
పెబ్బేరు: ఇంగ్లండ్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగు ఐదో టెస్ట్ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పెబ్బేరుకు చెందిన షోయబ్‌కు అవకాశం లభించింది. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు అయిదో టెస్ట్‌కు ముంబైలోని సోనీ నెట్‌వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు. అతడు వ్యాఖ్యాతగా ఎంపికవడంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఆయనతోపాటు పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?
చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment