిప్టు పాలనలో ప్రధాన పాత్ర పోషించింది నెఫర్‌తితీ. అలాంటి ఆమె... ఒకరోజు ఉన్నట్టుండి మాయమైపోయింది. భర్తతో పాటు ఎవ్వరికీ కనిపించకుండా పోయింది. ఎంతకీ అర్థం కాని ఓ మిస్టరీగా చరిత్రలో మిగిలిపోయింది. అసలామె ఏమైంది? అకనాటన్ ఈజిప్టును పదిహేడేళ్ల పాటు పాలించాడు. అయితే పన్నెండో యేడు నడుస్తున్నప్పుడే నెఫర్‌తితీ అదృశ్యమైంది. ఆమె కోసం ఎంతో వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఆమె ఏమయ్యింది అన్న ప్రశ్నకు అకనాటన్ కూడా సమాధానం చెప్పలేకపోయాడు. తనను ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎక్కడైనా దాచిపెట్టారా లేక చంపేశారా... ప్రశ్నలు బోలెడు పుట్టాయి. సమాధానం ఒక్కటి కూడా దొరకలేదు. దాంతో అకనాటన్తో పాటు మెల్లమెల్లగా జనం నెఫర్తితీని మర్చిపోయారు. అకనాటన్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ప్రజలంతా ఆమెనే రాణిగా అంగీకరించారు. కాలం మారింది. రాజరికం అంతమయ్యింది. ఈజిప్టు రాజుల గాథలు చరిత్ర పుటల్లోకి చేరాయి. అయితే ఏ ఒక్క పుటలోనూ నెఫర్‌తితీ గురించి లేకపోవడం అన్నిటికంటే పెద్ద మిస్టరీ. 1913లో ఆర్కియాలజిస్టు లుడ్విగ్ బృందానికి నెఫర్‌తితీ శిల్పం దొరికి నప్పుడు అది ఎవరిదో కూడా అర్థం కాలేదు. ఆ శిల్పం ఎవరిదో తెలుసుకోవా లని పరిశోధనలు మొదలయ్యాయి. మరో ప్రముఖ ఆర్కియాలజిస్టు ఫ్లెచర్ ద్వారా అసలు నిజం బయటకు వచ్చింది. ఈజిప్టు రాజుల చరిత్రపై నిశితమైన పరిశోధన చేసింది ఫ్లెచర్. ఆమె నెఫర్‌తితీ శిల్పాన్ని పూర్తిగా పరిశీలించింది. దాన్ని చూస్తూనే అది ఒక రాణి శిల్పం అని చెప్పేసింది ఫ్లెచర్. తలపై ఉన్న కిరీటం, హెయిర్ స్టయిల్, కంఠాభరణాల డిజైన్ వంటి వాటిని బట్టి కచ్చితంగా ఎవరో రాణియే అని నిర్ధారించింది. నాటి నుంచీ ఆ రాణి ఎవరో కనిపెట్టేందుకే కృషి చేసింది. ఎంతో కష్టపడితే అప్పుడు ఆమెకు నెఫర్‌తితీ గురించి తెలిసింది. తర్వాత కొన్నాళ్లకి ఈజిప్టులో పరిశోధనలు జరుపుతున్నప్పుడు ఓ సమాధిలో మూడు మమ్మీలు కనిపిం చాయి ఫ్లెచర్కి. వాటిలో ఒకటి ఓ యువ కుని మమ్మీ, రెండోది ఓ చిన్నపిల్ల మమ్మీ, మూడోది ఓ మధ్య వయస్కురాలి మమ్మీ. ఆ మూడో మమ్మీ నెఫర్తితీదే అనిపిం చింది ఫ్లెచర్కి. అయితే ఆ మమ్మీ పరిస్థితి ఘోరంగా ఉంది. తలపై జుత్తు లేదు. ఒంటిలో కత్తిపోట్లు ఉన్నాయి. ముఖాన్ని పచ్చడి చేసేశారు. పళ్లు విరగ్గొట్టేశారు. అంటే ఆమెను ఎవరో అత్యంత దారుణంగా చంపారని అర్థమయ్యింది. దాంతో నెఫర్‌తితీ పట్ల ఏం జరిగివుంటుందో అర్థమైంది. ఈజిప్టు చరిత్రలో నెఫర్‌తితీ అంత అందగత్తెయే కాదు, అంత శక్తిమంతమైన మహిళ మరొకరు లేరు. తను చెప్పిందే వేదంగా, చేసిందే చట్టంగా అందరూ భావించేట్టుగా చేసిందామె. భర్త చాటున ఉంటూనే పాలన తన మాట చొప్పున జరిగేలా చేసింది. రాజనగరిని తనకు నచ్చిన చోటికి మార్పించింది. తనకు నచ్చినట్టుగా నిర్మించింది. అంతవరకూ ఈజిప్టులో ఉన్న దేవుళ్లందరినీ కాదని ఓ కొత్త దేవుడిని సృష్టించింది. అందరూ ఆ దేవుడికే మొక్కాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రతి విషయంలోనూ ఆమె అన్నదే జరిగేది. అదే ఆమెను ఎంతో మందికి శత్రువుల్ని చేసిందంటారు ఫ్లెచర్. ఈజిప్టు పాలనలో ఓ మహిళ ఇంతగా ఎప్పుడూ కల్పించుకున్నది లేదు. ఇంతగా ఆధిపత్యం చెలాయించిందీ లేదు. దాంతో నెఫర్‌తితీ ప్రవర్తన కొందరికి మింగుడు పడలేదు. ఆమె పద్ధతి చాలామందికి నచ్చలేదు. దాంతో తనపై పగబట్టారు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆమెను చంపేసి రహస్యంగా సమాధి చేశారు. ఆమెను ఎవరూ గుర్తు పట్టకూడదని ముఖాన్ని ఛిద్రం చేశారు. పళ్లు విరగ్గొట్టారు. ఆమె పేరు ఎక్కడా కనిపించకుండా చేశారు. ఆమె చిత్రాల్ని, విగ్రహాల్ని తీసి పారేశారు. మొత్తంగా ఆమెను ఈజిప్టు చరిత్ర నుంచి తుడిచిపెట్టేశారు. కానీ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అందుకే నెఫర్‌తితీ పేరు తుడిచి పెట్టుకుపోలేదు. ఆమె శిల్పం దొరికిన తర్వాత, ఆమె గురించి పరిశోధనలు మొదలయ్యాయి. ఆ మమ్మీ నెఫర్తితీదేనా, ఫ్లెచర్ చెప్పినట్టే నెఫర్‌తితీ హత్యకు గురయ్యిందా అన్నది చెప్పడం నేటికీ కష్టంగానే ఉంది. దాన్ని నిర్ధారించ డానికే ఫ్లెచర్ ఇంకా కష్టపడుతోంది. మరి నిజం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో! -
శతాబ్దాల క్రితమే కార్మిక సంక్షేమం!
చరిత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం రకరకాల పథకాలు ప్రకటిస్తుంటాయి. అలాంటి జాతీయ ఆరోగ్య సేవలను 20 వ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణలుగా కూడా చెబుతుంటారు. అయితే 3,600 ఏళ్ల క్రితమే... ఇప్పటి ‘సంక్షేమ విధానాలు’, ‘హెల్త్ కేర్’ సిస్టమ్ ఈజిప్ట్‌లో అమల్లో ఉండేవని తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఒక శిలపై కనిపించిన రాతలలో వెల్లడయ్యాయి. స్టాన్ఫోర్డ్ అర్కియాలజిస్ట్ యాన్ ఆస్టిన్ నేతృత్వంలో కార్మికులు నివాసముండే ప్రాచీనమైన ఈజిప్షియన్ గ్రామం ఎల్- మెదీనాలో ఇటీవల తవ్వకాలు జరిగాయి. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజులు ఈ గ్రామాన్ని నిర్మించినట్లు ఆ పరిశోధనల్లో బయటపడింది. జీతభత్యాలే కాకుండా కార్మికుల నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్రోత్సాహలను నాటి ప్రభుత్వాలు ప్రకటించేవి. కార్మికులకు గృహవసతి ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, వాళ్ల ఇళ్లలో పని వాళ్లను కూడా ఏర్పాటు చేసేవి! ఇప్పటిలాగే అప్పుడూ కార్మికులకు సిక్ లీవ్‌లు కూడా ఉండేవి. కార్మికుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వైద్యుడు ఉండేవాడు. కార్మికుల క్షేమం గురించిన ఇలాంటి విషయాలు మాత్రమే కాక... ఆనాటి వైద్య విధానాలు ఎలా ఉండేవనేది కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. -
ఈజిప్టు అధ్యక్షునిగా అబ్దెల్ ఫత్తా
కై రో: ఈజిప్టు మాజీ సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్- సిసీ దేశాధ్యక్షునిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షపదవికి గతవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 96.6 శాతం ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 59 ఏళ్ల అబ్దెల్ ఫత్తా ఈజిప్టుకు ఏడవ అధ్యక్షుడు. సుప్రీంకోర్టు జనరల్ అసెంబ్లీ ఎదురుగా ఆయన పదవీస్వీకార ప్రమాణం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో తొలిసారి ఎన్నికైన మహమ్మద్ మోర్సీని ఆయన గత ఏడాది పదవీచ్యుతుడిని చేశారు. సైన్యంపై పట్టుకలిగిన రిటైర్డు ఫీల్డ్‌మార్షల్ అయిన ఫత్తా దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలను సరిదిద్దుతానని ఈ సందర్భంగా ప్రతిన బూనారు. నాలుగేళ్ల పాటు ఆయన అధ్యక్షునిగా కొనసాగుతారు. దేశం ఇంటాబయటా తలెత్తుకుని తిరిగేలా ముఖ్యమైన మార్పులుంటాయని ఆయన చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్‌ను, సుస్థిరమైన ప్రగతిని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోర్సీ ఉద్వాసనకు గురయ్యాక అప్పటివరకు సైన్యాధిపతిగా ఉన్న ఫత్తా తన పదవికి రాజీనామా చేశారు. గతనెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హందీన్ సబాహీతో పోటీపడ్డారు. అబ్దెల్ ఫత్తా ప్రమాణం సందర్భంగా కైరోలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.