న్యూఢిల్లీ: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన జ్ఞాపకాలను ఒక్కోక్కటిగా నెమరువేసుకుంటున్నాడు. భారత క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగి అలానే జట్టుకు దూరమైన ఇర్ఫాన్.. ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో ఆ జట్టు దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరాను స్లెడ్జ్ చేయడాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రధానంగా కుమార సంగక్కరాను స్లెడ్జ్ చేసే క్రమంలో అతని భార్య గురించి కూడా కామెంట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా ఇర్ఫాన్ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి:ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు)
‘ ఆ మ్యాచ్‌లో నేను రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేశా. అప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో నేను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చా. ఆ మ్యాచ్‌ను లంకేయులు కోల్పోతారనే విషయం సంగక్కరాకు తెలుసు. ఆ క్రమంలోనే నాపై స్లెడ్జింగ్‌కు దిగాడు. అది వ్యక్తిగత దూషణ. నేను కూడా వ్యక్తిగత దూషణకే దిగా. ప్రత్యేకంగా అతని భార్య గురించి కామెంట్ చేశా. అతను కూడా నా తల్లి దండ్రుల గురించి వ్యాఖ్యలు చేశాడు. అది మా మధ్య అగ్గి రాజేసింది. ఆ మ్యాచ్ తర్వాత కూడా మేమిద్దరం సంతోషంగా లేము.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు కూడా’ అని ఒకనాటి చేదు అనుభవాలను పఠాన్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.(ఇక్కడ చదవండి: బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి..)
Comments
Please login to add a commentAdd a comment