Dinesh Karthik confirms return to commentary box for Ashes after IPL 2023 - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌కు ముందు దినేష్‌ కార్తీక్‌కు బంపరాఫర్‌.. ఒకే ఒక్కడు!

Published Thu, Mar 30 2023 4:20 PM | Last Updated on Fri, Mar 31 2023 9:21 AM

Dinesh Karthik confirms return to commentary for Ashes 2023 - Sakshi

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌కు బంపరాఫర్‌ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం కార్తీక్‌కు దక్కింది. ఈ ఏడాది జరగనున్న ఈ సిరీస్‌ కోసం స్కై క్రికెట్ ఛానెల్ తరఫున కార్తీక్ కామెంట్రీ బాక్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని డీకేనే స్వయంగా వెల్లడించాడు.

ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో కార్తీక్‌తో పాటు ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, రిక్కీ పాంటింగ్, మార్క్ టేలర్, కుమార సంగక్కర, మెల్ జోన్స్, ఇయాన్ వార్డ్, నాసీర్ హుస్సేన్, అథెర్టన్, మార్క్ బౌచర్, ఆండ్రూ స్ట్రాస్ వాఖ్యతలగా వ్యవహరించనున్నారు. కాగా భారత్ నుంచి ఈ సిరీస్‌లో కామెంట్రీ చేయబోతున్నది కార్తీక్ ఒక్కడే కావడం విశేషం.

"ఐపీఎల్‌-2023 ప్రారంభానికి ముందు ఓ బిగ్‌న్యూస్‌ను షేర్‌ చేయడానికి సిద్దమయ్యాను. 2023 యాషెస్ కామెంట్రీ ప్యానెల్‌లో నేను భాగంగా కానున్నాను. దిగ్గజాలతో కలిసి వాఖ్యతగా వ్యవహరించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కై క్రికెట్‌కు ధన్యవాదాలు" అని కార్తీక్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కూడా కార్తీక్‌ వాఖ్యతగా వ్యవహరించాడు.

ఇక జాతీయ జట్టులో కోల్పోయి కామేంటేటర్‌గా అవతారమెత్తిన డీకే.. ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు. కార్తీక్‌ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్‌లో ఫినిషర్‌గా కార్తీక్‌ అదరగొట్టాడు. ఇక ఐపీఎల్‌-2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరు వేదికగా ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. రోహిత్‌ దూరం! కెప్టెన్‌గా సూర్యకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement