ఓ సినిమాను అభిమానులెవరైనా ఎన్నిసార్లు చూస్తారు. మహా అయితే ఒకటి లేదా రెండుసార్లు. ఇక హీరో ఫ్యాన్స్ అయితే ఎక్కువసార్లు చూస్తారని మనకు తెలుసు. కానీ కొన్ని ఛానెల్స్‌లో పదే పదే వేసినా సినిమా వేసి మీకు ఎప్పుడైనా బోరు కొట్టించారా?. ఏదైనా ఛానెల్ చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా?. కానీ ఓ వ్యక్తికి అలాంటి అనుభవం ఎదురైంది. అలా విసిగిపోయిన ఓ ప్రేక్షకుడు ఏకంగా ఆ ఛానెల్ యాజమాన్యానికే లేఖ రాశారు. బాలీవుడ్ దిగ్గజం నటించిన సూర్యవంశం మూవీ పునరావృత ప్రసారాలతో విసిగిపోయిన ఓ సామాన్యుడు లేఖ ద్వారా తన బాధను వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ సినిమా సూర్యవంశం. సోనీ మ్యాక్స్ టీవీలో ఇప్పటికే చాలా సార్లు ప్రసారమైంది. అయితే మిగతా సినిమాల కంటే ఎక్కువగా ప్రసారం చేశారు. ఈ సినిమాకి ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఛానెల్ అధికారులు తరచుగా ప్రసారం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా యాజమాన్యానికే లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
లేఖలో రాస్తూ.. 'నాదొక విన్నపం. మీ ఛానెల్‌లో సూర్యవంశం అనే సినిమా ప్రసారం అవుతోంది. ఆ సినిమాను మా కుటుంబమంతా కలిసి చూస్తాం. ఎన్నోసార్లు మేం వీక్షించాం. నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మీ ఛానెల్‌లో ఎన్నిసార్లు ఈ సినిమా ప్రసారం చేశారు. భవిష్యత్తులో ఇంకెన్ని సార్లు ఈ సినిమాను ప్రసారం చేస్తారు. ఇది మా మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ విషయం చెప్పేందుకు చాలా కష్టంగా ఉంది.' అంటూ లేఖలో వివరించారు. ఈ లేఖ చూసిన నెటిజన్స్ అతన్ని ప్రశంసిస్తున్నారు. కొందరేమో ఛానెల్ మార్చుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. కాగా.. సూర్యవంశం మూవీ 1999లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment