
దినేశ్ కార్తిక్ డకౌట్ (PC: IPL)
IPL 2023 RR vs RCB: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీ ఆదివారం (మే 14) రాజస్తాన్‌తో తలపడుతోంది. జైపూర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
వాళ్లిద్దరు అర్ధ శతకాలతో
ఈ క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లి(18) మరోసారి నిరాశపరచగా, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 44 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ సైతం హాఫ్ సెంచరీ(33 బంతుల్లో 54 పరుగులు)తో రాణించాడు. కాగా పదిహేనో ఐదో బంతికి రాజస్తాన్ బౌలర్ కేఎం ఆసిఫ్ డుప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపగా.. మహిపాల్ లామ్రోర్ క్రీజులోకి వచ్చాడు.
తుస్సుమన్న డీకే
ఈ క్రమంలో పదహారో ఓవర్ మొదటి బంతికే ఆడం జంపా అతడిని అవుట్ చేశాడు. కేవలం ఒక్కే పరుగు చేసి ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన లామ్రోర్ స్థానంలో డీకే వచ్చాడు. ఆ మరుసటి బంతికే జంపా దినేశ్ కార్తిక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఎల్బీడబ్ల్యూ అయిన డీకే డకౌట్‌గా వెనుదిరిగాడు.
అప్పటికి ఆర్సీబీ స్కోరు 120 పరుగులు మాత్రమే! ఈ క్రమంలో మాక్సీ బ్యాట్ ఝులిపించడం.. అనూజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ 171 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో డకౌట్ కావడం ద్వారా మరోసారి చెత్త రికార్డు నమోదు చేశాడు.
చెత్త రికార్డు.. డక్‌ల వీరులు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి చరిత్రకెక్కాడు. వీరిద్దరు ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్లో 16 డక్‌లు నమోదు చేశారు. 15 డకౌట్లతో మన్‌దీప్ సింగ్, సునిల్ నరైన్ వీరి తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో డీకే ఆట తీరుపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ‘‘ఇకనైనా మారు డీకే! అప్పుడేమో ఫినిషర్‌గా అదరగొట్టావు..
ఇప్పుడేమో డకౌట్లలో రోహిత్‌తో పోటీ పడుతున్నావు. రోజురోజుకూ జట్టుకు భారంగా మారుతున్నావు’’ అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కాగా గతేడాది ఫినిషర్‌గా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన డీకే.. ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 11 ఇన్నింగ్స్‌లో చేసిన మొత్తం పరుగులు 140. అత్యధిక స్కోరు 30. ఈ గణాంకాలను బట్టి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చదవండి: #AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు
Most ducks in IPL History
— 🄺Ⓐ🅃🄷🄸🅁 1⃣5⃣ (@katthikathir) May 14, 2023
16- Dinesh Karthik
16- Rohit Sharma
Tough Competition between them 🤩#IPL2O23 #RRvRCB pic.twitter.com/6deEKumtMj