
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడని శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇండోర్ వన్డేలో పాండ్యా (78) అద్భుత ఇన్నింగ్స్ భారత్ విజయం సులువైన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అందుకున్న పాండ్యాను కొనియాడుతూ సంగక్కర ట్వీట్ చేశారు.
‘భారత్ సిరీస్ గెలిచింది. హార్థిక్ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడు. అన్ని పరిస్థితుల్లో ఆడేలా భారత్ పరిపూర్ణంగా ఉంది.’ అని సంగక్కర ట్వీట్ చేశారు. దీనికి హార్దిక్ పాండ్యా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
@BCCI seemed to canter to the series win. @hardikpandya7 is a very special player. India looks a complete side for all conditions
— Kumar Sangakkara (@KumarSanga2) 24 September 2017
Thank you for the kind words sir! 😊
— hardik pandya (@hardikpandya7) 24 September 2017