Shoaib
-
సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్‌కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్‌స్టా బయోలో తాను సూపర్‌వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్‌వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్ మాలిక్. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్ స్టార్ మీర్జా సోలోగా ఫోటోషూట్స్ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. -
గల్లీ కుర్రాడు.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటరీ
సాక్షి, మహబూబ్‌నగర్: చిన్నప్పటి నుంచి వివిధ క్రీడలకు సరదాగా కామెంటరీ చేసిన ఆ యువకుడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. క్రికెట్లో తనకున్న నైపుణ్యంతో అనతికాలంలోనే హిందీ, ఇంగ్లిష్, తెలుగులో కామెంటేటర్ (వ్యాఖ్యాత) గా ఎదిగాడు వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణానికి చెందిన మహ్మద్ షోయబ్. 2013 నుంచి కామెంటేటర్‌గా.. తను పాలిటెక్నిక్ చదివే రోజుల్లో 2013 నుంచి కళాశాలల్లో నిర్వహించే క్రీడల్లో పాల్గొంటూ కామెంటేటర్‌గా మారిపోయాడు షోయబ్. దీనిపై పట్టు సాధించి జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటరీ చేశాడు. 2014లో ఆల్ ఇండియా అండర్–19 టీ–20 లీగ్ మ్యాచ్‌లో కామెంటరీ చేశాడు. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయస్థాయి, ఎంపీఎల్ పోటీలకు హిందీలో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. 2016లో జరిగిన ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌లో (ఐసీసీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారిక సభ్యులతో కలిసి కామెంటరీ చేశాడు. 2017లో ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన బ్లైండ్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2019 ఐపీఎల్ మ్యాచ్‌లకు తెలుగులో రేడియో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇదే ఏడాది ఐసీసీ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఢిల్లీలో ఐడియా మొబైల్ చానల్ తరపున తెలుగులో కామెంటరీ చేశాడు. 2020లో ఇండియన్ సూపర్‌లీగ్ (ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు) ముంబై వేదికగా ఓ స్పోర్ట్స్ చానల్‌కు తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. సిద్దిపేటలో జరిగిన సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంత్రి హరీష్‌రావుతో అభినందనలు అందుకున్నాడు. ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్‌కు.. ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు ఓవల్గ్రౌండ్లో జరిగిన ఇండియా–ఇంగ్లాండ్ నాల్గో టెస్ట్‌కు షోయబ్ తెలుగులో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. భారత మాజీ ఆటగాడు వెంకటపతిరాజు, స్పోర్ట్స్ ఎనలిస్ట్ సీహెచ్.వెంకటేశ్, విజయ్ మహవడి, డబ్ల్యూవీ రామన్, సందీప్‌కుమార్‌తో కలిసి షోయబ్ కామెంటరీ చేశాడు. ఎంతో సంతోషంగా ఉంది ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌కు అవకాశం రావడం ఊహించలేదు. నాలుగో టెస్ట్‌లో కామెంటరీ చేశాను. ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడం సంతోషంగా ఉంది. నేను తెలుగులో కామెంటరీ చేయడం చాలా గర్వంగా ఉంది. – మహ్మద్ షోయబ్, కామెంటేటర్ -
ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి
పెబ్బేరు: ఇంగ్లండ్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగు ఐదో టెస్ట్ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పెబ్బేరుకు చెందిన షోయబ్‌కు అవకాశం లభించింది. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు అయిదో టెస్ట్‌కు ముంబైలోని సోనీ నెట్వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు. అతడు వ్యాఖ్యాతగా ఎంపికవడంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఆయనతోపాటు పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
గూఢచర్యం కేసు... వీసా ఏజెంట్ అరెస్టు
న్యూఢిల్లీ: దేశ రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న గూఢచర్యం కేసులో జోధ్‌పూర్ వీసా ఏజెంట్ షోయబ్‌ను పోలీసులు అరెస్టు చేసి, శుక్రవారం ఢిల్లీకి తరలించారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సతీష్ అరోరా ముందు ప్రవేశపెట్టారు. 11 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. రాకెట్ సూత్రధారి, పాక్ హైకమిషన్ ఉద్యోగి మెహమూద్ అక్తర్‌తో ఇతడిది నాలుగేళ్ల పరిచయమని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో అతడి వద్దనున్న ఫ్యాబ్లెట్‌ను ధ్వంసం చేయబోయాడని, దాన్ని స్వాధీనం చేసుకుని డేటారికవరీకి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు సుభాష్, మౌలానా రంజాన్‌తో కలిపి షోయబ్‌ను విచారిస్తామన్నారు. ‘ఈ మాడ్యూల్లో సుభాష్, మౌలానాలను రిక్రూట్ చేసుకుంది షోయబే. పాక్‌కు ఆరుసార్లు వెళ్లివచ్చాడు’ అని జాయింట్ కమిషనర్(క్రైమ్) రవీంద్ర యాదవ్ తెలిపారు. గురువారం సాయంత్రం షోయబ్‌ను జోధ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై తరహా దాడులకు యత్నం రక్షణ సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్న పాక్ హైకమిషన్ ఉద్యోగి అక్తర్... 2008 ముంబై తరహా ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్టు కేంద్ర హోం శాఖ ప్రతినిధి తెలిపారు. సముద్ర మార్గం ద్వారా వచ్చి ముంబైలో దాడులకు తెగబడినట్టుగానే... ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ సన్నద్ధమవుతున్నట్టు నిఘా సమాచారం అందిందన్నారు. అందులో భాగంగానే పశ్చిమ తీర ప్రాంతాలైన సర్ క్రీక్, కచ్లతో పాటు గుజరాత్, గోవాల్లోని మిలిటరీ స్థావరాలసమాచారాన్ని అక్తర్ సేకరించాడన్నారు. మౌలానా, సుభాష్‌లు క్రీక్, కచ్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లను అక్తర్‌కు చేరవేసేటప్పుడు గురువారం వారిని అరెస్టు చేశామన్నారు. -
సెల్ఫీ సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి
సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 12 మంది విద్యార్థుల బృందం సోమవారం ఉదయం మానసాహిల్స్ సమీపంలోనినీటి గుంతల వద్దకు చేరుకుంది. అందులో ముగ్గురు ఈత కొట్టేందుకు గుంతలోకి దిగారు. సెల్‌ఫోనులో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ముగ్గురూ నీట మునిగారు. దీంతో తోటివారు ఒకరిని రక్షించగలిగారు. జుబేద్, షోయబ్ అనే ఇద్దరు మాత్రం మునిగిపోయారు. స్థానికుల సాయంతో వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మాత్రం భయంతో పరారయ్యారని చెబుతున్నారు. -
పాక్ బౌలర్‌కి ట్విట్టర్లో వీరూ వింత పార్టీ!
భారత డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్.. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మధ్య మైదానంలో నడిచిన హోరాహోరీ పోరు క్రీడాభిమానులకు గుర్తుండే ఉంటుంది. ప్రచండ వేగంతో షోయబ్ సంధించిన బంతుల్ని అలవోకగా బౌండరీలకు తరలిస్తూ వీరూ అభిమానుల్ని అలరించాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ రిటైరైపోయారు. వీరి మధ్య మంచి దోస్తీ ఉంది. అందుకే ఆన్లైన్లో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. సందు దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారు. ట్విట్టర్లో బాగా యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్ తాజాగా తనదైన స్టైల్లో అఖ్తర్కి పుట్టనరోజు శుభాకాంక్షలు తెలిపాడు. షోయబ్ బర్త్‌డే వీరూకి పార్టీ ( #ShoaibKiBirthdayViruKiParty) యాష్‌ట్యాగ్‌తో ఓ ఫన్నీ వీడియోను అప్లోడ్ చేసి అతడికి కొంత సరదాగా విషెస్ చెప్పాడు. నిజానికి వీరూ షేర్ చేసిన ఈ వీడియో ఈపాటికి అందరూ చూసిందే. ఓ వ్యక్తి లుంగీ కట్టుకొని టపాసును కాల్చబోతూ.. ఆ చప్పుడుకి బెంబేలెత్తి కిందపడతాడు. ఆ వ్యక్తి తరహాలోనే షోయబ్ తన పార్టీకి వస్తారేమో అంటూ సెహ్వాగ్ చమత్కరించారు. Plz wish @shoaib100mph bhai using #ShoaibKiBirthdayViruKiParty Don't make his condition to attend party like this: pic.twitter.com/fNs7PPOrpr — Virender Sehwag (@virendersehwag) August 13, 2016 -
గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరిగేందుకు చోరీలు
ముషీరాబాద్ న్యూస్‌లైన్: విలాసాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్స్ పాల్పడుతున్న ముగ్గురు యువకులు ముషీరాబాద్ పోలీసులకు పట్టుపడ్డారు. పోలీసులు వీరి నుంచి 22 తులాల బంగారు నగలు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ముషీరాబాద్ పోలీసుస్టేషన్లో ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, డీఐ హసీబుల్హా నిందితుల వివరాలు వెల్లడించారు... పాతబస్తీలోని సత్తార్‌బాగ్ కు చెందిన షంషుద్దీన్ అలియాస్ టిప్పూ, మహ్మద్ ఇలియాస్, జహనుమాలోని చార్చమన్కు చెందిన మహ్మద్ షోయబ్, ఒట్టేపల్లికి చెందిన మీర్జా హయత్బేగ్ స్నేహితులు. వీరంతా ఇంటర్ ఫెయిల్ అయ్యారు. అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో జల్సాగా తిరిగేందుకు అవసరమైన డబ్బుల కోసం స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. పని ఉందంటూ టిప్పూ తన మామకు చెందిన పల్సర్ బైక్‌ను తీసుకెళ్తున్నాడు. స్నేహితులతో కలిసి దానిపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నాడు. ఏమీ ఎరుగనట్టు మళ్లీ బైక్‌ను తెచ్చి మామకు అప్పగిస్తున్నాడు. ఈ విధంగా మొత్తం 11 గొలుసు చోరీలకు పాల్పడ్డారు. అలాగే మరో బైక్‌ను దొంగిలించి దానిపై తిరుగుతూ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఇలా ఐదు ఠాణాల పరిధిలో 12 స్నాచింగ్స్ చేసి 22 తులాల బంగారాన్ని అపహరించారు. గాంధీనగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద గురువారం పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నెంబర్ ప్లేట్ లని బైక్‌పై వెళ్తున్న టిప్పూ, షోయబ్, హయత్బేగ్లను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితులు స్నాచింగ్స్ పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. మరో నిందితుడు మహ్మద్ ఇలియాస్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.