Pebberu
-
ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి
పెబ్బేరు: ఇంగ్లండ్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగు ఐదో టెస్ట్ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పెబ్బేరుకు చెందిన షోయబ్‌కు అవకాశం లభించింది. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు అయిదో టెస్ట్‌కు ముంబైలోని సోనీ నెట్వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు. అతడు వ్యాఖ్యాతగా ఎంపికవడంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఆయనతోపాటు పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
పెబ్బేరు (కొత్తకోట) : గతనెలలో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం సీఐ సోమ్‌నారాయణ సింగ్ స్థానికపోలీస్స్టేషన్లో చోరీలకు పాల్పడిన వివరాలు వెల్లడించారు. జనవరి 17న బ్రహ్మంగారివీధిలో ఒకేరోజు మూ డు ఇళ్లలో చోరీ జరిగింది. రెండిళ్లలో ఎలాంటి సొమ్ములు పోలేదు. రాఘవేందర్‌గౌడ్ ఇంట్లో బంగారం తోపాటు నగదు రూ 40వేలను ఎత్తుకెళ్లాడు. మళ్లీ ఆదివారం పాత బీసీ కాలనీలో చోరీచేయడానికి అనుమానాస్ప దంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి పటు ్టకుని పోలీసులకు సమాచారం అంది ంచాడు. వారొచ్చి విచారణ చేసి పట్టణానికి చెందిన ఎండి షఫీగా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ చోరీలు షఫీ జిల్లాతోపాటు సూర్యపేట, నల్లగొండ, జహీరాబాద్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆత్మకూర్, కొత్తకోట తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. అన్ని ప్రాంతాల్లో ఇతనిపై కేసులు నమోదవ్వగా నవంబర్‌లో సూర్యపేట జైలు నుంచి విడుదల అయ్యాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని షఫి జనవరిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. పట్టుబడిన దొంగనుంచి నగదు, బంగారు ఆ భరణాలు, ఇతర వస్తువులను స్వాధీ నం చేసుకుని రిమాండ్‌కు పంపినట్టు సీ ఐ సూర్యనారాయణ వివరించారు. వనపర్తిలో జరిగిన వరుస చోరీలకు పాల్పడిన దొంగలను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో ఎస్ఐ ఓడి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇన్నోవా బోల్తా: నలుగురి మృతి
పెబ్బేరు: మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఇన్నోవా వాహనం బోల్తాపడిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నగరానికి చెందిన కొందరు ఇన్నోవా వాహనంలో కర్నూలు వైపు వెళ్తున్నారు. వారి వాహనం పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలోని పెట్రోలు బంక్ వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈఘటనలో వాహనంలోని ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి, బాలుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జూరాల కాలువలో భారీ మొసలి
పెబ్బేరు: జూరాల ప్రధాన ఎడమ కాలువలో భారీ మొసలి స్థానికుల కంటపడింది. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన తోమాలపల్లి గ్రామస్తులు దాన్ని గుర్తించి బంధించారు. కాలువకు నీటి విడుదల నిలిచిపోవడంతో గ్రామ యువకులు కొందరు చేపల వేటకు వెళ్లారు. కాలువ అంచున సుమారు 10 అడుగుల పొడవున్న మొసలి కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. అందరు గుమికూడి దాన్ని తాళ్లతో బంధించి గ్రామంలోని దేవాలయం వద్ద ఉన్న వేప చెట్టుకు కట్టేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వనపర్తి బీట్‌ఆఫీసర్లు నాగరాజు, రజనీకాంత్, శ్రీనివాసులు వచ్చి దాన్ని తీసుకెళ్లి జూరాల డ్యాంలో వదిలేశారు. వర్షాకాలంలో వచ్చిన నీటి ప్రవాహానికి మొసలి కాలువలోకి వచ్చి ఉండవచ్చని అధికారులు తెలిపారు. -
లోకేశ్ రోడ్‌షో ఘటనలో ఇరువర్గాలపై కేసులు
పెబ్బేరు: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరులో ఆదివారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ రోడ్ షోలో జరిగిన వివాదాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రోడ్‌షోలో టీఆర్ఎస్ కార్యకర్తలు మామిడిపళ్లు, మద్యం బాటిళ్లను విసరగా ప్రతిగా టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్ స్థానిక నేత కారును దహనం చేసిన సంగతి విదితమే. ఈ ఘటనకు బాధ్యులైన వారికోసం పోలీసులు దర్యాప్తు వేగంగా చేపట్టారు. సుభాష్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరా విజువల్స్తోపాటు ఇతర ఆధారాలతో గొడవలకు బాధ్యులైన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. నారా లోకేష్ వాహనంపై మద్యం సీసాలు, వాటర్‌బాటిళ్లు, మామిడిపళ్లు విసిరిన సంఘటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎల్లారెడ్డి, శివసాయిలపై ఐపీసీ 324, రెడ్‌విత్ 511, 127 ఆర్పీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీంతోపాటు టీఆర్ఎస్ నేత పెద్ద ఎల్లారెడ్డి కారును దహనం చేసిన కేసులో టీడీపీ నేతలు, కార్యకర్తలు మొత్తం 17 మంది పై ఐపీసీ 147,341,323,435,351లతోపాటు రెడ్‌విత్149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. వీరిలో ఎం.రాజశేఖర్, రామక్రిష్ణ, రంగస్వామి, తిరుపతయ్యలను రిమాండ్‌కు పంపారు. మిగిలిన 13 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక టీడీపీకి చెందిన టవేరా వాహనంపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనలో ఆరుగురు టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలపై ఐపీసీ 147,324,428,427, రెడ్‌విత్ 149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులు గౌని కోదండరామిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, బీరం రాజశేఖర్ రెడ్డి, చిన్న ఎల్లారెడ్డి, రంగి, పరంధాములును పోలీసులు కోర్టులో హాజరు పరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ చేశారు. -
‘అలివి’ దెబ్బ
పెబ్బేరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని పెబ్బేరు, వీపనగండ్ల, కొల్లాపూర్, అలంపూర్ మండలాల పరిధిలో కృష్ణానది తీర గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచాలకట్ట, గూ డెం, బెక్కెం, యాపర్ల, గుమ్మడం, తిప్పాయపల్లి, అలంపూర్ తదితర గ్రామా ల్లో ఏటా ఆంధ్రాజాలర్లు గ్రూపులుగా విడిపోయి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేట నిషిద్ధం కాబట్టి ముం దుగానే వీరుఆయా గ్రామాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులకు డబ్బులు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నారు. అనంతరం రాత్రివేళ యథేచ్ఛగా అలివి వలలతో చేపల వేటను కొనసాగిస్తూ మత్స్యసంపదను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం గురించి మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముందే లీకులు... మత్స్యశాఖ అధికారులు ఇటీవల పెబ్బేరు మండల పరిధిలోని నదీ తీర గ్రామాల్లో దాడులు నిర్వహిం చారు. ఈ విషయం ముందే లీకవుతోంది. లేదా అధికారుల రాకను గమనించి వేటకు వచ్చిన వారు తమ స్థావరాలను వదిలి పారిపోతున్నారు. దీంతో అధికారులకు కేవలం ఎండు చేపలు, వారి నిత్యావసర వస్తువులు, సామగ్రి మాత్రమే లభిస్తున్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవడం మినహా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఓ రెండు రోజులు నిలిచిపోయినా ఆ తర్వాత మళ్లీ వారి చర్యలు ఆగడం లేదు. మారుతున్న స్థావరాలు కృష్ణానది తీర గ్రామాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా జాలర్లు పక్కా వ్యుహంతో వ్యవహరిస్తూ తమ స్థావరాలను తరచూ మార్చుతున్నారు. దీంతో మత్స్యశాఖ అధికారుల దాడులు జరిగిన ప్రాంతం నుంచి నదిలో అవతలి వైపునకు వెళ్లడం అటువైపు దాడులు జరిగితే ఇటువైపు రావడం చేస్తున్నారు. పెబ్బేరు మండలంలోని గుమ్మడం, తిప్పాయిపల్లి, యాపర్లలో అధికారులు దాడులు నిర్వహించగానే అక్కడి నుంచి కొన్ని రోజులు అలంపూర్ మండలం వైపు వెళ్లి వేట కొనసాగిస్తున్నారు. పైగా ఆంధ్రా జాలర్ల వద్ద ఇంజిన్‌తో కూడిన మరబోట్లు ఉండటంతో నదిలో యథేచ్ఛగా సంచరిస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. నది ఒడ్డున ఉన్న స్థావరాల వద్ద చేపల వేటకు ఉపయోగించే వలలను ఉంచకుండా జాగ్రత్త పడుతున్నారు. స్థావరాల వద్ద నిల్వ ఉంచిన చేపలు మినహా ఇతర ఏ సామగ్రి కూడా లభించకుండా చేస్తున్నారు. ఏకకాలంలో దాడులు నిర్వహిస్తాం కృష్ణానదిలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అలివి వలల వేట కొనసాగుతుందన్న విషయం నిజమే. చేపల వేటకు ఉపయోగిస్తున్న వలలను వారు నదిలోని బోట్లలో నిల్వ ఉంచుకుంటున్నారు. నదిలో ఉన్న వలలను స్వాధీనం చేసుకునేందుకు త్వరలోనే జిల్లా కలెక్టర్ అనుమతితో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తాం. - మహిపాల్, మత్స్యశాఖ ఏడీ, మహబూబ్‌నగర్