
హైదరాబాద్: బయోఫిలిక్, సస్టెయినబుల్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లోని తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటరింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అక్కడి కమ్యూనిటీ ప్రయోజనం కోసం గాలి నాణ్యతను పర్యవేక్షించడమే కాకుండా పర్యావరణ సుస్థిరత గురించి అవగాహన పెంచడానికి కూడా దోహదం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్, ఎకనామిక్ కౌన్సెలర్ టీ పిరిహ్, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అడిషనల్ కమిషనర్ వీవీఎల్ సుభద్రాదేవి, కేంద్ర ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి అశోక్ పావడియా వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కత్తిరించి మొక్కలు నాటారు. అనంతరం ప్రాజెక్ట్ విస్తృత ప్రభావాలను వివరించారు.
ఈ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్ మాట్లాడుతూ.. సుస్థిర చర్యల ప్రపంచ ప్రాముఖ్యతను తెలియజేశారు. "గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, ఎన్‌జీఓలు, కార్పొరేట్లు, వ్యాపార సంస్థలు - సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంటే కేవలం భౌతికంగా నివాస ప్రాంతాలను సృష్టించడం కాదని, సుస్థిర సమాజాలను నిర్మించడమని తాము నమ్ముతున్నామన్నారు. పర్యావరణ బాధ్యతను పెంపొందించే దిశగా తాము తీసుకుంటున్న అనేక చర్యల్లో శంషాబాద్ లోని ఏక్యూఐ మానిటరింగ్ స్టేషన్ ఒకటి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment