క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2023కు సమయం అసన్నమవుతోంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తమ జట్లను కూడా ప్రకటించాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీలో భాగమయ్యే కామేంటేటర్‌ల జాబితాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
ఈ ఈవెంట్‌లో పాల్గోనే మొత్తం 5 దేశాల నుంచి 12 మంది వ్యాఖ్యాతలను ఏసీసీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ వాఖ్యత ఆకాశ్ చోప్రాకు చోటుదక్కకపోవడం గమానార్హం. ఈ కామేంటరీ ప్యానల్‌లో భారత నుంచి గౌతమ్ గంభీర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ , దీప్ దాస్‌గుప్తాకు చోటు దక్కగా.. పాకిస్తాన్ నుంచి వసీం అక్రమ్, వకార్ యూనిస్, బాజిద్ ఖాన్, రమీజ్ రాజాలకు అవకాశం లభించింది.
అదే విధంగా బంగ్లాదేశ్ నుంచి అథర్ అలీ ఖాన్, శ్రీలంక నుంచి రస్సెల్ ఆర్నాల్డ్ కూడా కామేంటరీ ప్యానల్‌లో భాగమయ్యారు. మరోవైపు స్కాట్ స్టైరిస్ తటస్థ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇక సెప్టెంబర్ 2న యావత్తు క్రికెట్ ప్రపంచం ఎదురుచూసే దాయాదుల పోరు పల్లెకెలె వేదికగా జరగనుంది.
చదవండి: IND vs WI: ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వాల్సిన అవసరం లేదు! ఇక ఆపేయండి
Comments
Please login to add a commentAdd a comment