commentator
-
టీ20 వరల్డ్‌కప్-2024కు కామెంటేటర్లు వీరే.. డీకేకు చోటు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను శుక్రవారం ప్రకటించింది. 41 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి , లెజెండరీ సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్, ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్, వసీం అక్రమ్ వంటి వారు ఈ ప్యానల్లో ఉన్నారు.కాగా దినేష్ కార్తీక్ ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో వన్డే వరల్డ్‌కప్-2023, యాషెస్ సిరీస్‌లో వ్యాఖ్యతగా వ్యవహరించాడు. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశించి భంగపడ్డ ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు ఈ వ్యాఖ్యాతల జాబితాలో చోటుదక్కింది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కామెంటరీ ప్యానెల్: రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, ఇయాన్ మోర్గాన్, టామ్ మూడీ, జాంబోయ్, రవిశాస్త్రి, ఇయాన్ బిషప్, నాజర్ హుస్సేన్, హర్ష భోగ్లే, డేల్ స్టెయిన్, గ్రేమ్ స్మిత్, మైఖేల్ అథర్టన్, వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, దినేష్ కార్తీక్, మెల్ జోన్స్,ఎబోనీ రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్, లిసా స్థలేకర్, శామ్యూల్ బద్రీ, మ్పుమెలెలో మ్బాంగ్వా, ఇయాన్ స్మిత్, నటాలీ జర్మనోస్, కార్లోస్ బ్రాత్‌వైట్, డానీ మోరిన్సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, ఫించ్, బ్రియాన్ ముర్గాట్రాయిడ్, మైక్ హేస్మాన్, ఇయాన్ వార్డ్, స్టీవ్ స్మిత్, అథర్ అలీ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, నియాల్ ఓబ్రియన్, కాస్ నైడూ, డారెన్ గంగా , వసీం అక్రమ్ -
Asia Cup 2023: భారత మాజీ ఓపెనర్‌కు బిగ్‌షాక్
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2023కు సమయం అసన్నమవుతోంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తమ జట్లను కూడా ప్రకటించాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీలో భాగమయ్యే కామేంటేటర్ల జాబితాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఈవెంట్లో పాల్గోనే మొత్తం 5 దేశాల నుంచి 12 మంది వ్యాఖ్యాతలను ఏసీసీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ వాఖ్యత ఆకాశ్ చోప్రాకు చోటుదక్కకపోవడం గమానార్హం. ఈ కామేంటరీ ప్యానల్లో భారత నుంచి గౌతమ్ గంభీర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ , దీప్ దాస్‌గుప్తాకు చోటు దక్కగా.. పాకిస్తాన్ నుంచి వసీం అక్రమ్, వకార్ యూనిస్, బాజిద్ ఖాన్, రమీజ్ రాజాలకు అవకాశం లభించింది. అదే విధంగా బంగ్లాదేశ్ నుంచి అథర్ అలీ ఖాన్, శ్రీలంక నుంచి రస్సెల్ ఆర్నాల్డ్ కూడా కామేంటరీ ప్యానల్లో భాగమయ్యారు. మరోవైపు స్కాట్ స్టైరిస్ తటస్థ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇక సెప్టెంబర్ 2న యావత్తు క్రికెట్ ప్రపంచం ఎదురుచూసే దాయాదుల పోరు పల్లెకెలె వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వాల్సిన అవసరం లేదు! ఇక ఆపేయండి -
లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్
సీనియర్ కామెంటేటర్, న్యూ-కాసిల్(New-Castle) మాజీ గోల్‌కీపర్ షకా హిస్లాప్ లైవ్ కామెంట్రీ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. సోమవారం కాలిఫోర్నియాలో రియల్ మాండ్రిడ్, ఏసీ మిలన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హోస్ట్ డాన్ థామస్‌తో కలిసి షకా హిస్లాప్ కామెంట్రీ చేశాడు. అప్పటిదాకా నవ్వుతూ కామెంట్రీ చేసిన హిస్లాప్ మొహం ఒక్కసారిగా మారిపోయింది. సహచర కామెంటేటర్ థామస్‌తో మాట్లాడుతూనే అతనిపై ఒరుగుతూ కింద పడిపోయాడు. షాక్ తిన్న థామస్ సహాయం కోసం అరుస్తూ సిబ్బందిని అలర్ట్ చేశాడు. వెంటనే సహాయక సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిస్లాప్ పరిస్థితి ఫర్వాలేదని వైద్యులు తెలిపారు. అయితే ఇలా జరగడానికి కారణమేంటో తెలియడంలేదని, కొన్ని పరీక్షలు చేసిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. బహుశా కాలిఫోర్నియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చని సహచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 54 ఏళ్ల షకా హిస్లాప్ ఫుట్‌బాల్ కెరీర్ ముగిసిన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ESPN FC Commentator Shaka Hislop collapsed on live TV before the Real Madrid vs. AC Milan friendly. He is now in stable condition. No further reports on medical condition or reason for collapse reported at this time. pic.twitter.com/2lxRfxfFWM — DiedSuddenly (@DiedSuddenly_) July 24, 2023 చదవండి: Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే -
ఆస్ట్రేలియన్ ప్లేయర్, వాయిస్ అఫ్ గేమ్ అలాన్ మెక్గిల్వ్రే (ఫొటోస్)
-
ఐపీఎల్‌కు ముందు దినేష్ కార్తీక్‌కు బంపరాఫర్.. ఒకే ఒక్కడు!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు బంపరాఫర్ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం కార్తీక్‌కు దక్కింది. ఈ ఏడాది జరగనున్న ఈ సిరీస్ కోసం స్కై క్రికెట్ ఛానెల్ తరఫున కార్తీక్ కామెంట్రీ బాక్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని డీకేనే స్వయంగా వెల్లడించాడు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో కార్తీక్‌తో పాటు ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, రిక్కీ పాంటింగ్, మార్క్ టేలర్, కుమార సంగక్కర, మెల్ జోన్స్, ఇయాన్ వార్డ్, నాసీర్ హుస్సేన్, అథెర్టన్, మార్క్ బౌచర్, ఆండ్రూ స్ట్రాస్ వాఖ్యతలగా వ్యవహరించనున్నారు. కాగా భారత్ నుంచి ఈ సిరీస్‌లో కామెంట్రీ చేయబోతున్నది కార్తీక్ ఒక్కడే కావడం విశేషం. "ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు ఓ బిగ్న్యూస్ను షేర్ చేయడానికి సిద్దమయ్యాను. 2023 యాషెస్ కామెంట్రీ ప్యానెల్లో నేను భాగంగా కానున్నాను. దిగ్గజాలతో కలిసి వాఖ్యతగా వ్యవహరించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కై క్రికెట్‌కు ధన్యవాదాలు" అని కార్తీక్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కూడా కార్తీక్ వాఖ్యతగా వ్యవహరించాడు. ఇక జాతీయ జట్టులో కోల్పోయి కామేంటేటర్‌గా అవతారమెత్తిన డీకే.. ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు. కార్తీక్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో ఫినిషర్‌గా కార్తీక్ అదరగొట్టాడు. ఇక ఐపీఎల్-2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరు వేదికగా ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ దూరం! కెప్టెన్‌గా సూర్యకుమార్ One MASSIVE announcement before the IPL as a player starts... So proud to be amongst these legends. Surreal feeling. Just felt like sharing! Bas. That's all 😊☺️ Thanks @SkyCricket for giving me this opportunity and honour. #Ashes2023 pic.twitter.com/bnYyLDOV0E — DK (@DineshKarthik) March 30, 2023 -
క్రికెట్లో 'ఆ' స్వరం ఇక వినపడదు..!
ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ సుదీర్ఘ కాలం తర్వాత తన క్రికెట్ వ్యాఖ్యానానికి ముగింపు పలికారు. ఇకపై తాను కామెంటరీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఆరోగ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయాన్ వెల్లడించారు. 78 ఏళ్ల చాపెల్ ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ప్రతిష్టాత్మక చానల్ 9 ద్వారా తన కామెంటరీని మొదలు పెట్టారు. తన అద్భుత వ్యాఖ్యానంతో క్రికెట్ ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేశారు. సూటి విమర్శలు, సునిశిత విశ్లేషణతో అత్యుత్తమ వ్యాఖ్యాతగా ఎదిగిన చాపెల్ 45 ఏళ్ల పాటు ఈ రంగాన్ని శాసించారు. ఆస్ట్రేలియా తరఫున 75 టెస్టులు ఆడి 5345 పరుగులు చేసిన ఇయాన్ చాపెల్ ఇందులో 30 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించారు. 16 వన్డేల్లో కూడా ఆయన ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సార్లు స్టార్ ఆటగాళ్లనుంచి విమర్శలు ఎదుర్కొన్నానని...అయితే ఏనాడూ తాను సూటి వ్యాఖ్యానం విషయంలో వెనక్కి తగ్గలేదన్న చాపెల్, క్రికెట్ బాగు కోసమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. -
కొత్త అవతారమెత్తబోతున్న మోర్గాన్.. ఇండియాతో సిరీస్ నుంచి..?
ఇంగ్లండ్ తాజా మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన మోర్గాన్.. కొద్ది నిమిషాల్లోనే తన ఫ్యూచర్ ప్లాన్‌ను వెల్లడించాడు. ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కామెంటేటర్‌గా మారబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని మోర్గాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ‘స్కై’ నెట్వర్క్ ధృవీకరించింది. మోర్గాన్ తమ కామెంటరీ టీమ్‌లో చేరబోతున్నడని ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్ ఆడబోయే తదుపరి సిరీస్‌ల నుంచి మోర్గాన్ స్కై నెట్‌వర్క్‌లో భాగస్వామిగా ఉంటాడని పేర్కొంది. మొత్తానికి ఇంగ్లండ్ తరఫున క్రికెటర్‌గా 13 ఏళ్ల కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మోర్గాన్ మరో పనిని వెతుక్కున్నాడు. త్వరలో జరుగబోయే ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌ల నుంచి మోర్గాన్ కామెంటేటర్‌గా తన కెరీర్ మొదలుపెట్టనున్నాడు. ఐర్లాండ్ తరఫున కెరీర్ ప్రారంభించి ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎనలేని సేవలనందించిన మోర్గాన్.. తన హయాంలో ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్ (2019) అందించాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? -
యాషెస్ సిరీస్‌లో తెలంగాణ బిడ్డ..
హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో(2021-22) తెలంగాణ కుర్రాడు రాకేశ్ దేవారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్ 16 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు సంబంధించిన తెలుగు కామెంటరీ బాక్స్‌లో రాకేశ్ వ్యాఖ్యాతగా కనిపించనున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రాకేశ్.. మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, సబా కరీం, లక్ష్మణ్ శివరామకృష్ణన్‌లతో పాటు విశ్లేషకులు వెంకటేష్ సుధీర్లతో కలిసి కామెంట్రీ బాక్స్‌ని షేర్ చేసుకోబోతున్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాకేశ్‌కు ఈ గౌరవం దక్కడం తెలంగాణ ప్రాంతానికే గౌరవమని ఆ ప్రాంత ప్రజలు ముచ్చట పడిపోతున్నారు. సింగరేణి నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్.. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు. చదువుల్లో రాణిస్తూనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన ఎన్నో లీగ్‌ల్లో పాల్గొని రాణించాడు. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డ రాకేశ్.. ఉద్యోగం చేసుకుంటూనే క్రికెట్ విశ్లేకుడిగా, వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. చదవండి: గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్ -
సరికొత్త అవతారంలో ట్రంప్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 11న జరుగనున్న బాక్సింగ్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ ఇవాండర్ హోలీఫీల్డ్, మాజీ యూఎఫ్‌సీ ఛాంపియన్ విక్టర్ బెల్ఫోర్ట్ మధ్య జరుగనున్న బాక్సింగ్ పోటీకి తనయుడు జూనియర్ ట్రంప్‌తో కలసి వ్యాఖ్యానం చేయనున్నాడు. ఈ పోటీకి ఫ్లోరిడాలోని హాలీవుడ్ ఎరీనా వేదిక కానుంది. నాలుగు బౌట్ల పాటు సాగే ఈ పోటీని పే పర్ వ్యూ విధానం ద్వారా FITE.TV ప్రసారం చేయనుంది. మొబైల్, స్మార్ట్ టీవీ యాప్స్‌లో ప్రసారమయ్యే ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటే 49.9 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, దిగ్గజాలు తలపడే ఈ పోరు సందర్భంగా వ్యాఖ్యానం చేసేందుకు ట్రంప్ సహా అమెరికన్లు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎవ్వరూ మిస్ కావొద్దంటూ ట్రంప్ ప్రకటనలు కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, ట్రంప్‌కు బాక్సింగ్‌తో అనుబంధం ఎక్కువే. గతంలో కొన్నేళ్లు అతను బాక్సింగ్ పోటీలకు ఆతిథ్యమిచ్చాడు. వివిధ బౌట్లను ప్రమోట్ చేశాడు. ఇందులో చాలావరకు అట్లాంటిక్ సిటీలోని తన సొంత క్యాసినోలోనే జరిగాయి. చదవండి: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి
పెబ్బేరు: ఇంగ్లండ్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగు ఐదో టెస్ట్ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పెబ్బేరుకు చెందిన షోయబ్‌కు అవకాశం లభించింది. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు అయిదో టెస్ట్‌కు ముంబైలోని సోనీ నెట్వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు. అతడు వ్యాఖ్యాతగా ఎంపికవడంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఆయనతోపాటు పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
టీమిండియాకు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కావాలి.. నాకు ఛాన్స్ ఇవ్వండి
లండన్: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన మనసులో మాటని బయటపెట్టాడు. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా భారత్ తరఫున ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకి మరో ఛాన్స్ ఇవ్వాలని భారత సెలెక్టర్లని అభ్యర్థించాడు. టీమిండియాకు టీ20ల్లో సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లేడని, జట్టు నిండా టాపార్డర్ బ్యాట్స్‌మెనే ఉన్నారని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మినహా మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాట్స్‌మన్ లేడని, అందుకే తనకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లను కోరాడు. తనకింకా ఆటపై మక్కువ తగ్గలేదని, 2019 వన్డే ప్రపంచకప్‌లో విఫలమవ్వడం వల్లే తనని టీ20 జట్టు నుంచి తప్పించారని తెలిపాడు. కాగా, ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ద్వారా వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తిన డీకే.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కి కూడా కామెంట్రీ చెప్పనున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నానని, రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నానని, ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని తెలిపాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన డీకే.. అప్పటి నుంచి టీమిండియాకి దూరంగా ఉన్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా మారడంతో.. ఇక కార్తీక్ పనైపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో డీకే తన మనసులో మాట బయటపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా, డీకే ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండానే వ్యాఖ్యాతగా మారి జెంటిల్మెన్ గేమ్‌లో కొత్త ఒరవడి సృష్టించాలని డీకే భావిస్తున్నాడు. -
తండ్రికి పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్.. కామెంటేటర్ ఆర్పీ సింగ్ ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. తన తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో బయోబబుల్ సెక్యూర్‌ను వదిలి ఫ్యామిలీకి సహాయంగా ఉండేందుకు వెళ్లాడు. ఆర్పీ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సాధారణంగా ఆటగాళ్లతో పాటు కామెంటేటర్స్, లైవ్ మ్యాచ్‌లు టెలికాస్ట్ చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్ సిబ్బంది ఎవరైనా సరే నిబంధనల్లో భాగంగా బయోబబుల్ సెక్యూల్ ఉండేలా ఆంక్షలు విధించారు. అయితే మంగళవారం ఆర్పీ సింగ్ తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో తన అవసరం నా ఫ్యామిలీకి ఉందని.. అందుకే తప్పుకుంటున్నట్లు ఆర్పీ సింగ్ తెలిపాడు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి బయోబబుల్ సెక్యూర్ దాటి బయటికి వెళ్తే మళ్లీ అడుగుపెట్టే అవకాశం లేదు. ఇక ఆర్పీ సింగ్‌తో పాటు అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, పార్థివ్ పటేల్, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్, దీప్‌దాస్ గుప్తా తదితర మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా ఉదృతమవుతున్న వేళ ఐపీఎల్ 14 సీజన్ నుంచి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స ఆటగాడు అశ్విన్ తప్పుకోగా.. ఇక విదేశీ ఆటగాళ్లలో రాజస్తాన నుంచి లివింగ్ స్టోన్, ఆండ్రూ టై, ఆర్సీబీ నుంచి కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా లీగ్‌ను వీడిన సంగతి తెలిసిందే.ఇక 2018లో ఆర్పీ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు, 10 టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. చదవండి: అతని స్థానంలో ఆర్సీబీలోకి కొత్త ఆటగాడు.. -
హీల్స్ ధరించి క్రికెట్ ఫీల్డ్‌లో తిరుగుతారా?
కరాచీ: పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ఆ దేశపు తొలి మహిళా కామెంటేటర్ మెరీనా ఇక్బాల్‌ను టార్గెట్ చేస్తూ ఖాదిర్ ఖవాజా అనే స్పోర్ట్స్ జర్నలిస్టు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాకిస్తాన్‌లోని ఓ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసి ఏదో సంచలనాన్ని క్రియేట్ చేద్దామని చూశాడు. ఇందులో కామెంటేటర్‌గా వ్యహరించిన మెరీనా హై హీల్స్ ధరించిన ఫోటోలను షేర్ చేశాడు. ‘మీరు హీల్స్ ధరించి పిచ్ మొత్తం తిరగడం కరెక్ట్ అని అనుకుంటున్నారా? ఇది జస్ట్ తెలుసుకోవాలని అడుగుతున్నా’ అంటూ ప్రశ్నించాడు. ఆ ట్వీట్‌కు మెరీనా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. (చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) ‘హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజరస్. పిచ్‌పై నేను హై హీల్స్ ధరించి నడవలేదు. మ్యాచ్‌కు ముందు మాత్రమే హై హీల్స్ వేసుకున్నా. అంతేకానీ పిచ్‌పైకి వెళ్లినప్పుడు నేను ఫ్లాట్‌గా ఉన్న షూస్ వేసుకున్నా. నేను పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ననే విషయం మరవకండి. నిబంధనలు ఏమిటో నాకు తెలుసు.. మీరు నాకు చెప్పక్కర్లేదు. అంటూ కొన్ని ఫోటోలను కౌంటర్‌గా పోస్ట్ చేశారు మెరీనా. మహిళా క్రికెటర్లను టార్గెట్ చేస్తూ అర్థపర్థం లేని ప్రశ్నలు వేయడం చాలా సందర్భాలు చూశాం. గతంలో భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఒక చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓ రిపోర్టర్.. పురుషుల క్రికెట్లో మీ ఫేవరేట్ ఎవరని అడిగాడు. ఈ అర్థం లేని ప్రశ్న మిథాలీకి విపరీతమైన కోపం తెప్పించింది. ఇదే ప్రశ్న పురుష క్రికెటర్లను అడుగుతారా? అని ఎదురు ప్రశ్నించింది. -
నన్ను వ్యాఖ్యాతగా తీసుకోండి
ముంబై: మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనను మళ్లీ టీవీ వ్యాఖ్యాతగా తీసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని అభ్యర్థించాడు. యూఏఈలో జరగబోయే ఐపీఎల్–13లో వ్యాఖ్యానం చేసేందుకు అనుమతించాలని కోరుతూ బోర్డుకు ఈ–మెయిల్ పంపాడు. ‘గౌరవనీయులైన బోర్డు ఉన్నతాధికారులకు మనవి. నేను ఇదివరకే కామెంటేటర్‌గా నాకు స్థానం కల్పించాలని మెయిల్ చేశాను. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కావడంతో బీసీసీఐ.టీవీ త్వరలోనే కామెంట్రీ ప్యానెల్‌ను ఎంపిక చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలున్న నన్ను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నాను. గతంలో బోర్డు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించడంలో పొరపాటు జరిగింది. ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. అలాగే నడుచుకుంటానని తెలియజేస్తున్నాను’ అని మంజ్రేకర్ ఆ ఈ–మెయిల్లో పేర్కొన్నారు. బీసీసీఐ నియమావళికి విరుద్ధంగా బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ రవీంద్ర జడేజాను విమర్శించడంతో కొందరు క్రికెటర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది మార్చిలో కామెంట్రీ ప్యానెల్ నుంచి మంజ్రేకర్‌ను తొలగించారు. భారత్–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ముందే ఉన్నపళంగా అతన్ని తప్పించారు. అయితే ఆ సిరీస్ కరోనా వల్ల రద్దయింది. ఇప్పుడు మంజ్రేకర్‌ను మన్నించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. అయితే దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని బోర్డు అధికారులు తెలిపారు. కాగా 71 ఏళ్ల భారత దిగ్గజం సునీల్ గావస్కర్ క్రికెట్ వ్యాఖ్యానం కోసం యూఏఈ వెళ్లనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయనకు ఉన్న చోటే వర్చువల్ కామెంట్రీ అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఆటపై ఉన్న ఆసక్తితో నేరుగా కామెంట్రీ చేసేందుకు ఆయన అక్కడికి వెళ్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. -
‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’
సాక్షి, హైదరాబాద్ : కరోనో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్డౌన్ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రేమపక్షులు ఇప్పడు ఇంట్లోనే ఆనందంగా గడుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు. ఇక ఈ లాక్డౌన్ సమయంలో ఇంగ్లండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌తో కోహ్లికి మరింత బాండింగ్ ఏర్పడింది. తరుచూ ఇన్స్టాగ్రామ్ వీడియో కాలింగ్‌లో సరదాగా సంభాషించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు ముచ్చటించుకుంటూ.. ఇష్టమైన క్రికెట్ కామెంటేటర్(వ్యాఖ్యాత) ఎవరని టీమిండియా సారథిని కేపీ ఆడిగాడు. అయితే సమాధానం ఇవ్వడానికి కోహ్లి చాలా సమయమే తీసుకున్నాడు. ఇదే క్రమంలో దీనికి ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఇవ్వమని లేకుంటే ఇబ్బందుల్లో పడతావని హెచ్చరించాడు. ఈ గ్యాప్‌లో ఆలోచించిన కోహ్లి తనకు ఇష్టమైన వ్యాఖ్యాత ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ అని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యానం ఎందుకో నాకు బాగా నచ్చుతుందని, వివాదాల జోలికి వెళ్లకుండా చాలా సరదాగా మాట్లాడతాడని తెలిపాడు. చాలా తెలివిగా సమాధానం చెప్పావని కేపీ ప్రశంసించాడు. అదేవిధంగా లియన్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలలో రొనాల్డో తనకు ఎంతో ఇష్టమని మరో ప్రశ్నకు సమాధానంగా కోహ్లి పేర్కొన్నాడు. చదవండి: డివిలియర్స్‌ను స్లెడ్జింగ్ చేయలేదు! లాక్డౌన్: ‘ఖైదీననే భావన కలుగుతోంది’ -
మయాంక్‌ని కించపరిచిన ఆస్ట్రేలియా కామెంటేటర్
మెల్బోర్న్ : భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ కామెంటేటర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న కర్ణాటక ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌పై కామెంటేటర్ ఓ.కీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు... భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను అవమానించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మయాంక్ 304 పరుగులు సాధించి అజేయ ట్రిపుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 2017-18లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన మయాంక్ ఓపెనర్‌గా బరిలోకి దిగి 76 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. మయాంక్ సాధించిన ట్రిపుల్ సెంచరీ పెద్ద విషమేమీకాదనీ ఓ.కీఫ్ వ్యాఖ్యానించాడు. ఏ క్యాంటీన్ జట్టుపైనో లేదా వెయిటర్స్ టీమ్‌పైనో అతడు 304 పరగులు చేసి ఉండొచ్చని అన్నాడు. దీంతో ట్విటర్ వేదికగా ఓ.కీఫ్‌ను క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ‘వెటకారపు, వెకిలి నవ్వుల కోసం మరో దేశాన్ని కించపరుస్తారా’ అంటూ మండిపడుతున్నారు. జాతి వివక్ష వ్యాఖ్యలు మానుకోండని హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉండగా.. 2013లో జార్ఖండ్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన మయాంక్.. 46 ఫస్ట్‌క్లాస్, 75 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. దాదాపు 50 సగటుతో రాణించాడు. కాగా, 1971-1977 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన కీఫ్ లెగ్ స్పిన్నర్. 24 టెస్టులు ఆడిన అతను 53 వికెట్లు తీశాడు. అనంతరం క్రికెట్ కామెంటేటర్‌గా మారి... విలక్షణమైన వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. It might just be me, but it's pretty uncool to ridicule the FC comp of another country while using dubious stereotypes for a cheap laugh... — Melinda Farrell (@melindafarrell) December 26, 2018 Kerry o'keefe, Lord snooty!! Sounds like still living in colonial era #BoxingDayTest #INDvsAUS — Dilipsinh Abda (@dilipsinhabda) December 26, 2018 -
గుండెపోటుతో కామెంటేటర్ మృతి
మాస్కో: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను అభిమానులు ఆసక్తితో తిలకిస్తున్నారు. తమకిష్టమైన టీమ్ ఆటలో గెలిస్తే ఆనందంతో ఎగిరి గంతులేసే వీరాభిమానులు ఉన్నారు. ఒకవేళ ఓడితే ప్రాణాలు తీసుకునే పిచ్చి అభిమానులున్నారు. గతవారం అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వీరాభిమాని సూసైడ్ చేసుకున్నాడు. తాజాగా ఓ కామెంటేటర్ తమ టీమ్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో తమ దేశం ఓటమిపాలు కావడంతో ఈజిప్టు వ్యాఖ్యాత అబ్దుల్ రహీమ్ మహ్మద్ గుండెపోటుతో మరణించినట్టు తెలిపింది. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగుస్తుంది అనుకున్న సమయంలో సౌదీ అరేబియా డిఫెండర్ సలేం అల్ దాస్రి అదనపు సమయంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. అయితే ఆ సమమంలోనే ఆయనకు చాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు గుర్తించారు. అబ్దుల్ మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు తెలిపారు. మ్యాచ్ మొదట్లోనే ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్‌తో ఆధిక్యంలో దూసుకెళ్లినా, సెకండాఫ్‌లో పుంజుకున్న సౌదీ అరేబియా అనూహ్యంగా మ్యాచ్ గెలిచింది. وفاة نجم نادي #الزمالك الكابتن عبدالرحيم محمد اليوم في الاستديو التحليلي لمباراة #السعودية_مصر على قناة النيل نتيجة انفعاله من الخسارة تسببت له بجلطة و انتقل للمستشفي وفشلت محاولات الاسعاف. لا إله إلا الله و إنا لله وإنا إليه راجعون الدعاء له بالثبات عند السؤال pic.twitter.com/OnSTxeutMV — احمد صالح🇪🇬Ahmd Saleh (@iAHMEDsalih) June 25, 2018 -
కామెంటరీ బాక్స్‌లో సచిన్
బర్మింగ్‌హామ్: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో కొత్త పాత్ర పోషించనున్నారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య నేడు జరిగే మ్యాచ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే భాగంలో ఆయన తొలిసారిగా వ్యాఖ్యాతగా మారనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ప్రసారకర్త స్టార్ గ్రూప్ కేవలం ఈ మ్యాచ్ కోసమే తమ కామెంటేటర్స్ ప్యానెల్లో సచిన్‌ను చేర్చింది. అయితే ఇంగ్లిష్ కామెంటరీ ఐసీసీ చేతుల్లో ఉండటంతో కేవలం ఆయన హిందీ కామెంటరీ బాక్స్‌లోనే కనిపించనున్నారు. కానీ సచిన్ మ్యాచ్ ఆద్యంతం కామెంటరీ వినిపించరని, ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో మాత్రమే భాగంగా ఉంటారని స్టార్ గ్రూప్ పేర్కొంది. -
కర్నూలు వ్యాఖ్యాతకు గవర్నర్ ప్రశంస
కర్నూలు (అర్బన్): విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకల్లో కర్నూలుకు చెందిన వ్యాఖ్యాత ఇనాయతుల్లాను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. గణతంత్ర వేడుకల్లో ఇనాయతుల్లా ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని అందించారు. వేడుకల అనంతరం జరిగిన హైటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్, ప్రభుత్వ గౌరవసలహాదారు పరకాల ప్రభాకర్, శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు ఇనాయతుల్లాను అభినందించారు. కర్నూలు వ్యాఖ్యాతకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం హర్షణీయమని కర్నూలు తెలుగు కళాస్రవంతి అధ్యక్షుడు డా.ఎం.పీ.ఎం రెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్‌మియా, ప్రముఖ నవలా రచయిత ఎస్‌డీవీ అజీజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కర్నూలు వ్యాఖ్యాతకు సీఎం అభినందన
కర్నూలు(అర్బన్): 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం పోలీస్ ట్రై నింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకలలో వ్యాఖ్యాతగా పాల్గొన్న కర్నూలు కథారచయిత ఇనాయతుల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అనంతపురం స్వాతంత్య్రోద్యమ చరిత్ర, అమరావతి విశేషాలను, పోలీసు కవాతు దశ్యాలను, శకటాల ప్రదర్శనను ఆసక్తికరంగా వ్యాఖ్యానించిన తీరును మెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు పరకాల ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, బీజేపీ నండూరి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకాష్ టక్కర్, ఎపీఎస్పీ బెటాలియన్ ఐజీ ఆర్కే మీనా, అనంతపురానికి చెందిన ప్రముఖ రచయిత ఏలూరు యంగన్నకవి తదితరులు ఇనాయతుల్లాను అభినందించారు. ఈయన గతంలో విజయవాడ, వైజాగ్‌లలో జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడులకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
'అది క్రికెటర్ల ఫిర్యాదుగా భావించడం లేదు'
న్యూఢిల్లీ: ఐపీఎల్-9వ సీజన్ ఆరంభంలోనే ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆకస్మికంగా తొలగించడం వెనుక కారణాలేమిటన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ టీ 20 అనంతరం భారత క్రికెట్ జట్టులోని కొంతమంది సీనియర్ క్రికెటర్లు బోగ్లేపై ఫిర్యాదు చేయడంతోనే అతన్ని కామెంటేటర్ పదవికి ఉద్వాసన పలికారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను హర్షా బోగ్లే ఖండించాడు. టీమిండియా క్రికెటర్లు తనపై ఫిర్యాదు చేసి తొలగింపుకు కారణమవుతారని అనుకోవడం లేదన్నాడు. 'వ్యాఖ్యాతగా ఉన్న నేను ప్రతీ క్రికెటర్ గురించి మాట్లాడుతుంటాను. వాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కామెంటరీతో వారు చేసే పరుగుల్ని, వికెట్లను, క్యాచ్‌లను ఆపలేను. ఒక యూనివర్శిటీ స్థాయి క్రికెటర్ అయినా వారి గురించి చెప్పడమే నా విధి. అటువంటప్పుడు క్రికెటర్లు నా గురించి ఫిర్యాదు చేస్తారని ఎలా అనుకుంటాను. అది క్రికెటర్ల పని కాదనేది నా బలమైన నమ్మకం' అని హర్షాబోగ్లే పేర్కొన్నాడు. భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. -
ఐపీఎల్-9 వివాదంలో మిస్టరీ
ఐపీఎల్-9వ సీజన్‌నూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ నుంచి ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను ఉన్నఫళంగా తొలగించడానికి కారణమేంటన్నది మిస్టరీగా మారింది. దీనికి కొందరు టీమిండియా సీనియర్ క్రికెటర్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. భోగ్లేకు వ్యతిరేకంగా వారు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. టి-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్ క్రికెటర్లు భోగ్లేపై బోర్డుకు ఫిర్యాదు చేసి ఉంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు సురేష్ రైనా, అశ్విన్ మీడియా సమావేశాల్లో దురుసుగా మాట్లాడటాన్ని నెటిజన్లు ప్రస్తావించారు. భోగ్లే ఇటీవల విదర్భ క్రికెట్ సంఘం గురించి పరుష వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. భోగ్లే పేరును ప్రస్తావించకుండా ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భోగ్లే ఉద్వాసనకు కారణమేంటన్నది మిస్టరీగా మారింది. -
సునీల్ గావస్కర్‌కు బీసీసీఐ షాక్?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలోనే భారత మాజీ కెప్టెన్, లెజండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ సేవలకు రాంరాం చెప్పనుంది. ఆయనతో బోర్డుకు చాలాకాలంగా ఉన్న అనుబంధాన్ని తెంపుకోవాలని భావిస్తోంది. బీసీసీఐ-గావస్కర్ మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏప్రిల్ లేదా మే నెలలో ముగియనుంది. ఆయన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. బీసీసీఐ ఇంటర్నల్ పోడక్షన్ హౌజ్‌కు మోస్ట్ హై ప్రొఫైల్ కామెంటెటర్‌గా గావస్కర్ చాలాకాలంగా కొనసాగుతున్నాడు. బోర్డు వైఖరికి అనుగుణంగా కామెంటరీ వినిపించేందుకు ఈ యూనిట్ సొంత కామెంటెటర్లను నియమించుకుంటున్నది. అయితే ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ కామెంటెటర్‌గా కొనసాగేందుకు గావస్కర్ భారీమొత్తంలో ఫీజు అడుగుతుండటంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన ఇండియా-దక్షిణాఫ్రికా సిరీస్‌కు కామెంటరీ వినిపించేందుకు ఏకంగా రూ. 90 లక్షలు గావస్కర్ తీసుకున్నారు. అదే సమయంలో ఇందుకు ఇద్దరు భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లేకు రూ. 39.1 లక్షలు, సంజయ్ మంజ్రేకర్‌కు రూ. 36.49 లక్షలు బీసీసీఐ చెల్లించింది. ఫీజు విషయంలో మాత్రమే కాదు బీసీసీఐ వైఖరికి భిన్నంగా కొన్నిసార్లు గావస్కర్ తన అభిప్రాయాలు వెల్లడించడం కూడా తాజా నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అయితే, బోర్డు విషయంలో సన్నీ ఎప్పుడూ గట్టి మద్దతుదారుగా కొనసాగుతున్నాడని, తాజాగా ఎంపైర్ నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్) విషయంలో బోర్డు వైఖరిని సన్నీ గట్టిగా సమర్థించారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్లో గావస్కర్ అధికారిక కామెంటెటర్‌గా కనిపిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకనుంచి ఆయనను సిరీస్ టు సిరీస్ ఆధారంగానే కామెంటెటర్‌గా నియమించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీమిండియా డైరెక్టర్‌గా త్వరలో కాంట్రాక్టు ముగుస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి కూడా ఐపీఎల్ లో కామెంటెటర్‌గా తిరిగి తన విధులు చేపట్టే అవకాశముంది. -
భారత్ వర్సెస్ బంగ్లా: కామెంటేటర్‌గా సూపర్ స్టార్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్ లో భారత్-పాకిస్థాన్ మధ్య రసరంజకంగా జరిగిన మ్యాచ్ ను మిస్ అయ్యాడు. ఆ లోటు షారుఖ్ అభిమానులనే కాదు.. షారుఖ్ ను కూడా కలిచివేసింది. ఈ నేపథ్యంలో కీలకమైన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ను అత్యంత శ్రద్ధగా వీక్షించేందుకు ఆయన సిద్ధమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో భారత్-బంగ్లాదేశ్ పోరు జరుగనుంది. సెమిస్ ఆశలు నిలుపుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే. ఈ కీలకమైన మ్యాచ్ కు గొంతు ఇవ్వనున్నాడు షారుఖ్. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తో కలిసి షారుఖ్ టీవీ కామెంటేటరీలో పాల్గొననున్నాడు. తన హస్కీ గొంతుతో మ్యాచ్ జరుగుతున్న తీరుని కామెంటేటర్ గా ఓ 20 నిమిషాలపాటు షారుఖ్ వివరిస్తారని తెలుస్తోంది. దుబాయ్ లో చాలా బిజీగా ఉండటంతో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ కు షారుఖ్ హాజరుకాలేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఆయన ఈ మ్యాచ్ లో జాతీయగీతాన్ని ఆలపించాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు రాకపోవడం తనను కూడా బాధించిందని, అల్లా దయతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచి వరల్డ్ కప్ అందుకుంటే చూడాలని ఉందని షారుఖ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్-బంగ్లా మ్యాచ్ కు కామెంటేటర్ గా గొంతు అందిస్తుండటం ఆసక్తికరంగా మారింది. -
ఆధ్యాత్మికం... వ్యక్తిత్వ వికాసం
సంకలనం అన్నమయ్య సంకీర్తనల వ్యాఖ్యాతగా ఆంధ్రదేశానికి సుపరిచితులు వెంకట్ గరికపాటి. గతంలో ఆయన సంగీత ప్రియులకోసం అన్నమయ్య సంకీర్తన రత్నాకరము, అన్నమయ్య సంకీర్తన సుధాకరము పేరిట రెండు స్వరరాగ సుధారసాలను అందించారు. ఆ గ్రంథాలకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తాజాగా ‘వికాస విభాసం’ పేరిట మరో చక్కటి వ్యాస సంకలనాన్ని వెలువరించారు. ‘సాక్షి’ సహా పలు దినపత్రికలలో ప్రచురితమైన ఈ వ్యాసాలు ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాసాలకు మేలు చేకూర్చే మేలిమి ముత్యాల్లాంటివి. ఇంపైన పదబంధాలతో, సులభమైన శైలితో సాగిన ఈ వ్యాసాలలో అందరికీ తెలిసిన విషయాల నుంచి, ఏ కొందరికో మాత్రమే తెలిసిన ఆధ్యాత్మిక రహస్యాలు కూడా ఉన్నాయి. రచయితది సాహితీ సుగంధాలకు కానీ, ఆధ్యాత్మిక పరిమళాలకు గానీ ఏమాత్రం పొసగని ఉద్యోగం. అయినా చిన్నప్పటి నుంచి తాను విన్న, చదివిన మంచి విషయాలను పదిమందితోటీ పంచుకోవాలన్న తపనతో పలు రచనలు చేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వ్యాసాలన్నింటిలోనూ యువతకు, విద్యార్థులకు అవసరమైన వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉండటం విశేషం. (వికాస విభాసం- ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి, పుటలు: 240, వెల రూ. 150 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు). - డి.వి.ఆర్.