సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది! | Ghost appears in selfie of two girls | Sakshi
Sakshi News home page

సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది!

Published Fri, Oct 31 2014 3:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది!

సెల్ఫీ తీసుకుంటే.. దెయ్యం వచ్చింది!

ఎవరైనా ఫొటోలు తీసుకుంటుంటే.. మధ్యలో నేనూ వస్తా అంటూ చిన్న పిల్లలు దూరడం సర్వసాధారణం. అయితే, న్యూకేజిల్ ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలు లండన్ బార్లో సెల్ఫీ తీసుకుంటే.. వాళ్ల అనుమతి తీసుకోకుండానే ఓ అతిథి వచ్చి ఆ ఫొటోలో దూరింది. ఇద్దరు అమ్మాయిల వెనకాల ఓ 'దెయ్యం' నిలబడినట్లుగా ఫొటోలో ఉంది. ఈ ఫొటోలో ఉన్న దెయ్యం.. బాగా వృద్ధ మహిళగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ ఫొటో.. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

విక్టోరియా గ్రీవెస్ (22), కేలీ ఆట్కిన్సన్ (23) అనే ఇద్దరు కలిసి న్యూ కేజిల్లో 'గరల్స్ నైట్'ను ఎంజాయ్ చేశారు.  ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకున్న తర్వాత ఈ ఫొటో తీసుకున్నారు. అయితే, ఫొటోలో తామిద్దరం కాక మరో వ్యక్తి ఉన్నట్లు వెంటనే గుర్తించారు. విక్టోరియన్ దుస్తులు ధరించిన వృద్ధ మహిళ ఆ ఫొటోలో కనిపించింది. వెంటనే వాళ్లు ఆ ఫొటోను స్నాప్చాట్లో అప్లోడ్ చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని, తమ ఫోన్లలోంచి డిలీట్ చేసేశారు. కానీ ఆ ఫొటో మాత్రం వరుసపెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement