పాక్‌ బౌలర్‌కి ట్విట్టర్‌లో వీరూ వింత పార్టీ! | Virender Sehwag wishs shoaib on twitter | Sakshi
Sakshi News home page

పాక్‌ బౌలర్‌కి ట్విట్టర్‌లో వీరూ వింత పార్టీ!

Published Sun, Aug 14 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

పాక్‌ బౌలర్‌కి ట్విట్టర్‌లో వీరూ వింత పార్టీ!

పాక్‌ బౌలర్‌కి ట్విట్టర్‌లో వీరూ వింత పార్టీ!

భారత డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అఖ్తర్‌ మధ్య  మైదానంలో నడిచిన హోరాహోరీ పోరు క్రీడాభిమానులకు గుర్తుండే ఉంటుంది. ప్రచండ వేగంతో షోయబ్‌ సంధించిన బంతుల్ని అలవోకగా బౌండరీలకు తరలిస్తూ వీరూ అభిమానుల్ని అలరించాడు.

ఇప్పుడు ఈ ఇద్దరూ రిటైరైపోయారు. వీరి మధ్య మంచి దోస్తీ ఉంది. అందుకే ఆన్‌లైన్‌లో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. సందు దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారు. ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్‌ తాజాగా తనదైన స్టైల్‌లో అఖ్తర్‌కి పుట్టనరోజు శుభాకాంక్షలు తెలిపాడు. షోయబ్‌ బర్త్‌డే వీరూకి పార్టీ ( #ShoaibKiBirthdayViruKiParty) యాష్‌ట్యాగ్‌తో ఓ ఫన్నీ వీడియోను అప్‌లోడ్‌ చేసి అతడికి కొంత సరదాగా విషెస్‌ చెప్పాడు.

నిజానికి వీరూ షేర్‌ చేసిన ఈ వీడియో ఈపాటికి అందరూ చూసిందే. ఓ వ్యక్తి లుంగీ కట్టుకొని టపాసును కాల్చబోతూ.. ఆ చప్పుడుకి బెంబేలెత్తి కిందపడతాడు. ఆ వ్యక్తి తరహాలోనే షోయబ్‌ తన పార్టీకి వస్తారేమో అంటూ సెహ్వాగ్ చమత్కరించారు.

Plz wish @shoaib100mph bhai using #ShoaibKiBirthdayViruKiParty
Don't make his condition to attend party like this: pic.twitter.com/fNs7PPOrpr

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement