
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్‌వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు
లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌వెల్లా పేర్కొన్నాడు.
శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు
Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే!
Comments
Please login to add a commentAdd a comment