గుండెపోటుతో కామెంటేటర్‌ మృతి | Egyptian football commentator dies of heart attack during team loss vs Saudis | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కామెంటేటర్‌ మృతి

Published Tue, Jun 26 2018 4:45 PM | Last Updated on Tue, Jun 26 2018 4:58 PM

Egyptian football commentator dies of heart attack during team loss vs Saudis - Sakshi

మాస్కో:  రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను అభిమానులు ఆసక్తితో తిలకిస్తున్నారు. తమకిష్టమైన టీమ్‌ ఆటలో గెలిస్తే ఆనందంతో ఎగిరి గంతులేసే వీరాభిమానులు ఉన్నారు. ఒకవేళ ఓడితే ప్రాణాలు తీసుకునే పిచ్చి అభిమానులున్నారు. గతవారం అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వీరాభిమాని సూసైడ్‌ చేసుకున్నాడు. తాజాగా ఓ కామెంటేటర్‌ తమ టీమ్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు.

స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో తమ దేశం ఓటమిపాలు కావడంతో ఈజిప్టు వ్యాఖ్యాత అబ్దుల్ రహీమ్ మహ్మద్‌ గుండెపోటుతో మరణించినట్టు తెలిపింది. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగుస్తుంది అనుకున్న సమయంలో సౌదీ అరేబియా డిఫెండర్‌ సలేం అల్‌ దాస్రి అదనపు సమయంలో అద్భుతమైన గోల్‌ చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు.

అయితే ఆ సమమంలోనే ఆయనకు చాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు గుర్తించారు. అబ్దుల్‌ మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు తెలిపారు. మ్యాచ్ మొదట్లోనే ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్‌తో ఆధిక్యంలో దూసుకెళ్లినా, సెకండాఫ్‌లో పుంజుకున్న సౌదీ అరేబియా అనూహ్యంగా మ్యాచ్ గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement