కొలంబొ : భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్‌గమగే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫొన్సెక నేతృత్వంలోని బృందం శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.(‘సరైన టైమ్‌లో కెప్టెన్‌గా తీసేశారు’)
కాగా ఈ కేసులో ఇప్పటికే మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు చేసిన మహిదానందతో పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరతో పాటు మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దెనేతో పాటు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాలను విచారించింది. విచారణలో భాగంగా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నామని.. వారి సమాధానాలతో తాము సంతృప్తి చెందినట్లు ఫొన్సెక నేతృత్వంలోని స్పెషల్ ఇన్వస్టిగేషన్ టీమ్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం అంటూ శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.( నేడు విచారణకు సంగక్కర )
కాగా 2011 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను దర్యాప్తు విభాగం సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం లంక మాజీ క్రికెటర్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అరవింద డిసిల్వాను అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ప్రపంచకప్ 2011 ఫైనల్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన వివరాలపై కూపీ లాగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కౌన్సిల్ సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణ కోసం భారత్‌కు వస్తానని పేర్కొన్నారు. ఫిక్సింగ్ ఆరోపణల్లో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ మహేలా జయవర్ధనే విచారణకు హాజరయ్యాడు. అందుకోసం కొలంబోలోని సుగతదాసా స్టేడియంలోని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి జయవర్ధనే హజరయ్యాడు. జయవర్దెనే చెప్పిన విషయాలను దర్యాప్తు బృందం రికార్డు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో జయవర్దెనే శతకం సాధించిన సంగతి తెలిసిందే. (2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం)
కాగా నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై రెండో ప్రపంచకప్‌ను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment