వివరాలను వెల్లడిస్తున్న సీఐ సూర్యనారాయణ
పెబ్బేరు (కొత్తకోట) : గతనెలలో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న అంతర్‌రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం సీఐ సోమ్‌నారాయణ సింగ్ స్థానికపోలీస్‌స్టేషన్‌లో చోరీలకు పాల్పడిన వివరాలు వెల్లడించారు. జనవరి 17న బ్రహ్మంగారివీధిలో ఒకేరోజు మూ డు ఇళ్లలో చోరీ జరిగింది. రెండిళ్లలో ఎలాంటి సొమ్ములు పోలేదు. రాఘవేందర్‌గౌడ్ ఇంట్లో బంగారం తోపాటు నగదు రూ 40వేలను ఎత్తుకెళ్లాడు. మళ్లీ ఆదివారం పాత బీసీ కాలనీలో చోరీచేయడానికి అనుమానాస్ప దంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి పటు ్టకుని పోలీసులకు సమాచారం అంది ంచాడు. వారొచ్చి విచారణ చేసి పట్టణానికి చెందిన ఎండి షఫీగా గుర్తించారు.
ఇతర ప్రాంతాల్లోనూ చోరీలు
షఫీ జిల్లాతోపాటు సూర్యపేట, నల్లగొండ, జహీరాబాద్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆత్మకూర్, కొత్తకోట తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. అన్ని ప్రాంతాల్లో ఇతనిపై కేసులు నమోదవ్వగా నవంబర్‌లో సూర్యపేట జైలు నుంచి విడుదల అయ్యాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని షఫి జనవరిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. పట్టుబడిన దొంగనుంచి నగదు, బంగారు ఆ భరణాలు, ఇతర వస్తువులను స్వాధీ నం చేసుకుని రిమాండ్‌కు పంపినట్టు సీ ఐ సూర్యనారాయణ వివరించారు. వనపర్తిలో జరిగిన వరుస చోరీలకు పాల్పడిన దొంగలను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ ఓడి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment