ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. తన బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్‌తో ప్రత్యర్ధిలకు చుక్కలు చూపించిన చరిత్ర గిల్ క్రిస్ట్‌ది. ఈ ఆసీస్ క్రికెట్ దిగ్గజం తనకు ఇష్టమైన ముగ్గురు వికెట్ కీపర్‌లను తాజాగా ఎంచుకున్నాడు.
అందులో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంస్ ధోనికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం తన రోల్ మోడల్ అయిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్‌కు గిల్‌క్రిస్ట్ ఇచ్చాడు.
"రోడ్నీ మార్ష్ నా రోల్‌మోడల్. అతడిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్‌గా ఎదిగాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ఫీల్డ్‌లో ధోని ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతడి కూల్‌నెస్ అంటే నాకెంతో ఇష్టం.
ఇక చివరగా నా మూడో ఫేవరేట్ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర. అతడొక క్లాస్. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు టాప్ ఆర్డర్‌లో విజయవంతమైన బ్యాటర్" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment