'They didn't really get us out, but we got ourselves out': Kumar Sangakkara - Sakshi
Sakshi News home page

IPL 2023: వాళ్లు మమ్మల్ని అవుట్‌ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా..

Published Mon, May 15 2023 12:06 PM | Last Updated on Mon, May 15 2023 12:18 PM

They Didnt Really Get Us Out But We Got Ourselves Out: Sangakkara - Sakshi

ఆర్సీబీ చేతిలో రాజస్తాన్‌ చిత్తు (PC: IPL)

IPL 2023 RR vs RCB: ‘‘ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్‌ మరీ చెత్తగా ఉంది. మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. ప్రత్యర్థిని 171 పరుగులకు కట్టడి చేశారు. ఇలాంటి పిచ్‌ మీద ఈ టార్గెట్‌ సులువుగానే ఛేదించవచ్చు. అయితే, పవర్‌ ప్లేలోనే మా వాళ్లు తడబడ్డారు. పరుగులు రాబట్టాలన్న తొందరలో వికెట్లు పారేసుకున్నారు’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌ కుమార్‌ సంగక్కర అన్నాడు.

బ్యాటర్ల వైఫల్యం కారణంగానే ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ పరాజయం పాలైంది. 59 పరుగులకే ఆలౌట్‌ అయి 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సంజూ శాంసన్‌ సేన ప్లే ఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 

అప్పుడే ఆట ముగిసిపోయింది
ఈ నేపథ్యంలో సంగక్కర మాట్లాడుతూ.. ‘‘భాగస్వామ్యాలు నమోదు చేయాలని మా వాళ్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ.. పవర్‌ ప్లేలోనే ఐదు వికెట్లు కో​ల్పోయాం. అప్పుడే మా ఆట దాదాపుగా ముగిసిపోయింది.

సంజూ తరచుగా ఈరోజు ఆడినటువంటి షాట్‌ ఆడుతూ ఉంటాడు. కానీ అన్నిసార్లూ రోజులు మనవి కావు. అతడు దూకుడైన ఆటగాడు. జట్టును గెలిపించాలనే తపనతో ఆడతాడు. అయితే, టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పవర్‌ ప్లేలో సగం వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది.

వాళ్లు అవుట్‌ చేయలేదు.. మా అంతట మేమే
నిజానికి ఆర్సీబీ బౌలర్లు మమ్మల్ని అవుట్‌ చేసినట్లు అనిపించలేదు. మాకు మేమే అవుటైనట్లు కనిపించింది. ఈ ఓటమి ఎవరో ఒకరు బాధ్యులు కారు. బ్యాటింగ్‌ విభాగం మొత్తం ఈరోజు విఫలమైంది’’ అని విచారం వ్యక్తం చేశాడు. తదుపరి పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలుస్తామని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు.

కాగా ఆర్సీబీతో ఆదివారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌ డకౌట్‌ కాగా.. సంజూ శాంసన్‌ 4 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన జోరూట్‌ 10, తర్వాతి స్థానాల్లో వచ్చిన పడిక్కల్‌ 4, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ 35, ధ్రువ్‌ జురెల్‌ 1, అశ్విన్‌ 0, ఆడం జంపా 2, సందీప్‌ శర్మ 0, కేఎమ్‌ ఆసిఫ్‌ 0 పూర్తిగా విఫలమయ్యారు.

చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్‌రౌండర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement