IPL 2023, RCB Vs RR: Don't Have Answers, Sanju Samson In Batting Collapse 59 All Out - Sakshi
Sakshi News home page

#RCB vs RR: బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది.. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు! నా దగ్గర ఆన్సర్‌ లేదు!

Published Sun, May 14 2023 7:41 PM | Last Updated on Mon, May 15 2023 9:05 AM

IPL 2023: Dont Have Answers Sanju Samson on Batting Collapse 59 All Out - Sakshi

IPL 2023 RR vs RCB: ‘‘టాపార్డర్‌లో ముగ్గురం బాగానే స్కోర్‌ చేస్తామనుకున్నాం. పవర్‌ ప్లేలో పరుగులు రాబట్టాలనుకున్నాం. కానీ ఈరోజు అది సాధ్యపడలేదు. నిజానికి టోర్నీ ఆరంభం నుంచి జైశ్వాల్‌, జోస్‌ అద్భుతంగా ఆడుతున్నారు.

కానీ ఈరోజు ఈ పిచ్‌పై ఇలా జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపునకు ఆర్సీబీ బౌలర్లకే క్రెడిట్‌ ఇవ్వాలి. ఆద్యంతం అద్బుతమైన ఎనర్జీతో.. గెలవాలన్న కసితో బౌల్‌ చేశారు. ఒకవేళ మేము పవర్‌ప్లేలో మంచిగా స్కోర్‌ చేసి ఉంటే.. లక్ష్యాన్ని ఛేదించగలిగే వాళ్లవేమో!

సమష్టి వైఫల్యం
కానీ మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదు. మా బ్యాటింగ్‌ వైఫల్యానికి కారణమేమిటన్న ప్రశ్నకు నా దగ్గర ప్రస్తుతం సమాధానం లేదు. ఐపీఎల్‌ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంచనాలు తారుమారు అవడం సహజం. 

ఈసారి లీగ్‌ దశలో ఎలాంటి సరదా ఘటనలు జరిగాయో చూశాం. ఈ పరాజయం కారణంగా మేము కుంగిపోము. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ప్రస్తుతం మా దృష్టి మొత్తం తదుపరి మ్యాచ్‌పైనే ఉంది. మేము మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సిన తరుణం. ఈ ఓటమికి ఎవరో ఒకరు కారణం కాదు.. ఇది జట్టు సమష్టి వైఫల్యం’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ విచారం వ్యక్తం చేశాడు.

కాగా ఐపీఎల్‌-2023లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సొంతమైదనాంలో టాస్‌ ఓడి తొలుత ఫీల్డింగ్‌ చేసిన సంజూ శాంసన్‌ సేనకు 172 పరుగుల లక్ష్యం విధించింది ఆర్సీబీ.

ఈ క్రమంలో టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో పవర్‌ ప్లేలో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేక కేవలం 59 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

కుప్పకూలిన బ్యాటింగ్‌ ఆర్డర్‌
ఆర్సీబీ బౌలర్ల సమష్టి ప్రదర్శన కారణంగా 10.3 ఓవర్లలోనే రాజస్తాన్‌ కథ ముగిసిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌ డకౌట్‌ కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. నాలుగో స్థానంలో వచ్చిన జోరూట్‌ 10, తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన పడిక్కల్‌ 4, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ 35, ధ్రువ్‌ జురెల్‌ 1, అశ్విన్‌ 0, ఆడం జంపా 2, సందీప్‌ శర్మ 0, కేఎమ్‌ ఆసిఫ్‌ 0 స్కోరు చేశారు.

దీంతో 112 పరుగుల భారీ తేడాతో రాజస్తాన్‌ ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించిన వేన్‌ పార్నెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: రోహిత్‌ శర్మతో పోటాపోటీ.. నువ్వు మారవా? ఫ్యాన్స్‌ ఫైర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement