నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే? | Amitabh Bachchan Birthday Speical Story: Luxurious Properties List, Net Worth 2023 Details Inside - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan Properties And Net Worth: బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?

Published Wed, Oct 11 2023 9:20 AM | Last Updated on Wed, Oct 11 2023 10:13 AM

Amitabh Bachchan Properties List Goes Viral On His Birthday  - Sakshi

బాలీవుడ్‌లో బిగ్‌బీ పేరు తెచ్చుకున్న నటుడు అమితాబ్ బచ్చన్‌. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. 1970లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దాదాపు ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా సినీరంగంలో కొనసాగుతున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఆయన పూర్తిపేరు  అమితాబ్ హరివంశ్ బచ్చన్  కాగా.. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో గుర్తింపు పొందారు.

అమితాబ్ బచ్చన్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో అక్టోబర్‌ 11, 1942లో జన్మించారు. తాజాగా 81వ వసంతంలోకి ఆయన అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజును జరుపుకోనున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: ఆమెపై సామూహిక అత్యాచారం.. బిగ్‌బాస్‌ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!)

అయితే ఆయన కేవలం రూ.500 జీతంతో మొదట తన కెరీర్‌ను ప్రారంభించారు. 40 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తోన్న అమితాబ్‌కు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.3,600 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో నటించడానికి రూ.5 నుంచి 10 కోట్ల వరకు  పారితోషికంగా తీసుకుంటున్నారు. కేవలం వ్యాపార ప్రకటనలకైతే దాదాపు రూ.5 కోట్లు వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా పలు స్టార్టప్ వ్యాపారాల్లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. సినిమాలు, ప్రకటనల ద్వారా ఏడాది దాదాపు రూ.60 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 

ముంబైలో ఖరీదైన నివాసం

అమితాబ్‌ బచ్చన్‌కు ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జుహు ప్రాంతంలోని  జల్సా అనే బంగ్లాలో నివసిస్తున్నారు.  ఈ నివాసం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇదే కాకుండా ఆయన నగరంలో మరో మూడు బంగ్లాలు ఉన్నాయి. వీటి విలువ సైతం కోట్ల రూపాయల్లో ఉంటుంది. 

(ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్)

అంతే కాకుండా ఆయన గ్యారేజీ ప్రముఖ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు ఉన్నాయి.  లెక్సస్, రోల్స్ రాయిస్, బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్‌ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌తో పాటు దాదాపు 10కి పైగా ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు. ఆయనకు రూ.260 కోట్లు విలువచేసే ప్రత్యేకమైన జెట్ విమానం కూడా ఉంది.

కాగా.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898ఏడీ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో గణపత్‌ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కౌన్‌ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement