వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 11న జరుగనున్న బాక్సింగ్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ ఇవాండర్ హోలీఫీల్డ్, మాజీ యూఎఫ్‌సీ ఛాంపియన్ విక్టర్ బెల్‌ఫోర్ట్ మధ్య జరుగనున్న బాక్సింగ్ పోటీకి తనయుడు జూనియర్ ట్రంప్‌తో కలసి వ్యాఖ్యానం చేయనున్నాడు. ఈ పోటీకి ఫ్లోరిడాలోని హాలీవుడ్ ఎరీనా వేదిక కానుంది. నాలుగు బౌట్ల పాటు సాగే ఈ పోటీని పే పర్ వ్యూ విధానం ద్వారా FITE.TV ప్రసారం చేయనుంది.
మొబైల్, స్మార్ట్ టీవీ యాప్స్‌లో ప్రసారమయ్యే ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటే 49.9 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, దిగ్గజాలు తలపడే ఈ పోరు సందర్భంగా వ్యాఖ్యానం చేసేందుకు ట్రంప్ సహా అమెరికన్లు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎవ్వరూ మిస్ కావొద్దంటూ ట్రంప్ ప్రకటనలు కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, ట్రంప్‌కు బాక్సింగ్‌తో అనుబంధం ఎక్కువే. గతంలో కొన్నేళ్లు అతను బాక్సింగ్ పోటీలకు ఆతిథ్యమిచ్చాడు. వివిధ బౌట్లను ప్రమోట్ చేశాడు. ఇందులో చాలావరకు అట్లాంటిక్ సిటీలోని తన సొంత క్యాసినోలోనే జరిగాయి.
చదవండి: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment