
సంగాకు ఏమైంది?
సిడ్నీ: ప్రపంచ కప్లో అద్భుత ఫామ్లో ఉన్న బ్యాట్స్మన్ శ్రీలంక వెటరన్ సంగక్కర. వరుసగా నాలుగు సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. ఈ ఈవెంట్లో టాప్ స్కోరర్ కూడా సంగాయే. 500 పరుగుల మార్క్ అధిగమించాడు.
అలాంటి సంగా.. దక్షిణాఫ్రికాతో కీలక క్వార్టర్స్ మ్యాచ్లో అంచనాలకు భిన్నంగా ఆడుతున్నాడు. సంగా మరీ టెస్టు మ్యాచ్లో మాదిరిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సంగా ఆడిన తొలి 15 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. 16 బంతికి ఎట్టకేలకు సింగిల్ తీశాడు. 27 బంతుల్లో సంగా స్కోరు 2.. 40 బంతుల్లో 6 మాత్రమే. సంగా 43వ బంతికి తొలి ఫోర్ కొట్టాడు. ఇలా 50 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. సంగక్కర బ్యాటింగ్ చూస్తే అతనేనా ఆడుతోంది అనే సందేహం రాకమానదు. మరో వైపు తిరిమన్నె మాత్రం దూకుడుగా ఆడాడు.