new castle
-
లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్
సీనియర్ కామెంటేటర్, న్యూ-కాసిల్(New-Castle) మాజీ గోల్‌కీపర్ షకా హిస్లాప్ లైవ్ కామెంట్రీ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. సోమవారం కాలిఫోర్నియాలో రియల్ మాండ్రిడ్, ఏసీ మిలన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హోస్ట్ డాన్ థామస్‌తో కలిసి షకా హిస్లాప్ కామెంట్రీ చేశాడు. అప్పటిదాకా నవ్వుతూ కామెంట్రీ చేసిన హిస్లాప్ మొహం ఒక్కసారిగా మారిపోయింది. సహచర కామెంటేటర్ థామస్‌తో మాట్లాడుతూనే అతనిపై ఒరుగుతూ కింద పడిపోయాడు. షాక్ తిన్న థామస్ సహాయం కోసం అరుస్తూ సిబ్బందిని అలర్ట్ చేశాడు. వెంటనే సహాయక సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిస్లాప్ పరిస్థితి ఫర్వాలేదని వైద్యులు తెలిపారు. అయితే ఇలా జరగడానికి కారణమేంటో తెలియడంలేదని, కొన్ని పరీక్షలు చేసిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. బహుశా కాలిఫోర్నియాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చని సహచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 54 ఏళ్ల షకా హిస్లాప్ ఫుట్‌బాల్ కెరీర్ ముగిసిన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ESPN FC Commentator Shaka Hislop collapsed on live TV before the Real Madrid vs. AC Milan friendly. He is now in stable condition. No further reports on medical condition or reason for collapse reported at this time. pic.twitter.com/2lxRfxfFWM — DiedSuddenly (@DiedSuddenly_) July 24, 2023 చదవండి: Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే -
'ఫుట్‌బాల్ టీంను కొందామనుకుంటున్నా'
న్యూయార్క్ : అమెరికా బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ క్లబ్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.ఇదే విషయమై గతవారం టైన్సైడ్లోని ఓ- 2సిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఫుట్‌బాల్ టీమ్ న్యూ కాజిల్ యునైటెడ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగాన్యూకాజిల్కు ప్రస్తుత యజమానిగా వ్యవహరిస్తున్న మైక్ ఆష్లే నుంచి క్లబ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా.. అని మేవెదర్‌ను విలేకరులు ప్రశ్నించారు. దానికి మేవెదర్ స్పందిస్తూ.. ‘యూఎస్‌లో మేము దీనిని సాకర్ అని పిలుస్తాము. కాని న్యూ కాజిల్ ఫుట్‌బాల్ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదు. నేను న్యూ కాజిల్ జట్టును కొనాలని భావిస్తే ముందు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడూ కొత్త వ్యాపార అవకాశాలకు సిద్ధంగా ఉంటాను. నాకు బాక్సింగ్ ఒక్కటే కాకుండా మిగతా ఆటలంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌ను కొందామనే ఆలోచన చేశా. సాకర్ నా ఆట కాకపోవచ్చు.. కానీ ప్రతి ఆట గురించి నాకు కొంతమేర అవగాహన ఉంది' అని మేవెదర్ వెల్లడించాడు.(షఫాలీని అలా చూడటం కష్టమైంది) అయితే మేవెదర్, బ్రిటిష్ బిలియనీర్ ఆష్లే మధ్య ఇంకా దీని గురించి ఎటువంటి అధికారిక చర్చలు జరగలేదు. కానీ న్యూకాజిల్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఫ్లాయిడ్ కంపెనీ మనీ టీమ్ ఆసక్తి చూపిస్తోందని టిఎమ్‌జెడ్ స్పోర్ట్స్ ఇటీవలే నివేదించింది. కాగా గతేడాదిఫ్లాయిడ్ మేవెదర్ జపాన్‌లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొని 20 ఏళ్ల కిక్-బాక్సర్ టెన్షిన్ నాసుకావాపై సునాయాస విజయం సాధించి ఫ్రొఫెషనల్ బాక్సింగ్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం రెండే నిమిషాలు జరిగిన ఆ బౌట్లో నాసుకావాను ఓడించి 9 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. కాగా ఫ్లాయిడ్ మేవెదర్ తన ఫ్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో 50 విజయాలతో పాటు 26 ప్రపంచ టైటిళ్లను నెగ్గాడు. కొంతకాలం కిందట ఫ్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మేవెదర్ ప్రస్తుతం అమెరికా బాక్సింగ్ ప్రమోటర్‌గా కొనసాగుతున్నాడు. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) -
సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది!
ఎవరైనా ఫొటోలు తీసుకుంటుంటే.. మధ్యలో నేనూ వస్తా అంటూ చిన్న పిల్లలు దూరడం సర్వసాధారణం. అయితే, న్యూకేజిల్ ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు లండన్ బార్లో సెల్ఫీ తీసుకుంటే.. వాళ్ల అనుమతి తీసుకోకుండానే ఓ అతిథి వచ్చి ఆ ఫొటోలో దూరింది. ఇద్దరు అమ్మాయిల వెనకాల ఓ 'దెయ్యం' నిలబడినట్లుగా ఫొటోలో ఉంది. ఈ ఫొటోలో ఉన్న దెయ్యం.. బాగా వృద్ధ మహిళగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ఫొటో.. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. విక్టోరియా గ్రీవెస్ (22), కేలీ ఆట్కిన్సన్ (23) అనే ఇద్దరు కలిసి న్యూ కేజిల్లో 'గరల్స్ నైట్'ను ఎంజాయ్ చేశారు. ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకున్న తర్వాత ఈ ఫొటో తీసుకున్నారు. అయితే, ఫొటోలో తామిద్దరం కాక మరో వ్యక్తి ఉన్నట్లు వెంటనే గుర్తించారు. విక్టోరియన్ దుస్తులు ధరించిన వృద్ధ మహిళ ఆ ఫొటోలో కనిపించింది. వెంటనే వాళ్లు ఆ ఫొటోను స్నాప్‌చాట్‌లో అప్లోడ్ చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని, తమ ఫోన్లలోంచి డిలీట్ చేసేశారు. కానీ ఆ ఫొటో మాత్రం వరుసపెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉంది.