Ex-Goal Keeper Shaka Hislop Collapses During Live Commentary Of Real Madrid Vs AC Milan Match - Sakshi
Sakshi News home page

Shaka Hislop Collapsed Video: లైవ్‌ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్‌

Published Tue, Jul 25 2023 4:34 PM | Last Updated on Tue, Jul 25 2023 4:45 PM

Ex-Goal Keeper Collapses Live Commentary Real Madrid Vs AC Milan Match - Sakshi

సీనియర్‌ కామెంటేటర్‌, న్యూ-కాసిల్‌(New-Castle) మాజీ గోల్‌కీపర్‌ షకా హిస్లాప్‌ లైవ్‌ కామెంట్రీ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. సోమవారం కాలిఫోర్నియాలో రియల్‌ మాండ్రిడ్, ఏసీ మిలన్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు హోస్ట్‌ డాన్‌ థామస్‌తో కలిసి షకా హిస్లాప్‌ కామెంట్రీ చేశాడు. అప్పటిదాకా నవ్వుతూ కామెంట్రీ చేసిన హిస్లాప్‌ మొహం ఒక్కసారిగా మారిపోయింది. సహచర కామెంటేటర్‌ థామస్‌తో మాట్లాడుతూనే అతనిపై ఒరుగుతూ కింద పడిపోయాడు. షాక్‌ తిన్న థామస్‌ సహాయం కోసం అరుస్తూ సిబ్బందిని అలర్ట్‌ చేశాడు. వెంటనే సహాయక సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిస్లాప్‌ పరిస్థితి ఫర్వాలేదని వైద్యులు తెలిపారు.

అయితే ఇలా జరగడానికి కారణమేంటో తెలియడంలేదని, కొన్ని పరీక్షలు చేసిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. బహుశా కాలిఫోర్నియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చని సహచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రినిడాడ్‌ అండ్ టొబాగోకు చెందిన 54 ఏళ్ల షకా హిస్లాప్‌ ఫుట్‌బాల్‌ కెరీర్‌ ముగిసిన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 

చదవండి: Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్‌ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్‌ క్లారిటీ

Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement