సోనికి కాసుల వర్షం కురిపించిన ఐపీఎల్! | Sony garners advertising revenue of Rs 1,200 crore from IPL 9 | Sakshi
Sakshi News home page

సోనికి కాసుల వర్షం కురిపించిన ఐపీఎల్!

Published Sun, Jun 5 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

సోనికి కాసుల వర్షం కురిపించిన ఐపీఎల్!

సోనికి కాసుల వర్షం కురిపించిన ఐపీఎల్!

ముంబై: ప్రజలకు అత్యంత వినోదం కల్గించే వాటిలో సినిమా, క్రీడలు రెండూ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే  క్రీడల్లో భాగమైన క్రికెట్ అంటే భారత్ లో విపరీతమైన క్రేజ్.  దీంతో ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్ల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మేటిగా నిలిచింది.
 

ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ లాంటిదనే చెప్పాలి. మరి ఈ ఐపీఎల్ సీజన్ అభిమానులకు అత్యంత ఎక్కువ వినోదాన్ని పంచడమే కాదు.. ఆ మ్యాచ్ల ప్రసారహక్కులను దక్కించుకున్న సోనికి కాసుల వర్షం కురిపించింది. ఐపీఎల్-9వ సీజన్లో ప్రకటన ద్వారా సోనికి వచ్చిన ఆదాయం రూ.1200 కోట్లట.  ఈ విషయాన్ని సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా(ఎస్పీఎన్) ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా తాజాగా వెల్లడించారు.  ఈ ఏడాది ప్రకటనలపై స్పాన్సర్లు విపరీతమైన ఆసక్తి కనబరచడంతోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇది గతేడాది ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం కంటే 20 శాతం ఎక్కువగా ఉండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement