
శ్రీలంక జిడ్డు బ్యాటింగ్
సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఆటగాళ్లు అతిజాగ్రత్తగా ఆడుతున్నారు. సెంచరీల వీరుడు కుమార సంగక్కర బాగా జిడ్డు ఆడుతున్నాడు. 51 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి టెస్టు బ్యాటింగ్ ను తలపించాడు. జయవర్థనే కూడా ఆచితూచి ఆడాడు. 15 బంతుల్లో 4 పరుగులు చేసి నాలుగో వికెట్ గా అవుటయ్యాడు.
ఓపెనర్ దిల్షాన్ 7 బంతులాడి డకౌటయ్యాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా 10 బంతుల్లో 3 పరుగులు చేశాడు. తిరిమన్నె ఒక్కడే స్థాయికి తగినట్టు బ్యాటింగ్ చేశాడు. 48 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు.