సెల్ఫీ సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి | Two students killed while taking a selfie | Sakshi
Sakshi News home page

సెల్ఫీ సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి

Published Mon, Oct 3 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

సెల్ఫీ సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి

సెల్ఫీ సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి

సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 12 మంది విద్యార్థుల బృందం సోమవారం ఉదయం మానసాహిల్స్ సమీపంలోనినీటి గుంతల వద్దకు చేరుకుంది. అందులో ముగ్గురు ఈత కొట్టేందుకు గుంతలోకి దిగారు. సెల్‌ఫోనులో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు.

ఈ ప్రయత్నంలో ముగ్గురూ నీట మునిగారు. దీంతో తోటివారు ఒకరిని రక్షించగలిగారు. జుబేద్, షోయబ్ అనే ఇద్దరు మాత్రం మునిగిపోయారు. స్థానికుల సాయంతో వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మాత్రం భయంతో పరారయ్యారని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement