జైపూర్: ఇప్పుడు అందరి కళ్లు ప్లే ఆఫ్స్‌పైనే! ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు కూడా ముందుకెళ్లడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కనీసం ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు గుజరాత్ (8), చెన్నై (7), ముంబై (7) మూడున్నాయి. కాబట్టి ఇకపై ఈ సీజన్‌లో కసిదీరా గెలవడం కంటే కూడా రన్‌రేట్‌తో గెలిచిన జట్లే ముందంజ వేస్తాయి. అందుకేనేమో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అసాధారణ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో సజీవంగా ఉంది.
రాజస్తాన్ రాయల్స్‌ను వారి సొంతగడ్డపై 112 పరుగుల భారీ తేడాతో ఓడించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (18; 1 ఫోర్) నిరాశపరచగా... కెపె్టన్ డుప్లెసిస్ (44 బంతుల్లో 55; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. చివర్లో అనూజ్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంతో ఆర్సీబీ 170 పైచిలుకు స్కోరు చేసింది.
తర్వాత రాజస్తాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో రాజస్తాన్ ‘ప్లే ఆఫ్’ చేరే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. హెట్‌మైర్ (19 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్! ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వేన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు.
నలుగురు డకౌట్’...
172 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్లక్ష్యంగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), బట్లర్ (0) సహా అశ్విన్ (0), ఆసిఫ్ (0) ఖాతానే తెరువలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లు పార్నెల్, బ్రేస్‌వెల్, కరణ్ శర్మ మూకుమ్మడి దాడికి క్రీజులో నిలిచేందుకే ఆపసోపాలు పడ్డారు.
హెట్‌మైర్ కొట్టిన 4 సిక్సర్లు ప్రేక్షకులను అలరించాయి కానీ జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. 2017లో ఆర్సీబీ స్కోరు 49 ముందు వరుసలో ఉంటే... తర్వాత రెండు స్కోర్లు రాజస్తాన్‌వే. 2009లో 58కే కుప్పకూలిన రాయల్స్ ఇప్పుడు ఒక పరుగు ఎక్కువ చేసింది అంతే!
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆసిఫ్ 18; డుప్లెసిస్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆసిఫ్ 55; మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 54; మహిపాల్ (సి) ధ్రువ్ జురెల్ (బి) జంపా 1; దినేశ్ కార్తీక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; బ్రేస్‌వెల్ (నాటౌట్) 9; అనూజ్ రావత్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–50, 2–119, 3–120, 4–120, 5–137. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–34–1, ఆడమ్ జంపా 4–0–25–2, యజువేంద్ర చహల్ 4–0–37–0, అశ్విన్ 4–0–33–0, ఆసిఫ్ 4–0–42–2.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) విరాట్ కోహ్లి (బి) సిరాజ్ 0; బట్లర్ (సి) సిరాజ్ (బి) పార్నెల్ 0; సంజూ సామ్సన్ (సి) అనూజ్ (బి) పార్నెల్ 4; జో రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పార్నెల్ 10; దేవ్‌దత్ పడిక్కల్ (సి) సిరాజ్ (బి) బ్రేస్‌వెల్ 4; హెట్‌మైర్ (సి) బ్రేస్‌వెల్ (బి) మ్యాక్స్‌వెల్ 35; ధ్రువ్ జురెల్ (సి) మహిపాల్ (బి) బ్రేస్‌వెల్ 1; అశ్విన్ (రనౌట్) 0; ఆడమ్ జంపా (బి) కరణ్ శర్మ 2; సందీప్ శర్మ (నాటౌట్) 0; ఆసిఫ్ (సి) విరాట్ కోహ్లి (బి) కరణ్ శర్మ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (10.3 ఓవర్లలో ఆలౌట్) 59. వికెట్ల పతనం: 1–1, 2–6, 3–7, 4–20, 5–28, 6–31, 7–50, 8–59, 9–59, 10–59. బౌలింగ్: సిరాజ్ 2–0–10–1, వేన్ పార్నెల్ 3–0–10–3, బ్రేస్‌వెల్ 3–0–16–2, కరణ్ శర్మ 1.3–0–19–2, మ్యాక్స్‌వెల్ 1–0–3–1.
Comments
Please login to add a commentAdd a comment