interstate rober
-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
పెబ్బేరు (కొత్తకోట) : గతనెలలో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం సీఐ సోమ్‌నారాయణ సింగ్ స్థానికపోలీస్స్టేషన్లో చోరీలకు పాల్పడిన వివరాలు వెల్లడించారు. జనవరి 17న బ్రహ్మంగారివీధిలో ఒకేరోజు మూ డు ఇళ్లలో చోరీ జరిగింది. రెండిళ్లలో ఎలాంటి సొమ్ములు పోలేదు. రాఘవేందర్‌గౌడ్ ఇంట్లో బంగారం తోపాటు నగదు రూ 40వేలను ఎత్తుకెళ్లాడు. మళ్లీ ఆదివారం పాత బీసీ కాలనీలో చోరీచేయడానికి అనుమానాస్ప దంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి పటు ్టకుని పోలీసులకు సమాచారం అంది ంచాడు. వారొచ్చి విచారణ చేసి పట్టణానికి చెందిన ఎండి షఫీగా గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ చోరీలు షఫీ జిల్లాతోపాటు సూర్యపేట, నల్లగొండ, జహీరాబాద్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆత్మకూర్, కొత్తకోట తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. అన్ని ప్రాంతాల్లో ఇతనిపై కేసులు నమోదవ్వగా నవంబర్‌లో సూర్యపేట జైలు నుంచి విడుదల అయ్యాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని షఫి జనవరిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. పట్టుబడిన దొంగనుంచి నగదు, బంగారు ఆ భరణాలు, ఇతర వస్తువులను స్వాధీ నం చేసుకుని రిమాండ్‌కు పంపినట్టు సీ ఐ సూర్యనారాయణ వివరించారు. వనపర్తిలో జరిగిన వరుస చోరీలకు పాల్పడిన దొంగలను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో ఎస్ఐ ఓడి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
రాజోలు : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన మేడిచర్ల నాగభూషణాన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జీవీ కృష్ణారావు విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన నాగభూషణం జిల్లాలోని రాజోలు, నగరం, అమలాపురం, మలికిపురం, రావులపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో పలు చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి వచ్చిన అతడు మళ్లీ చోరీల బాట పట్టాడు. రాజోలు, మలికిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు సవర్ల బంగారం, రూ.10 వేల నగదు చోరీ చేశాడు. శివకోడులోని ఒక బ్రాందీషాపు వద్ద నాగభూషణాన్ని పోలీసులు పట్టుకుని రాజోలు కోర్టులో హాజరుపర్చారు. అమలాపురం డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేశారు. కేసు పురోగతిని సాధించేందుకు కృషి చేసిన ట్రైనీ ఎస్సై అజయ్‌బాబు, సర్కిల్ క్రైం హెచ్‌సీ బొక్కా శ్రీనివాస్, పీసీలు డి.శివకుమార్, డి.రమేష్‌బాబు, ఎ.జయరామ్‌ను సీఐ అభినందించారు. వీరిని రివార్డులకు సిఫారసు చేస్తానన్నారు.