సంగాకు 'గార్డ్ ఆఫ్ ఆనర్' | Indian team gives guard of honour to retiring Sangakkara | Sakshi
Sakshi News home page

సంగాకు 'గార్డ్ ఆఫ్ ఆనర్'

Published Fri, Aug 21 2015 2:59 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

సంగాకు 'గార్డ్ ఆఫ్ ఆనర్' - Sakshi

సంగాకు 'గార్డ్ ఆఫ్ ఆనర్'

కొలంబో: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో చివరి టెస్టు ఆడుతున్న శ్రీలంక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కారకు అరుదైన గౌరవం లభించింది. రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం సంగక్కార బ్యాటింగ్ కు వెళుతున్న సమయంలో  కొలంబో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ప్రేక్షకులు లేచి నిలబడి  తమ హర్షధ్వానాలతో సంగా బ్యాటింగ్ కు స్వాగతం పలికారు. కాగా, కుమార సంగాక్కర క్రీజ్ లోకి వచ్చే ముందు టీమిండియా ఆటగాళ్లు వరుసగా నిలబడి  'గార్డ్ ఆఫ్ ఆనర్' తెలిపారు.  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరాచలనంతో సంగాకు అభినందనలు తెలిపాడు.
 

133 వ టెస్టు ఆడుతున్న సంగాక్కార 57.71 సగటుతో 12, 350  పరుగులు నమోదు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కూడా సంగాక్కార తనదైన ముద్రవేసిన సంగతి తెలిసిందే. 404 వన్డేలు ఆడిన సంగా 41.98 సగటుతో 14,234 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement