Kumar Sangakkara
-
ENG VS SL 3rd Test: రూట్ ఖాతాలో భారీ రికార్డు
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వద్ద రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ స్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఉండేవాడు. సంగక్కర 134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు చేయగా.. రూట్ తన 146వ టెస్ట్‌లో సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. సంగక్కర రికార్డు బద్దలు కొట్టాక రూట్ మరో పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 12402 పరుగులు ఉన్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ 83 పరుగులు చేసుంటే టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా అవతరించేవాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఇంగ్లండ్‌కే చెందిన అలిస్టర్ కుక్ ఉన్నాడు. కుక్ ఖాతాలో 12472 టెస్ట్ పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగుల రికార్డు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఖతాలో 15921 పరుగులు ఉన్నాయి. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ (13378), జాక్ కల్లిస్ (13289), రాహుల్ ద్రవిడ్ (13288) టాప్-4 టెస్ట్ రన్ స్కోరర్లుగా ఉన్నారు.70 పరుగులకే 6 వికెట్లు..మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. ఆ జట్టు 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెన్ డకెట్ 7, డేనియల్ లారెన్స్ 35, ఓలీ పోప్ 7, జో రూట్ 12, హ్యారీ బ్రూక్ 3, క్రిస్ వోక్స్ 0 పరుగులకు ఔటయ్యారు. లంక బౌలర్లలో లహీరు కుమార 3, విశ్వ ఫెర్నాండో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.కాగా, శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. -
గంభీర్ అవుట్.. శ్రీలంక క్రికెట్ దిగ్గజానికి ఛాన్స్?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కర కొత్త ఫ్రాంచైజీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం దాదాపుగా ఖారారు కావడంతో.. టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సంగక్కర ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.స్పోర్ట్స్ టుడే రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ 2025లో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా సంగక్కర బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు వినికిడి. ఇప్పటికే అతడితో కేకేఆర్ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు స్పోర్ట్స్ టుడే తమ కథనంలో పేర్కొంది. కాగా గత సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఆఫ్రాంచైజీని వీడి భారత్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి స్ధానాన్ని ఇంకా ఎవరితో కేకేఆర్ మెనెజ్‌మెంట్ భర్తీ చేయలేదు. ఈ క్రమంలోనే సంగక్కరతో కేకేఆర్ మెనెజ్‌మెంట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ శ్రీలంక క్రికెట్ దిగ్గజం స్ట్రోక్‌ప్లే, మైండ్ గేమ్‌కు పెట్టింది పేరు. అతడి నేతృత్వంలోనే ఐపీఎల్-2022లో రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది. -
గిల్‌క్రిస్ట్ టాప్-3 వికెట్ కీపర్లు వీరే.. ధోనికి ఛాన్స్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. తన బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్‌తో ప్రత్యర్ధిలకు చుక్కలు చూపించిన చరిత్ర గిల్ క్రిస్ట్ది. ఈ ఆసీస్ క్రికెట్ దిగ్గజం తనకు ఇష్టమైన ముగ్గురు వికెట్ కీపర్లను తాజాగా ఎంచుకున్నాడు. అందులో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంస్ ధోనికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం తన రోల్ మోడల్ అయిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్‌కు గిల్‌క్రిస్ట్ ఇచ్చాడు."రోడ్నీ మార్ష్ నా రోల్‌మోడల్. అతడిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్‌గా ఎదిగాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ఫీల్డ్‌లో ధోని ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతడి కూల్‌నెస్ అంటే నాకెంతో ఇష్టం. ఇక చివరగా నా మూడో ఫేవరేట్ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర. అతడొక క్లాస్. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు టాప్ ఆర్డర్లో విజయవంతమైన బ్యాటర్" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్‌గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్‌క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్‌రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్‌ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
ఆండ్రూ ఫ్లింటాప్ కాదు.. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా శ్రీలంక లెజెండ్!?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాథ్యూ మోట్పై వేటు వేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్దమైంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 వరల్డ్‌కప్-2024లో ఇంగ్లండ్ జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాథ్యూ మోట్‌ను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించాలని ఈసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అతడి స్ధానంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కరను తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో ఈసీబీ చర్చలు కూడా జరిపినట్లు వినికిడి. కుమార్ సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. అయితే ఆ పదవిని భారత మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు హెడ్‌కోచ్‌గా సంగక్కర వెళ్లనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్‌గా ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపించాయి.కానీ ఫ్లింటాప్ మాత్రం హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి చూపలేదంట. ఈ నేపథ్యంలోనే ఈసీబీ పెద్దలు చర్చలు సంగక్కరతో జరిపినట్లు తెలుస్తోంది. ఇక వన్డే ప్రపంచకప్-2023, టీ20 వరల్డ్‌కప్-2024 రెండింటిలోనూ ఫైనల్‌కు ఇంగ్లండ్‌ను చేర్చడంలో విఫలమైనప్పటకీ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా కొనసాగించేందుకు బోర్డు మొగ్గు చూపినట్లు సమాచారం. -
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్‌గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో యశస్వి జైస్వాల్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్‌లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్‌కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్‌కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
Asia Cup 2023- India vs Pakistan- Virat Kohli Century: దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్‌కప్-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్‌కు తన అద్భుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా కోహ్లి ఇక తాజాగా మరోసారి పాక్‌పై అదిరిపోయే బ్యాటింగ్‌తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్-2023 సూపర్ -4 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో 47వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్‌ను కోహ్లి అధిగమించాడు. చెలరేగిన బ్యాటర్లు.. టీమిండియా భారీ స్కోరు ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రిజర్వ్ డే అయిన సోమవారం టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి అజేయ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకు ముందు ఆదివారం ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుబ్‌మన్ గిల్(58) అర్ధ శతకాలు సాధించారు. కాగా కొలంబోలో జరగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. వన్డేల్లో 13 వేల పరుగులు చేసేందుకు.. ఎవరికి ఎన్ని ఇన్నింగ్స్ అవసరమయ్యాయంటే? 1. విరాట్ కోహ్లి- 267 2. సచిన్ టెండుల్కర్- 321 3. రిక్కీ పాంటింగ్- 341 4. కుమార్ సంగక్కర- 363 5. సనత్ జయసూర్య- 416. చదవండి: రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్ 💯 NUMBER 4️⃣7️⃣ King @imVkohli, take a bow! 🙌😍 Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO — Star Sports (@StarSportsIndia) September 11, 2023 -
వాళ్లు మమ్మల్ని అవుట్ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా..
IPL 2023 RR vs RCB: ‘‘ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ మరీ చెత్తగా ఉంది. మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. ప్రత్యర్థిని 171 పరుగులకు కట్టడి చేశారు. ఇలాంటి పిచ్ మీద ఈ టార్గెట్ సులువుగానే ఛేదించవచ్చు. అయితే, పవర్ ప్లేలోనే మా వాళ్లు తడబడ్డారు. పరుగులు రాబట్టాలన్న తొందరలో వికెట్లు పారేసుకున్నారు’’ అని రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్ కుమార్ సంగక్కర అన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ పరాజయం పాలైంది. 59 పరుగులకే ఆలౌట్ అయి 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సంజూ శాంసన్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పుడే ఆట ముగిసిపోయింది ఈ నేపథ్యంలో సంగక్కర మాట్లాడుతూ.. ‘‘భాగస్వామ్యాలు నమోదు చేయాలని మా వాళ్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ.. పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయాం. అప్పుడే మా ఆట దాదాపుగా ముగిసిపోయింది. సంజూ తరచుగా ఈరోజు ఆడినటువంటి షాట్ ఆడుతూ ఉంటాడు. కానీ అన్నిసార్లూ రోజులు మనవి కావు. అతడు దూకుడైన ఆటగాడు. జట్టును గెలిపించాలనే తపనతో ఆడతాడు. అయితే, టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పవర్ ప్లేలో సగం వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. వాళ్లు అవుట్ చేయలేదు.. మా అంతట మేమే నిజానికి ఆర్సీబీ బౌలర్లు మమ్మల్ని అవుట్ చేసినట్లు అనిపించలేదు. మాకు మేమే అవుటైనట్లు కనిపించింది. ఈ ఓటమి ఎవరో ఒకరు బాధ్యులు కారు. బ్యాటింగ్ విభాగం మొత్తం ఈరోజు విఫలమైంది’’ అని విచారం వ్యక్తం చేశాడు. తదుపరి పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తామని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఆర్సీబీతో ఆదివారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా.. సంజూ శాంసన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జోరూట్ 10, తర్వాతి స్థానాల్లో వచ్చిన పడిక్కల్ 4, షిమ్రన్ హెట్మెయిర్ 35, ధ్రువ్ జురెల్ 1, అశ్విన్ 0, ఆడం జంపా 2, సందీప్ శర్మ 0, కేఎమ్ ఆసిఫ్ 0 పూర్తిగా విఫలమయ్యారు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్‌రౌండర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు'
ఐపీఎల్-2022లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్తాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరింది. కాగా రాజస్తాన్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెడ్ మెక్కాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ అదగరగొట్టగా.. బౌలింగ్‌లో మెక్కాయ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చిన మెక్కాయ్ మూడు కీలక వికెట్ల పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు మెక్కాయ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ విషయం గురించి మెక్కాయ్కు సమాచారం అందింది. అయినప్పటికీ ఓ వైపు బాధను దిగమింగుతూ మెక్కాయ్ అత్యుత్తమంగా రాణించాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంగక్కర తెలిపాడు. "మెక్కాయ్ తల్లి క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మెక్కాయ్ అద్భుతంగా రాణించాడు. కాగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది అని"సంగక్కర పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' -
'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! -
ఆస్ట్రేలియన్ క్రికెటర్ అరుదైన ఫీట్.. దిగ్గజ ఆటగాళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్‌స్మిత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 59 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా స్మిత్ ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 150వ ఇన్నింగ్స్ దగ్గర అత్యధిక పరుగులు(7993 పరుగులు) సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను(7913 పరుగులు) స్మిత్ అధిగమించాడు. కాగా స్మిత్, సంగక్కర తర్వాత వరుసగా టీమిండియా త్రయం సచిన్ టెండూల్కర్(7,869 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్(7,694 పరుగులు), రాహుల్ ద్రవిడ్(7,680 పరుగులు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా 91, అలెక్స్ క్యారీ 67, కామెరాన్ గ్రీన్ 79, స్మి్త్ 59 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా చెరో 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: అభిమానులకు బీసీసీఐ బ్యాడ్‌న్యూస్.. వరుసగా నాలుగో ఏడాది -
'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం'
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌పై ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో శాంసన్ ఒకడని అతడు కొనియాడాడు. అదే విధంగా శాంసన్ విద్వంసకర ఆటగాడు, తన బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు అని సంగక్కర తెలిపాడు. "శాంసన్ రాజస్థాన్ కెప్టెన్‌గానే కాకండా, ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అతను అద్భుతమైన ఆటగాడు, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తాడు. అతడిలో మంచి ప్రతిభ ఉంది. నేను గత సీజన్లో బాధ్యతలు చేపట్టక ముందే అతడు రాజస్థాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. నేను జట్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత ఎక్కువ అతడి గురించి తెలుసుకున్నాను. అతడికి రాజస్థాన్ రాయల్స్ జట్టు పట్ల మక్కువ ఎక్కువ. అతడు తన ఐపీఎల్ కెరీర్‌ను రాజస్థాన్‌తో ప్రారంభించాడు. అదే విధంగా అతడు కెప్టెన్సీ పరంగా కూడా అద్భుతమైన స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కచ్చింతంగా అతడికి భారత్ జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాను అని సంగక్కర పేర్కొన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో 14 మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 484 పరుగులు సాధించాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్తో మార్చి 29న తలపడనుంది. చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్‌కు లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆర్సీబీ తరపున! Happy, excited, raring to go - a few of your favourite Royals have arrived. 💗#RoyalsFamily | #TATAIPL2022 pic.twitter.com/I1Z9GGFdKD — Rajasthan Royals (@rajasthanroyals) March 18, 2022 -
IPL 2022: క్వారంటైన్ పూర్తి కానివ్వండి ఏం చేయాలో అది చేద్దాం: చహల్
IPL 2022- Rajasthan Royals Swagat: ఐపీఎల్-2022 కోసం రాజస్తాన్ రాయల్స్ సంసిద్దమవుతోంది. క్యాష్ రిచ్‌లీగ్‌లో భాగంగా నాగపూర్‌లో తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుందీ ఈ జట్టు. పుణె వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మార్చి 29న రాజస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు జట్టుతో చేరారు. కెప్టెన్ సంజూ శాంసన్ సహా యజువేంద్ర చహల్ తదితరులు రాయల్స్ క్యాంపునకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఇదిలా ఉండగా.. ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర సహా ఆటగాళ్లకు రాజస్తాన్ వినూత్న రీతిలో స్వాగతం పలికింది. ఈ క్రమంలో చహల్, అతడి భార్య ధనశ్రీకి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన రాజస్తాన్.. ‘‘మరి.. మా స్వాగతం ఎలా ఉంది చహల్’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందుకు స్పందించిన చహల్.. ‘‘మూడు రోజుల క్వారంటైన్ పూర్తి కానివ్వండి. అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం’’ అంటూ మీ స్వాగతసత్కారాలతో హృదయం ప్రేమతో నిండిపోయిందంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. కాగా బెంగళూరు ఫ్రాంఛైజీ వదిలేయడంతో ఐపీఎల్-2022 మెగా వేలంలోకి వచ్చిన చహల్‌ను రాజస్తాన్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! అయితే.. 😂😂 fire hai @KumarSanga2 🔥 pic.twitter.com/eng1wzzLs1 — Rajasthan Royals (@rajasthanroyals) March 14, 2022 #HallaBol in 𝗳𝘂𝗹𝗹 𝗽𝗼𝘄𝗲𝗿. ⚡ Welcoming One Moto India to the #RoyalsFamily as our Associate Sponsor. 💗#RoyalsFamily | #OneMotoIndia | #ElectrifyingRR pic.twitter.com/zsyUNRHJGX — Rajasthan Royals (@rajasthanroyals) March 14, 2022 Wiiiiiings 🔜 pic.twitter.com/X5q1K7bmGD — Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2022 3 days quarantine bus uske baad hum he karenge joh karna hai 💖💗 https://t.co/YBqJwOwM59 — Yuzvendra Chahal (@yuzi_chahal) March 14, 2022 -
భీకరమైన ఫామ్; మెగా టోర్నీలో 5 సెంచరీలు.. నేటితో రెండేళ్లు
సాక్షి, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీలు కాదని డబుల్ సెంచరీలను మంచీనీళ్ల ప్రాయంగా మలిచిన రోహిత్ ఆ మెగా టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అప్పటివరకు ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర పేరిట ఉండేది. రోహిత్ ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త చరిత్రను సృష్టించాడు. రోహిత్ ఆ రికార్డు సాధించి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా అప్పటి ఆసక్తికర విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. లీగ్ దశలో న భూతో భవిష్యత్తు అనేలా రోహిత్ ఆటతీరు సాగింది. కొడితే భారీ స్కోర్లు ఖాయం అనేలా అతని ఇన్నింగ్స్‌లు సాగాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై 122* పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 140 పరుగులు, ఇంగ్లండ్‌పై 102, బంగ్లాదేశ్‌పై 104 పరుగులు చేశాడు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగులతో శతకం సాధించిన రోహిత్ ఒక మేజర్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లపై మాత్రం విఫలమైన రోహిత్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరగులు చేశాడు. రోహిత్ జోరుతో టీమిండియా మరోసారి విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్ ఇదే టెంపోనూ కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లో చూపెట్టలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ ఒక్క పరుగుకే వెనుదిరగడంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే రోహిత్ ఇదే ప్రపంచకప్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. ఒక్క ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఐదు సెంచరీల సాయంతో 648 పరుగులు చేశాడు. అంతకముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(673 పరుగులు, 2003 ప్రపంచకప్), ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్( 659 పరుగులు, 2007 ప్రపంచకప్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అంతేగాక టీమిండియా తరపున సచిన్ తర్వాత ఒక ప్రపంచకప్‌లో 600 పైచిలుకు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వినూ మన్కడ్, సంగక్కర
దుబాయ్: తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. ఇందులో భారత్ నుంచి దివంగత క్రికెటర్ వినూ మన్కడ్‌కు... శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకుమార సంగక్కరకు స్థానం దక్కింది. 1978లో మృతి చెందిన వినూ మన్కడ్ భారత్ తరఫున 1947 నుంచి 1959 మధ్య కాలంలో 44 టెస్టులు ఆడి 2,109 పరుగులు చేయడంతోపాటు 162 వికెట్లు తీశారు. మేటి ఆల్‌రౌండర్‌గా పేరున్న వినూ మన్కడ్ 1952లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో ఏకంగా 97 ఓవర్లు వేశారు. దిగ్గజ క్రికెటర్ సంగక్కర శ్రీలంక తరఫున 134 టెస్టులు (12,400 పరుగులు), 404 వన్డేలు (14,234 పరుగులు), 56 టి20 మ్యాచ్‌లు (1,382 పరు గులు) ఆడాడు. వినూ మన్కడ్, సంగక్కరలతోపాటు మోంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్స్టన్ టైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్‌కేబ్ (ఆస్ట్రేలియా), డెక్స్టర్ (ఇంగ్లండ్), హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విల్లీస్ (ఇంగ్లండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు. చదవండి: సిరీస్‌తోపాటు ‘టాప్’ ర్యాంక్ సొంతం -
‘శ్రేయస్ అయ్యర్ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ కష్టమే’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఘోర పరాజయం చవిచూడటం కంటే ముందుగానే సంగక్కార ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ -2020 స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానల్లో జాయిన్ అయిన సంగక్కార లైవ్ షోలో మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ అండ్ గ్యాంగ్ బ్యాటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీ పేలవమైన బ్యాటింగ్‌ను చూస్తుంటే ఆ జట్టు టాప్-4లో నిలవడం చాలా కష్టమన్నాడు. ('నేను బౌలింగ్‌కు వస్తే గేల్ సెంచరీ చేయలేడు') ‘ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్‌లో నిలకడ కనిపించడం లేదు. వారి టాపార్డర్ రాణిస్తేనే ప్లేఆఫ్ ఆశలు పెట్టుకోవచ్చు. గ్యారంటీగా ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని చెప్పలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్లేఆఫ్ చాన్స్‌లు చాలా తక్కువ. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరింది. ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కింగ్స్ పంజాబ్ కూడా టాప్-4లో ఉంటుందనే అనుకుంటున్నా. కానీ ప్లేఆఫ్ స్థానం దక్కించుకునే నాల్గో జట్టు ఏదో చెప్పడం నాకు కష్టంగా ఉంది’ అని సంగక్కరా అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దారుణమైన ఓటమి చవిచూసింది. దాంతో ఆ జట్టు నెట్‌రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్లిపోయింది. అటు తొలుత బ్యాటింగ్‌లో నిరాశపరిచిన ఢిల్లీ, బౌలింగ్‌లో కూడా రాణించలేదు. దాంతో ముంబై ఇండియన్స్ ఈజీ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషాన్(72 నాటౌట్; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. (టాప్ లేపిన ముంబై.. చిత్తుగా ఓడిన ఢిల్లీ) -
2011 ఫిక్సింగ్ : దర్యాప్తు నిలిపివేసిన శ్రీలంక
కొలంబొ : భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫొన్సెక నేతృత్వంలోని బృందం శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.(‘సరైన టైమ్‌లో కెప్టెన్‌గా తీసేశారు’) కాగా ఈ కేసులో ఇప్పటికే మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు చేసిన మహిదానందతో పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరతో పాటు మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దెనేతో పాటు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాలను విచారించింది. విచారణలో భాగంగా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నామని.. వారి సమాధానాలతో తాము సంతృప్తి చెందినట్లు ఫొన్సెక నేతృత్వంలోని స్పెషల్ ఇన్వస్టిగేషన్ టీమ్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం అంటూ శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.( నేడు విచారణకు సంగక్కర ) కాగా 2011 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను దర్యాప్తు విభాగం సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం లంక మాజీ క్రికెటర్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అరవింద డిసిల్వాను అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ప్రపంచకప్ 2011 ఫైనల్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన వివరాలపై కూపీ లాగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కౌన్సిల్ సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణ కోసం భారత్‌కు వస్తానని పేర్కొన్నారు. ఫిక్సింగ్ ఆరోపణల్లో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ మహేలా జయవర్ధనే విచారణకు హాజరయ్యాడు. అందుకోసం కొలంబోలోని సుగతదాసా స్టేడియంలోని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి జయవర్ధనే హజరయ్యాడు. జయవర్దెనే చెప్పిన విషయాలను దర్యాప్తు బృందం రికార్డు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో జయవర్దెనే శతకం సాధించిన సంగతి తెలిసిందే. (2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం) కాగా నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై రెండో ప్రపంచకప్‌ను సాధించింది. -
నేడు విచారణకు సంగక్కర
కొలంబో: ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐయూ) ముందు నేడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర హాజరు కానున్నాడు. 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే ఈ ఆరోపణ చేశాడు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా వ్యవహరించారు. ఫొన్సెక నేతృత్వంలోని బృందం ఆ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా 2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కరను కోరింది. బుధవారం ఓపెనర్ ఉపుల్ తరంగాను రెండు గంటల పాటు విచారించింది. నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో తరంగ 20 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. ‘కమిటీ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాను. నా స్టేట్మెంట్ను వారు రికార్డు చేశారు’ అని తరంగ తెలిపాడు. కానీ ప్రశ్నలేంటో చెప్పలేదు. అప్పట్లో చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించిన శ్రీలంక విఖ్యాత ఆటగాడు అరవింద డిసిల్వాను మంగళవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. లంకలో ఫిక్సింగ్‌కు పాల్పడితే క్రిమినల్ నేరం కింద కఠినంగా శిక్షిస్తారు. లంక కరెన్సీలో రూ. 10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేలా గత నవంబర్‌లో చట్టం తెచ్చారు. -
‘నేను టాస్ ఓడిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది’
కోల్‌కతా: గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2011 ప్రపంచకప్ ఫైనల్లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది. భారత స్పిన్నర్ అశ్విన్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కుమార సంగక్కర ఈ అంశం గురించి మాట్లాడాడు. ‘టాస్ సమయంలో వాంఖెడే స్టేడియం అరుపులతో హోరెత్తుతోంది. టాస్కు సంబంధించిన నేను నా ఎంపిక చెప్పాను. కానీ ధోనికి వినబడనట్లుంది. అతను వెంటనే నువ్వు టెయిల్స్ ఎంచుకున్నావా? అని నన్ను అడిగాడు. లేదు హెడ్స్ అని చెప్పాను. అప్పటికే రిఫరీ నేను టాస్ గెలిచాను అని ప్రకటించాడు. తను ఇంకా ఏం చెప్పలేదని ధోని అనడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ టాస్ వేయాలంటూ ధోని కోరడంతో రెండోసారి వేయగా... నేను కోరుకున్న హెడ్స్ పడింది. దీంతో మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. అప్పుడు టాస్ గెలవడం అదృష్టమో కాదో తెలియదు కానీ ఒకవేళ నేను టాస్ ఓడిపోయి ఉంటే ఇండియా మొదట బ్యాటింగ్ చేసి ఉండేది. ఫలితం మరోలా ఉండేదని నేను నమ్ముతున్నా’అంటూ సంగక్కర నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. -
అందుకే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు
హైదరాబాద్: టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆ మధుర క్షణాలు అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాయి. కులశేఖర్ బౌలింగ్‌లో ధోని సిక్సర్ కొట్టిన వెంటనే యువీ ఆనందంతో ధోనిని హత్తుకునే ఉద్వేగభరిత దృశ్యాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. కానీ యువీ, ధోనిలు సంబరాలు జరుపుకుంటే అక్కడే వికెట్ల వెనకాల ఉన్న కుమార సంగక్కర చిరునవ్వును చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు. క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ, ఓటమిని అంగీకరిస్తూ గుండెల్లోని బాధను దిగమింగుకుంటూనే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. దీనికి లంక అభిమానులతో సహా, యావత్ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి సెల్యూట్ చేసింది. ఈ క్రమంలో అలాంటి బాధాకర సమయంలో కూడా తన ముఖంపై చిరునవ్వుకు గల కారణాలను సంగక్కర తాజాగా వెల్లడించారు. ‘30 ఏళ్లుగా శ్రీలంకలో నివసిస్తున్నాను (ప్రపంచకప్-2011 సమయానికి). మేము ఇబ్బందులు పడిన సందర్బాలు అనేకం. కొన్ని పరిస్థితులు మమ్మల్ని కిందికి నెట్టేశాయి. యుద్దాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఇలా అనేక సమస్యలు వచ్చాయి. కానీ శ్రీలంకలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్థితిస్థాపకత. దేని నుంచైనా త్వరగా కోలుకొని పూర్వ స్థితికి చేరుకోవాలి అనే విషయం నా దేశం నేర్పింది. ఇదే సూత్రాన్ని మేం క్రికెట్ ఆడేటప్పుడు కూడా అవలంభిస్తాము. గెలుపు కోసమే బరిలోకి దిగుతాం, రెండు కోట్ల మంది ప్రజల ముఖాలపై చిరునవ్వు కోసం ఆడతాం, పోరాడుతాం. గెలుపోటములు సహజం. కానీ ఓటమిని జీర్ణించుకొని తరువాతి మ్యాచ్ కోసం త్వరగా సన్నద్దమవుతాం. (ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్) 1996 తర్వాత మరోసారి ప్రపంచకప్ గెలవడానికి 2007, 2011లో అదేవిధంగా 2009,2012 (టీ20 ప్రపంచకప్)లో అవకాశం వచ్చింది. ఫైనల్ మెట్టుపై ఓడిపోయాం. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ మమ్మల్ని ఎక్కువగా బాధించింది. మంచి టీం, మంచి స్కోర్ సాధించాం, ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాం అయినా ఓడిపోయాం. అయితే కొన్ని సార్లు ఇలాంటివి సంభవిస్తాయి. ఇప్పుడు ఓడిపోయాం. అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటామా? లేక వచ్చే ప్రపంచకప్ కోసం సన్నద్దం కావాలా? మా ఆలోచన కూడా అంతే. మా ఆటగాళ్లకు కూడా ఎప్పుడూ ఒకటి చెబుతుంటా. ఎక్కువ ఎమోషన్‌గా ఉండకూడదని, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్‌గా ఉంటే తమను తాము నియంత్రించుకోలేరు’ అంటూ సంగక్కర వివరించారు. (ధోనికి ఆ హక్కు ఉంది) -
ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్
హైదరాబాద్: దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా రెండోసారి ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అపూర్వ విజయం సాధించి భారత్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు సంబంధించి ఆనాటి లంక సారథి కుమార సంగక్కర పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో సంగక్కర పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేసిన విషయాన్ని తెలుపుతూ, దానికి గల కారణాలు వెల్లడించాడు. (ధోనికి ఆ హక్కు ఉంది ) ‘నేనెప్పుడు శ్రీలంకలో అంతమంది ప్రేక్షకులను మైదానంలో చూడలేదు. ఆ స్థాయిలో అభిమానులు మైదానానికి రావాలన్నా, ఆటగాళ్లను ఉత్సాహపరచాలన్నా అది భారత్‌లోనే సాధ్యం అవుతుందనుకుంటా!. కిక్కిరిసిన ప్రేక్షకులు, భారీ శబ్దాలు, ఫైనల్ టెన్షన్‌తో టాస్కు వెళ్లాం. ధోని టాస్ వేశాడు. నేను టెయిల్స్ అన్నాను. భారీ శబ్దాల కారణంగా నేను చెప్పింది ధోనికి వినపడలేదు. అతడు నన్ను అడిగాడు..నువ్వు టెయిల్స్ అన్నావా? అని, కాదు నేను టెయిల్స్ అని అన్నాను. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో సౌండ్స్ ఉన్నాయో. ఇక మ్యాచ్ రిఫరీ వచ్చి శ్రీలంక టాస్ గెలిచిందని చెప్పగా ధోని గందరగోళంగా ఉందని మరోసారి టాస్ వేయాలని రిఫరీని, నన్ను కోరాడు. దీంతో మరోసారి టాస్కు వెళ్లాం. (నన్ను అవమానించారు.. లేదు మనోజ్!) మరోసారి టాస్ వేయగా మళ్లీ మేమే గెలిచాం బ్యాటింగ్ తీసుకున్నాం. బహుశా రెండో సారి మేము టాస్ ఓడిపోయి ఉంటే టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకునేది కావచ్చు. మేము లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం కావచ్చు. ఎందుకంటే ఐదు, ఆరు స్థానాల వరకు మా బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. అప్పటికీ మేము బ్యాటింగ్‌లో పలు ప్రయోగాలు చేసి విజయవంతమయ్యాం. ఇక మాథ్యూస్ గాయం కూడా మా ఓటమికి కారణమైంది. అతడు ఆరోజు మ్యాచ్‌లో ఉండి ఉంటే మేము ఛేజింగ్ వైపు మొగ్గు చూపేవాళ్లం. ఎందుకంటే అవసరమైన సమయంలో టెయిలెండర్ల సహాయంతో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను గట్టెక్కించేవాడు. జరిగిందేదో జరిగిపోంది. టీమిండియా అద్భుతంగా ఆడింది. ధోని తన స్టైల్లో సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించాడు’అని పేర్కొంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు సంగక్కర. -
నేను 8 వికెట్లు తీయలేనా..!
కొలంబో: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు (800) నెలకొల్పిన దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన ఆఖరి టెస్టులో ఈ ఘనత నమోదు చేసాడు. 2010లో స్వదేశంలో భారత్‌తో జరిగిన ఈ సిరీస్‌కు ముందే తాను మొదటి టెస్టు మాత్రమే ఆడి రిటైర్ అవుతానని అతను ముందే ప్రకటించాడు. అప్పటికి అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. అయితే సహచరుడు సంగక్కర మాత్రం 800 మైలురాయిని వచ్చేవరకు ఆడాల్సిందేనని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అవసరమైతే తర్వాతి టెస్టునుంచి విశ్రాంతి తీసుకొని లేదా మరుసటి సిరీస్ అయినా ఆడాల్సిందే తప్ప ఇలా తప్పుకోవద్దని మళ్లీ మళ్లీ చెప్పాడు. దీనిపై స్పందించిన మురళీ...‘నేను నిజంగా అత్యుత్తమ స్పిన్నర్నే అయితే ఒకే టెస్టులో 8 వికెట్లు తీస్తాను తప్ప ఇలా సాగదీయను’ అని బదులిచ్చాడు. చివరకు అతను అన్నట్లుగానే సరిగ్గా 8 వికెట్లు తీసి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. గురువారం భారత స్పిన్నర్ అశ్విన్‌తో జరిపిన ఇన్స్టాగ్రామ్ సంభాషణలో సంగక్కర ఇది వెల్లడించాడు. -
ఆ జాబితాలో ఇండియా ఆటగాళ్లు ఒక్కరు లేరు
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు, తనతో కలిసి ఆడిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించాడు. ఈ 11మంది ఆటగాళ్లలో ఇద్దరు విదేశీయులు తప్ప మిగతావారంతా ప్రొటీస్ జట్టుకు ఆడినవారే కావడం గమనార్హం. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్, శ్రీలంక మాజీ వికెట్‌కీపర్ కుమార సంగక్కరలు ఓపెనర్లుగా, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ నాలుగో స్థానంలో, వరల్డ్ బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తుంపుపొందిన జాంటీ రోడ్స్ ఐదో స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే వికెట్ కీపర్‌గా ఉన్న క్వింటన్ డికాక్‌ను ఎంపిక చేశాడు. బౌలర్ల జాబితాలో ఆసీస్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ చోటు సంపాధించగా మిగతావారంతా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్లే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ అలెన్ డొనాల్డ్ కూడా ఉన్నాడు. స్టెయిన్ అత్యుత్తమ జట్టు : గ్రేమి స్మిత్, కుమార సంగక్కర, డేవ్ హాకిన్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, క్వింటన్ డికాక్, బ్రెట్ బార్గియాచి, పీటర్ లాంబార్డ్, బ్రెట్ లీ, పాల్ హరిస్, అలెన్ డొనాల్డ్ -
పాక్‌కు వెళ్లే సంగక్కర జట్టు ఇదే..
లండన్: వచ్చే నెలలో పాకిస్తాన్లో పర్యటించనున్న కుమార సంగక్కర నేతృత్వంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) జట్టును ప్రకటించారు. ఈ మేరకు 12 మందితో కూడిన ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ జట్టును ఎంసీసీ తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో సంగక్కర సారథిగా వ్యవహరిస్తుండగా, మరో సీనియర్ క్రికెటర్ రవి బొపారాను సైతం ఎంపిక చేశారు. పాక్ పర్యటనలో ఎంసీసీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) జట్లైన లాహోర్ క్వాలండర్స్-ముల్తాన్ సుల్తాన్స్‌తో ఎంసీసీ ఆడనుంది. ఇక మూడో మ్యాచ్‌ను పాకిస్తాన్ దేశవాళీ టీ20 మ్యాచ్ విజేత నార్తరన్తో ఎంసీసీ జట్టు తలపడుతోంది. తమ దేశంలో క్రికెట్‌ను బతికించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఎంసీసీ గత నెల్లో ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కర సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు పంపాలని నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తరహా దేశాల్లో క్రికెట్‌ను బ్రతికించడం చాలా ముఖ్యమని భావించిన ఎంసీసీ.. పాక్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయనే చెప్పాలనే ఉద్దేశంతోనే తమ జట్టును అక్కడకు పంపుతుంది. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లు గాయాలు బారిన పడ్డా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ఘటనలో కుమార సంగక్కర సైతం గాయపడ్డాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి. భద్రతాపరంగా అన్ని హామీలు లభించిన తర్వాత అందుకు సమాయత్తమవుతున్నాయి. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, శ్రీలంక అక్కడకు తరుచూ వెళుతూనే ఉంది. ఇటీవల శ్రీలంక జట్టు.. పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడింది. ఆ దాడి తర్వాత పాక్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్ కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ సైతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ ఆడిన బంగ్లాదేశ్.. పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. పాక్‌కు వెళ్లే ఎంసీసీ జట్టు ఇదే.. కుమార సంగక్కర(కెప్టెన్), రవి బొపారా, మైకేల్ బర్జెస్, ఒలివర్ హానన్, ఫ్రెడ్ క్లాసెన్, మైకేల్ లీస్క్, అర్రోన్ లిల్లీ, ఇమ్రాన్ క్వాయమ్, విల్ రోడ్స్, సఫ్యాన్ షఫ్రీ, వాన్ డెర్ మెర్వీ, రాస్ వైట్లీ -
అతని భార్య గురించి కామెంట్ చేశా: ఇర్ఫాన్
న్యూఢిల్లీ: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన జ్ఞాపకాలను ఒక్కోక్కటిగా నెమరువేసుకుంటున్నాడు. భారత క్రికెట్లో ఒక వెలుగు వెలిగి అలానే జట్టుకు దూరమైన ఇర్ఫాన్.. ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో ఆ జట్టు దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరాను స్లెడ్జ్ చేయడాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రధానంగా కుమార సంగక్కరాను స్లెడ్జ్ చేసే క్రమంలో అతని భార్య గురించి కూడా కామెంట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా ఇర్ఫాన్ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి:ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు) ‘ ఆ మ్యాచ్‌లో నేను రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేశా. అప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చా. ఆ మ్యాచ్‌ను లంకేయులు కోల్పోతారనే విషయం సంగక్కరాకు తెలుసు. ఆ క్రమంలోనే నాపై స్లెడ్జింగ్‌కు దిగాడు. అది వ్యక్తిగత దూషణ. నేను కూడా వ్యక్తిగత దూషణకే దిగా. ప్రత్యేకంగా అతని భార్య గురించి కామెంట్ చేశా. అతను కూడా నా తల్లి దండ్రుల గురించి వ్యాఖ్యలు చేశాడు. అది మా మధ్య అగ్గి రాజేసింది. ఆ మ్యాచ్ తర్వాత కూడా మేమిద్దరం సంతోషంగా లేము.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు కూడా’ అని ఒకనాటి చేదు అనుభవాలను పఠాన్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.(ఇక్కడ చదవండి: బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి..)