పెబ్బేరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని పెబ్బేరు, వీపనగండ్ల, కొల్లాపూర్, అలంపూర్ మండలాల పరిధిలో కృష్ణానది తీర గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచాలకట్ట, గూ డెం, బెక్కెం, యాపర్ల, గుమ్మడం, తిప్పాయపల్లి, అలంపూర్ తదితర గ్రామా ల్లో ఏటా ఆంధ్రాజాలర్లు గ్రూపులుగా విడిపోయి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేట నిషిద్ధం కాబట్టి ముం దుగానే వీరుఆయా గ్రామాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులకు డబ్బులు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నారు. అనంతరం రాత్రివేళ యథేచ్ఛగా అలివి వలలతో చేపల వేటను కొనసాగిస్తూ మత్స్యసంపదను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం గురించి మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ముందే లీకులు...
మత్స్యశాఖ అధికారులు ఇటీవల పెబ్బేరు మండల పరిధిలోని నదీ తీర గ్రామాల్లో దాడులు నిర్వహిం చారు. ఈ విషయం ముందే లీకవుతోంది. లేదా అధికారుల రాకను గమనించి వేటకు వచ్చిన వారు తమ స్థావరాలను వదిలి పారిపోతున్నారు. దీంతో అధికారులకు కేవలం ఎండు చేపలు, వారి నిత్యావసర వస్తువులు, సామగ్రి మాత్రమే లభిస్తున్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవడం మినహా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఓ రెండు రోజులు నిలిచిపోయినా ఆ తర్వాత మళ్లీ వారి చర్యలు ఆగడం లేదు.
మారుతున్న స్థావరాలు
కృష్ణానది తీర గ్రామాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా జాలర్లు పక్కా వ్యుహంతో వ్యవహరిస్తూ తమ స్థావరాలను తరచూ మార్చుతున్నారు. దీంతో మత్స్యశాఖ అధికారుల దాడులు జరిగిన ప్రాంతం నుంచి నదిలో అవతలి వైపునకు వెళ్లడం అటువైపు దాడులు జరిగితే ఇటువైపు రావడం చేస్తున్నారు.
పెబ్బేరు మండలంలోని గుమ్మడం, తిప్పాయిపల్లి, యాపర్లలో అధికారులు దాడులు నిర్వహించగానే అక్కడి నుంచి కొన్ని రోజులు అలంపూర్ మండలం వైపు వెళ్లి వేట కొనసాగిస్తున్నారు. పైగా ఆంధ్రా జాలర్ల వద్ద ఇంజిన్‌తో కూడిన మరబోట్లు ఉండటంతో నదిలో యథేచ్ఛగా సంచరిస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. నది ఒడ్డున ఉన్న స్థావరాల వద్ద చేపల వేటకు ఉపయోగించే వలలను ఉంచకుండా జాగ్రత్త పడుతున్నారు. స్థావరాల వద్ద నిల్వ ఉంచిన చేపలు మినహా ఇతర ఏ సామగ్రి కూడా లభించకుండా చేస్తున్నారు.
ఏకకాలంలో దాడులు నిర్వహిస్తాం
కృష్ణానదిలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అలివి వలల వేట కొనసాగుతుందన్న విషయం నిజమే. చేపల వేటకు ఉపయోగిస్తున్న వలలను వారు నదిలోని బోట్లలో నిల్వ ఉంచుకుంటున్నారు. నదిలో ఉన్న వలలను స్వాధీనం చేసుకునేందుకు త్వరలోనే జిల్లా కలెక్టర్ అనుమతితో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తాం.
- మహిపాల్, మత్స్యశాఖ ఏడీ, మహబూబ్‌నగర్
‘అలివి’ దెబ్బ
Published Sat, Jan 25 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement