sony networks
-
‘ఆసియా క్రికెట్’ మ్యాచ్‌లన్నీ ఆ నెట్‌వర్క్‌లోనే లైవ్ స్ట్రీమింగ్..!
భారత్‌కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్ఐ) ఆసియా క్రికెట్‌కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్–19 ఆసియా కప్, ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ మ్యాచ్‌లను సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.ఈ ఒప్పందంలో టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్ నైపుణ్యానికి ఆసియా కప్ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్ సహా ఏసీసీ మ్యాచ్‌లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు. -
అమితాబ్ బచ్చన్ సినిమాతో విసిగిపోయా.. ఇంకెన్నిసార్లు వేస్తారు..!
ఓ సినిమాను అభిమానులెవరైనా ఎన్నిసార్లు చూస్తారు. మహా అయితే ఒకటి లేదా రెండుసార్లు. ఇక హీరో ఫ్యాన్స్ అయితే ఎక్కువసార్లు చూస్తారని మనకు తెలుసు. కానీ కొన్ని ఛానెల్స్‌లో పదే పదే వేసినా సినిమా వేసి మీకు ఎప్పుడైనా బోరు కొట్టించారా?. ఏదైనా ఛానెల్ చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా?. కానీ ఓ వ్యక్తికి అలాంటి అనుభవం ఎదురైంది. అలా విసిగిపోయిన ఓ ప్రేక్షకుడు ఏకంగా ఆ ఛానెల్ యాజమాన్యానికే లేఖ రాశారు. బాలీవుడ్ దిగ్గజం నటించిన సూర్యవంశం మూవీ పునరావృత ప్రసారాలతో విసిగిపోయిన ఓ సామాన్యుడు లేఖ ద్వారా తన బాధను వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ సినిమా సూర్యవంశం. సోనీ మ్యాక్స్ టీవీలో ఇప్పటికే చాలా సార్లు ప్రసారమైంది. అయితే మిగతా సినిమాల కంటే ఎక్కువగా ప్రసారం చేశారు. ఈ సినిమాకి ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఛానెల్ అధికారులు తరచుగా ప్రసారం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా యాజమాన్యానికే లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. లేఖలో రాస్తూ.. 'నాదొక విన్నపం. మీ ఛానెల్లో సూర్యవంశం అనే సినిమా ప్రసారం అవుతోంది. ఆ సినిమాను మా కుటుంబమంతా కలిసి చూస్తాం. ఎన్నోసార్లు మేం వీక్షించాం. నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మీ ఛానెల్లో ఎన్నిసార్లు ఈ సినిమా ప్రసారం చేశారు. భవిష్యత్తులో ఇంకెన్ని సార్లు ఈ సినిమాను ప్రసారం చేస్తారు. ఇది మా మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ విషయం చెప్పేందుకు చాలా కష్టంగా ఉంది.' అంటూ లేఖలో వివరించారు. ఈ లేఖ చూసిన నెటిజన్స్ అతన్ని ప్రశంసిస్తున్నారు. కొందరేమో ఛానెల్ మార్చుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. కాగా.. సూర్యవంశం మూవీ 1999లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేశారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అల్టిమేట్ ఖో–ఖో లీగ్ రంగం సిద్ధం.. ఎన్ని జట్లు అంటే!
పుణే: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్ సిద్ధమైంది. గ్రామీణ క్రీడ ఖో–ఖో లీగ్‌కు నేడు తెర లేవనుంది. అల్టిమేట్ ఖో–ఖో లీగ్ పేరిట జరగనున్న ఈ టోర్నీలో ఆరు జట్లు (చెన్నై క్విక్‌గన్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఖిలాడీస్, ఒడిషా జగర్‌నాట్స్, రాజస్తాన్ వారియర్స్, తెలుగు యోధాస్) టైటిల్ బరిలో ఉన్నాయి. తొలి రోజు గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఖిలాడీస్, తెలుగు యోధాస్‌తో చెన్నై క్విక్‌గన్స్ తలపడతాయి. సెప్టెంబర్ నాలుగో తేదీన ఫైనల్ జరుగుతుందని అల్టిమేట్ ఖో–ఖో లీగ్ కమిషనర్, సీఈఓ టెన్జింగ్ నియోగి తెలిపారు. ప్రతిరోజు రెండు మ్యాచ్‌లు జరుగు తాయి. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ టెన్–4 చానెల్స్‌లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
రికార్డులు బద్దలు కొడుతున్న ఐపీఎల్ మీడియా రైట్స్..
ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం జోరుగా సాగుతుంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ముంబై లో ఇ-వేల ప్రారంభమైంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 40 వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది. ముందుగా ఉపఖండంలో టీవీ హక్కులు.. ఆ తర్వాత డిజిటల్ హక్కుల విభాగాలకు వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది. మొత్తానికి ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని సమాచారం. ఈ అంకె ప్రతి అరగంటకూ పెరుగుతున్నది. ఈ-వేలం సోమవారం కూడా కొనసాగనుంది. దీనిని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ (రూ. 50వేల కోట్లు) చేరుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది. పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు అర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చదవండి: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Bidding for IPL TV, digital rights goes past Rs 42,000 cr Read @ANI Story | https://t.co/Ah5MWfeuKv#IPL #IPLMediaRights #BCCI pic.twitter.com/z87ATGtUiX — ANI Digital (@ani_digital) June 12, 2022 -
ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి
పెబ్బేరు: ఇంగ్లండ్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగు ఐదో టెస్ట్ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పెబ్బేరుకు చెందిన షోయబ్‌కు అవకాశం లభించింది. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు అయిదో టెస్ట్‌కు ముంబైలోని సోనీ నెట్వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు. అతడు వ్యాఖ్యాతగా ఎంపికవడంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఆయనతోపాటు పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇంటి పట్టునే ఉండిపోయిన ‘ఫ్యామిలీ’ల కోసం ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ సమయంలో కుటుంబాలను ఉత్సాహపరచడానికి, వారికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఈ షార్ట్‌ఫిల్మ్ ఉపయోగపడనుంది. అమితాబ్ ప్రోద్బలంతో సోనీ నెట్వర్క్ సహాయంతో ఈ షార్ట్‌ఫిల్మ్ తయారవుతోంది. ప్రసిద్ధ యాడ్ డైరెక్టర్ ప్రసూన్ పాండే వర్చువల్‌గా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ కుటుంబాలకు ఐదు విషయాలను చెప్పనుంది. ‘ఇంట్లో ఉండండి’, ‘సురక్షితంగా ఉండండి’, ‘చేతులు కడుక్కోండి’, ‘ఇంటి నుంచి పని చేయండి’, ‘భౌతిక దూరం పాటించండి’... అని సృజనాత్మకంగా చెప్పనుంది. భారతీయులందరినీ ఉత్సాహపరచాలి కనుక ఈ షార్ట్‌ఫిల్మ్‌లో భారీ తారాగణం లిప్తపాటు కనిపిస్తారట. వారిలో రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తదితరులు ఉంటారు. ఏప్రిల్ 6న రాత్రి 9 గంటలకు ఈ షార్ట్‌ఫిల్మ్ దేశమంతా ప్రముఖ చానెళ్లలో ప్రసారం కానుంది. ఈ షార్ట్‌ఫిల్మ్ గురించే కాక దేశంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తున్న చిన్న స్థాయి కార్మికులు లక్షమందికి సోనీ నెట్వర్క్, కల్యాణ్ జువెలర్స్‌తో కలిసి అమితాబ్ ఒక నెల వెచ్చాలను అందించనున్నారు. సూపర్మార్కెట్లతో ఏర్పాటు చేసుకున్న కూపన్లు కార్మికులకు అందేలా చేసి వెచ్చాలను అందించనున్నారు. -
సోనికి కాసుల వర్షం కురిపించిన ఐపీఎల్!
ముంబై: ప్రజలకు అత్యంత వినోదం కల్గించే వాటిలో సినిమా, క్రీడలు రెండూ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే క్రీడల్లో భాగమైన క్రికెట్ అంటే భారత్ లో విపరీతమైన క్రేజ్. దీంతో ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్‌ల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మేటిగా నిలిచింది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ లాంటిదనే చెప్పాలి. మరి ఈ ఐపీఎల్ సీజన్ అభిమానులకు అత్యంత ఎక్కువ వినోదాన్ని పంచడమే కాదు.. ఆ మ్యాచ్‌ల ప్రసారహక్కులను దక్కించుకున్న సోనికి కాసుల వర్షం కురిపించింది. ఐపీఎల్-9వ సీజన్లో ప్రకటన ద్వారా సోనికి వచ్చిన ఆదాయం రూ.1200 కోట్లట. ఈ విషయాన్ని సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా(ఎస్పీఎన్) ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది ప్రకటనలపై స్పాన్సర్లు విపరీతమైన ఆసక్తి కనబరచడంతోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇది గతేడాది ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం కంటే 20 శాతం ఎక్కువగా ఉండటం విశేషం.