
వన్డే ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు
తన సుదీర్ఘ కెరీర్‌ను సంతోషంగానే ముగిస్తున్నానని, వన్డే ప్రపంచకప్ గెలవకపోవడం ఒక్కటే లోటని శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర అన్నాడు. వన్డే ప్రపంచకప్‌తోనే రిటైర్ అవుదామని భావించినా సెలక్టర్లతో చర్చల తర్వాత పాకిస్తాన్, భారత్‌లతో రెండేసి టెస్టులు ఆడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. భారత్‌తో రెండో టెస్టు తర్వాత సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. తొలి టెస్టు వేదిక గాలె పట్టణం మొత్తం అతని కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది.