Rajasthan Royals vs Royal Challengers Bangalore Updates: ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 59 పరుగులకే సంజూ శాంసన్ సేనను కట్టడి చేసి 112 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సొంతమైదానంలో రాజస్తాన్‌ను మట్టికరిపించి రన్‌రేటు భారీగా పెంచుకుని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. సిరాజ్ తొలి వికెట్ తీసి ఖాతా వెరవగా.. పార్నెల్ మూడు వికెట్లతో చెలరేగాడు. మైకేల్ బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా.. మాక్సీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
హెట్‌మెయిర్ ఇన్నింగ్స్‌కు తెర
9.5: ఆర్సీబీతో మ్యాచ్‌లో కాస్తో కూస్తో నిలకడగా ఆడుతున్న హెట్‌మెయిర్ కూడా అవుటయ్యాడు. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపిన హిట్టర్ హెట్‌మెయిర్(19 బంతుల్లో 35 పరుగులు) బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు 59/8 (9.5)
వికెట్ కోల్పోయిన రాజస్తాన్
7.6: కర్ణ్ శర్మ బౌలింగ్‌లో హెట్‌మెయిర్, అశ్విన్ సమన్వయలోపం కారణంగా రనౌట్ సంభవించింది. అశూ డకౌట్‌గా వెనుదిరిగాడు హెట్‌మెయిర్ (32), ఆడం జంపా క్రీజులో ఉన్నారు. స్కోరు: 50-7(8)
పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్
6.6: బ్రేస్‌వెల్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ అవుట్. ఆరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్. స్కోరు: 31-6(7)
5.3: ఆర్సీబీ బౌలర్ పార్నెల్ మరోసారి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. బట్లర్, సంజూ వికెట్లు తన ఖాతాలో వేసుకున్న అతడు.. జో రూట్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ నేపథ్యంలో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 28 పరుగులు (28/5 (6)) చేసింది.
నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
4.2: బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన పడిక్కల్. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. జో రూట్, షిమ్రన్ హెట్‌మెయిర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 26/4 (4.5)
మూడో వికెట్ డౌన్
1.4: పార్నెల్ బౌలింగ్‌లో అనూజ్ రావత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన సంజూ శాంసన్(4). మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.
1.2: పార్నెల్ బౌలింగ్లో జోస్ బట్లర్ డకౌట్. సంజూ శాంసన్, జో రూట్ క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ స్కోరు: 7/2 (1.3)
యశస్వి డకౌట్
రాజస్తాన్‌కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత బంతితో స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ బౌలింగ్‌ల కోహ్లికి క్యాచ్ ఇచ్చిన యశస్వి డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆర్సీబీ స్కోరెంతంటే
జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి (18) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ డుప్లెసిస్(55), వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్(54) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖర్లో అనూజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు.
17.3: సందీప్ శర్మ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ హీరో మాక్స్‌వెల్(54) బౌల్డ్. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.
►వరుస క్రమంలో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో దినేష్ కార్తీక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 123/4
మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
120 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మహిపాల్ లోమ్రోర్.. జంపా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
119 పరుగులు వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. కేఎం ఆసిఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 98/1
13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(44), మ్యాక్స్‌వెల్(33) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 78/1
10 ఓవర్లు ముగిసే ఆర్సీబీ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(37), మ్యాక్స్‌వెల్(19) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
50 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఆసీఫ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి గ్లెన్ మ్యాక్స్‌వెల్ వచ్చాడు.
5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 34/0
5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(15), డుప్లెసిస్(18) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 12/0
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), డుప్లెసిస్(3) పరుగులతో ఉన్నారు.
తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ
ఐపీఎల్-2023లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. రాజస్తాన్ ఒకే మార్పు చేసింది.
తుది జట్లు:
ఆర్సీబీ
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ
రాజస్తాన్
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, కేఎం ఆసిఫ్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment