
బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim) చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మంచి భర్త దొరికిన ఆ ఇల్లాలు ఎంతటి అదృష్టవంతురాలంటూ నటి దీపిక కకర్‌ను (Dipika Kakar) మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరీ షోయబ్? అందరూ మెచ్చేలా ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే! షోయబ్ ఇబ్రహీం బుల్లితెర నటుడు. రెహ్నా హై తేరీ పాల్కన్ కీ ఛావో మే సీరియల్‌తో తన ప్రయాణం ప్రారంభించాడు.
'సాసురాల్ సిమర్ కా' ధారావాహికలో ప్రధాన పాత్ర పోషించి మెప్పించాడు. ఇందులో యాక్ట్ చేసిన నటి దీపికతో ప్రేమలోనూ పడ్డాడు. ఆమెతో కలిసి నాచ్ బలియే ఎనిమిదో సీజన్‌లో పార్టిసిపేట్ చేశాడు. షోయబ్ నటించిన ఏకైక మూవీ బెటాలియన్ 609. 2018లో దీపిక- షోయబ్ పెళ్లి జరిగింది. వీరికి 2023లో బాబు రుహాన్ పుట్టాడు. ఇదీ ఆయన పర్సనల్ స్టోరీ.

ఇంతకీ షోయబ్ ఏం చేశాడంటే?
పెళ్లయ్యాక అమ్మాయిలకు అత్తారిల్లే సర్వస్వం అంటారు. కానీ అదే మాట అబ్బాయి చెప్తే ఎలా ఉంటుంది? సర్వస్వం అని కాకపోయినా తన భార్య పుట్టిల్లు బాధ్యత కూడా భుజాన వేసుకుంటే ఎలా ఉంటుంది? అదే పని చేశాడు షోయబ్. అత్తగారికి ఇల్లు కొనిచ్చాడు. ఎప్పుడూ మాకోసమే ఆలోచించే తన కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఇంటిని బహుమతిగా ఇచ్చానంటున్నాడు. భర్త చేసిన పనికి దీపిక సంతోషంతో ఉప్పొంగిపోతోంది.
తన యూట్యూబ్ ఛానల్‌లో దీపిక మాట్లాడుతూ.. జీవితంలో అతి పెద్ద వరం ఏంటో తెలుసా? ఇల్లు. నువ్వు నీ తల్లి కోసం ఇదివరకే ఇంటిని బహుమతిగా ఇచ్చావు. ఇప్పుడు నీ అత్తగారికి ఇంటిని వరంగా అందించావు అని ఎమోషనలైంది. కొత్తింటి పత్రాలను షోయబ్ దంపతులు.. దీపిక తల్లికి అందించారు. వాటిని చేతిలోకి తీసుకున్న ఆమె సొంత కుటుంబం తనకు ఏదీ ఇవ్వకపోయినా నా కూతురు దీపిక ఫ్యామిలీ మాత్రం నాకు ఎన్నో చేస్తోంది అంటూ సంతోషంతో ఏడ్చేసింది.
చదవండి: Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment